Excellence Award
-
ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్ అవార్డు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విద్యా బోదనకు గాను ‘ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యకు శ్రీకారం చుడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యా విప్లవానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బ్లాక్ బోర్డు స్థానంలో తెచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ), బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల ద్వారా ఆధునిక బోధనకు గాను రాష్ట్రాన్ని ఈ అవార్డు వరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమర్చిన ఐఎఫ్‌పీలు, 8, 9వ తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన, సందేహాల నివృత్తికి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమం బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అవార్డు ఎంపికలో కీలకపాత్ర వహించింది. దేశంలోనే అత్యుత్తమ విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా అత్యున్నత అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఇద్దరు అధికారులను రాష్ట్రానికి పంపింది. కేంద్ర డిప్యూటీ కార్యదర్శులు ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌తో కూడిన బృందం గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైసూ్కల్, గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పట్టాభిపురంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలను సందర్శించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరికి పాఠశాలల్లో అమలు చేస్తున్న సాంకేతిక విద్యా బోధన గురించి వివరించారు. ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’పై ప్రశంసలు కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక బోధన పద్ధతులు, వసతులను తిలకించిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌లు.. వారిలోని అద్భుతమైన మేధస్సు, సబ్జెక్టుల వారీగా పట్టు, ఇంగ్లిష్ భాష పరిజ్ఞానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల ద్వారా ఇన్నోవేటివ్ ట్రెండ్స్, స్విఫ్ట్‌చాట్ యాప్, బైజూస్ కంటెంట్‌ను ఇంజినీరింగ్ విద్యార్థులు బోధిస్తున్న తీరును, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ తదితర సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పింస్తున్న తీరును పరిశీలించారు. ఐఎఫ్‌పీల ద్వారా ఉపాధ్యాయుల బోధనను ప్రత్యక్షంగా తిలకించారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలను నేర్చుకుంటున్నదీ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. తరగతులను బోధిస్తున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతోనూ మాట్లాడారు. మూడు పాఠశాలల సందర్శన ముగించుకున్న అధికారుల బృందం.. సంబంధిత విద్యార్థులు చదువుతున్న కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో చర్చించారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో పి.శైలజ, సీఎస్ఈ ఐటీ సెల్ ప్రతినిధి రమేష్, హెచ్ఎంలు ఉన్నారు. -
టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ను జాతీయ స్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలు వరించాయి. రోడ్డు భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వాడకంలో ఈ అవార్డులు లభించాయి. నష్టాలను అధిగమించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో అంతర్గతంగా చేస్తున్న కొత్త ఆవిష్కరణలకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) 2022–23కుగాను తెలంగాణ ఆర్టీసీని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నాలుగు ఫస్ట్.. ఒకటి సెకండ్.. రోడ్డు భద్రత విభాగానికి సంబంధించి మఫిసిల్ కేటగిరీ (బస్సుల సంఖ్య 4,001–7,500 ఉన్న సంస్థల పరిధి)లో ఆర్టీసీ మొదటి స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ... రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల ప్రమేయం తక్కువ ఉండేలా చూడటంలో టీఎస్ఆర్టీసీ తొలి నుంచీ టాపర్‌గా ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు కారణమైన నిష్పత్తి 0.05గా ఉంది. ఇంధన పొదుపులోనూ ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరుకు తిరిగే కిలోమీటర్ల (కేఎంపీఎల్) విషయంలో ఉత్తమంగా నిలిచింది. మఫిసిల్ కేటగిరీలో 5.35 కేఎంపీఎల్‌తో మొదటి స్థానం, పట్టణ ప్రాంతాల కేటగిరీలో 4.61 కేఎంపీఎల్‌తో రెండో స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్టీసీ బస్సులు సగటున ప్రతి లీటరు డీజిల్‌కు దాదాపు 5.14 కి.మీ. మేర తిరుగుతున్నాయి. ఇక సిబ్బంది సంక్షేమం, ఉత్పాదకత కేటగిరీలో తొలి స్థానంలో నిలిచింది. గతేడాది ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసింది. తీవ్ర గుండె సమస్యలున్న 250 మందిని గుర్తించి వారికి చికిత్సలు అందిస్తోంది. సిబ్బంది నైపుణ్యం పెరిగేలా సామూహిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. వాటికి ఈ పురస్కారం లభించింది. డిజిటల్ కార్యక్రమాల అమలు విభాగంలోనూ సంస్థకు మొదటి స్థానం సాధించింది. ప్రయాణికులు, సిబ్బంది కోసం కొత్త యాప్‌లు, టికెట్ల రిజర్వేషన్ పద్ధతిలో మార్పులు, బస్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్ తదితరాలకు ఈ పురస్కారం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. అధికారులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఈ పురస్కారాలు లభించాయని, ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనగా ఉత్తమ పనితీరుతో టీఎస్ఆర్టీసీ దేశంలోని ఇతర ఆర్టీసీలకు ఆదర్శంగా నిలిచిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొనియాడారు. -
Aditi Sen De: అద్వితియ ప్రతిభ
పాపులర్ అయిన తరువాత ఆ బాటలో ప్రయాణించడం విశేషమేమీ కాదు. దార్శనికులు మాత్రం వర్తమానంలో ఉంటూనే భవిష్యత్ వెలుగును దర్శిస్తారు. ఇలాంటి వారిలో ఒకరు అదితి సేన్ డె. ‘క్వాంటమ్’ అనే కాంతి మిణుకు మిణుకుమంటున్న కాలంలోనే దాని ఉజ్వల కాంతిని ఊహించింది అదితి. క్వాంటమ్ సైన్స్‌లో చేసిన కృషికి డా.అదితి సేన్ డె ‘జీడీ బిర్లా అవార్డ్ ఫర్ సైంటిఫిక్ ఎక్సెలెన్స్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డ్‌కు ఎంపికైన 33వ శాస్త్రవేత్త, తొలి మహిళా శాస్త్రవేత్త అదితి సేన్ గురించి.... అలహాబాద్‌లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ (క్యూఐసీ)లో అదితి ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ‘క్యూఐసీ’ అనేది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యున్నత రూపం. ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల శాస్త్రం. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన పరిశోధన రంగాలలో క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ ఒకటి’ అంటుంది అదితి. కోల్‌కతాలో పుట్టి పెరిగిన అదితికి చిన్నప్పటి నుంచి గణితం ఇష్టమైన సబ్జెక్ట్. తల్లి లక్ష్మి టీచర్. తండ్రి అజిత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. కలకత్తా యూనివర్శిటీలో అప్లాయిడ్ మ్యాథమేటిక్స్‌లో ఎంఎస్సీ చేసిన అదితి పోలాండ్లోని గడాన్స్క్ యూనివర్శిటీలో భౌతికశాస్త్రంలో పీహెచ్డీ చేసింది. తన థీసీస్‌కు క్వాంటమ్ ఫిజిక్స్‌కు సంబంధించిన అంశాన్ని ఎంచుకుంది. ‘రెండు వేల సంవత్సరంలో నా కెరీర్‌ను మొదలు పెట్టాను. ఆ సమయంలో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రారంభ దశలో ఉంది. పరిమిత సంఖ్యలో అప్లికేషన్లు ఉండేవి’ అంటూ ఆనాటి పరిమితులను గుర్తు తెచ్చుకుంటుంది అదితి. పరిమితులు, ప్రతిబంధకాలతో పనిలేకుండా ‘క్వాంటమ్ ఫిజిక్స్’పై తన ఇష్టాన్ని పెంచుకుంటూ పోయింది. కాలంతో పాటు నడుస్తూ, ఎప్పటికప్పుడు ‘క్వాంటమ్ ఫిజిక్స్’ను అధ్యయనం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. క్వాంటమ్ థర్మల్ యంత్రాల రూపకల్పన(బ్యాటరీలు, రిఫ్రెజిరేటర్లాంటివి) నుంచి క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ అల్గారిథమ్‌ల సమర్థవంతమైన అమలు, సూటబుల్ క్వాంటమ్ సిస్టమ్స్ వరకు... ఎన్నో విషయాలపై పని చేస్తోంది అదితి. ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ (2018) అందుకుంది. 2022లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మెంబర్‌గా ఎంపికైంది. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ స్విన్సిస్టమ్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ విత్ అల్ట్రా– కోల్డ్ గ్యాసెస్, క్వాంటమ్ కోరిలేషన్స్... మొదలైన వాటికి సంబంధించి అదితి లెక్చర్స్, టాక్స్ ఆదరణ పొందాయి. బెనర్జీ, శ్రీజన్ ఘోష్, శైలాధిత్యలతో కలిసి ‘స్ప్రెడింగ్ నాన్ లోకాల్టీ ఇన్ క్వాంటమ్ నెట్వర్క్స్’, కవన్ మోదీ, అరుణ్ కుమార్, ఉజ్వల్ సేన్లతో కలిసి ‘మాస్కింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపాజిబుల్...మొదలైన పుస్తకాలు రాసింది. క్లాసులో పాఠం చెప్పినా, సెమినార్లో ఉపన్యాసం ఇచ్చినా, పుస్తకం రాసినా విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తనదైన శైలిని ఎంచుకుంది. సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో కమ్యూనికేట్ చేయడం ఆమె శైలి. ‘క్వాంటమ్’పై ఆసక్తి చూపుతున్న ఈతరంలోని చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు అదితి సేన్. ‘క్వాంటమ్’ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. సమన్వయం చేసుకుంటూ... కెరీర్, ఫ్యామిలీలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడంపైనే మహిళా శాస్త్రవేత్తల కెరీర్ కొనసాగుతుందా, ఆగిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అయితే కెరీర్, ఫ్యామిలీని సమన్వయం చేసుకుంటూ వెళితే సమస్యలు ఉండవు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత తిరిగి పనిలో చేరి అద్భుతమైన శక్తిసామర్థ్యాలను చాటుకున్న మహిళా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు. – అదితి సేన్ -
ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి,హైదరాబాద్: ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం.’అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’ వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల’కోసం ఎంట్రీలను ఆహ్వనిస్తోంది. 2023కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు మార్చి 30, 2024 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా ఎంట్రీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’ కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసిం చడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’ అభిలషిస్తోంది. ‘సాక్షి’ చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–23256134 నంబర్‌పై గానీ, మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com కేటగిరీలు ఇలా: ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ► ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ► ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ► ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ► ఎక్స్‌లెన్స్ ఇన్ ఫార్మింగ్ ► బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ► బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ►ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ►ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ► ఎక్స్‌లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఎన్జీఓ యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – ఎడ్యుకేషన్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ – సోషల్ సర్వీస్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ► యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఎన్జీఓ -
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి నాటా ఎక్స్ లెన్స్ అవార్డ్
-
ఎంపీ భరత్‌కు ఇండో అరబ్ ఎక్సలెన్స్ అవార్డ్
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సా ర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజ మహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌కు ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సోమవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జీ–20 ఇండియా ప్రెసిడెన్సీ సెలబ్రేషన్స్‌లో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేతుల మీదుగా ఎంపీ భరత్‌కు ఈ అవార్డ్‌ను అందజేశారు. యువతా హరితా, గోగ్రీన్ చాలెంజ్ పేరుతో ఎంపీ భరత్‌రామ్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డ్‌ను ప్రదానం చేసినట్లు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ఇండో అరబ్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు రావడంపై ఎంపీ భరత్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ అవార్డును రాజమహేంద్రవరం విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలకు అంకితమిస్తున్నానని తెలిపారు. ఇది కూడా చదవండి: నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం -
ఫ్యాప్సీలో లలితా జ్యువెల్లరి చైర్మన్‌కు ఘన సత్కారం
విశాఖపట్నం: లలితా జ్యువెల్లరి చైర్మన్ ఎం.కిరణ్ కుమార్‌ను ఏపీ మంత్రులు ఘనంగా సత్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్(ఫ్యాప్సీ) ఎక్స్‌లెన్స్ అవార్డుల లాంచింగ్ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 11 రంగాలలో రాణించిన వారికి ఫ్యాప్సీ ఎక్స్‌లైన్స్ అవార్డులు అందజేశారు. 2023 నుంచి 2033 వరకు పదేళ్ల కాలానికి అగ్రి, ఆక్వా ఆధారిత పరిశ్రమల్లో ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పినందుకుగానూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు కిరణ్‌కుమార్‌కు సన్మాసం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి, ఉపాధ్యాక్షుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
Shelma Sahayam: రెండు ప్రపంచాల మధ్య...
రెండు ప్రపంచాల మధ్య సంచరించే షెల్మకు... మొదటి ప్రపంచంలో కనిపించే సాంకేతిక అద్భుతాలు అంటే ఎంత ఇష్టమో రెండో ప్రపంచంలో కనిపించే కాల్పనిక కథలు అంతే ఇష్టం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ షెల్మ సహాయం రాసిన పుస్తకం ‘ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా: జెనిసిస్’ గత నెల గోల్డెన్ బుక్ అవార్డ్(ఉరుగ్వే) గెలుచుకుంది. తాజాగా గ్లోబల్ పబ్లిషింగ్ హౌజ్, ఎక్స్సెల్లర్ ఎక్స్‌లెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా)కు ఎంపికైంది... చెన్నైలో... చిన్న వయసులోనే కలం పట్టింది షెల్మ. ప్రైమరీ స్కూల్లో గాంధీజీపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. షెల్మ ఈ పోటీలో పాల్గొంది. అయితే తనకు ఆ మహాత్ముడి గురించి పెద్దగా తెలియదు ‘రకరకాల ఆయుధాలు ఉపయోగించి, బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడారు’ అని రాసింది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఇబ్బందిగా ఉండడం మాట ఎలా ఉన్నా... ఆ వ్యాసరచనే తన తొలి రచన! అయితే ఆ తరువాత కాలంలో ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడంతోపాటు రచనలు చేయడంపై ఆసక్తి పెరిగింది. ‘నేను భవిష్యత్‌లో రచయిత్రిని కావాలనుకుంటున్నాను’ అని షెల్మ అన్నప్పుడు చాలాముంది ముఖం మీదే నవ్వారు. ‘ఇంజినీర్ కావాలనేది నా కల’ అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే. ఇలాంటి సమయాల్లో బాబీ ఆంటీ తనకు ఎంతో శక్తి ఇచ్చేది. షెల్మ దృష్టిలో తాను పవర్ఫుల్ ఉమెన్. ‘వారు నీ గురించి ఏం అనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. నీకు నీ మీద ఎంత నమ్మకం ఉందనేది ముఖ్యం’ అని చెప్పేది. ఆంటీ ఇచ్చిన ఆత్మవిశ్వాస బలంతో చిన్న చిన్న రచనలు చేసి ఇంట్లో వినిపించేది. తండ్రి మెర్సిలిన్బాబు, తల్లి మేరీ శాంతి, చెల్లెళ్లు స్నేహ, రీతూలు ప్రోత్సాహకంగా మాట్లాడేవారు. ‘నాకు డిప్రెషన్‌గా అనిపించినప్పుడు పేపర్, పెన్ను అందుకొని ఏదో ఒకటి రాస్తుంటాను. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్న షెల్మ ‘ఎస్ఎస్ మెర్సె’ కలం పేరుతో ‘ది ల్యాండ్ ఆఫ్ ఆటరాక్సియా: జెనిసిస్’ అనే తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల రాసింది. దీనికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. వీడియోగేమ్స్ ఇష్టపడే యువతరాన్ని కూడా ఈ నవల ఆకట్టుకుంది. తాను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ నవలకు బీజం పడింది. అయితే అక్షరాల్లో కాకుండా తన మనసులోనే రాసుకుంటూ వస్తోంది. ఎడిట్ చేసుకుంటూ వస్తుంది. తాను చిన్నప్పుడు విన్న ఎన్నో జానపదకథలు, చదివిన పుస్తకాలు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తప్పిపోయిన తమ ఫ్రెండ్ సినన్ను వెదుక్కుంటూ కెప్టెన్ మెగెలాన్ అతని బృందం చేసిన ప్రయాణమే ఈ నవల. కెప్టెన్ బృందం చివరికి ఒక మాంత్రిక ప్రపంచంలోకి వెళుతుంది. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది నవల సారాంశం. ‘ద ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా’ ఇచ్చిన ఉత్సాహంతో షెల్మ సహాయం మరిన్ని రచనలు చేయాలనుకుంటోంది. -
కెనరా బ్యాంక్‌కు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ను ‘ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు 2022’ వరించింది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించే దిశగా బ్యాంక్ అందించిన సేవలకుగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ అవార్డు అందించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భవేంద్ర కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. -
రాబర్ట్ లాంగర్‌కు జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణకు ఎంఆర్ఎన్ఏ టీకాను అభివృద్ధి చేసిన మొడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ ఎస్.లాంగర్ ఈ ఏడాదికిగాను జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి 26 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సులో ఆయనకు ఈ అవార్డు అందించనున్నట్లు బయో ఆసియా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని డేవిడ్ హెచ్.కోచ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకుడైన రాబర్ట్ ఎస్.లాంగర్... వ్యాధుల చికిత్సకు మందులను నియంత్రిత పద్ధతుల్లో అందించే వ్యవస్థలను అభివృద్ధి చేశారు. వాటిని ప్రస్తుతం కేన్సర్ సహా పలు రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. లాంగర్ ల్యాబ్స్ డైరెక్టర్‌గా ఆయన చేసిన పరిశోధనల కారణంగానే తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారైంది. 2010లో లాంగర్ స్థాపించిన కంపెనీ మొడెర్నా కోవిడ్–19 నియంత్రణకు టీకా తయారు చేయడం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ ఫర్ ఇంజినీరింగ్‌తోపాటు అనేక ఇతర అవార్డులను అందుకున్న రాబర్ట్ ఎస్.లాంగర్ ఇప్పటివరకూ దాదాపు 1,500 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు రాబర్ట్ ఎస్.లాంగర్ అన్ని విధాలుగా అర్హుడని, ఆయన పరిశోధనలు రానున్న కాలంలోనూ సమాజంపై ప్రభావం చూపనున్నాయని తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. -
కరోనా మహమ్మారిగా మారడం అదృష్టమే! ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: ముప్ఫై ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న కరోనా వైరస్ రెండేళ్ల క్రితం మహమ్మారిగా మారడం మన అదృష్టమని.. మనిషికి ఏమాత్రం తెలియని వైరస్‌తో ముప్పు వచ్చి ఉంటే ఆ విపత్తును ఊహించలేమని డాక్టర్ డ్రూ వైజ్మాన్ అభిప్రాయపడ్డారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ వైజ్మాన్ గురువారం బయో ఆసియా సదస్సులో భాగంగా అపోలో గ్రూప్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో ఒక చర్చలో పాల్గొన్నారు. మోడిఫైడ్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకా అభివృద్ధిలో డాక్టర్ వైజ్మాన్ పరిశోధనలు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ రూపాంతరంతోనే కరోనా వైరస్ ప్రమాదం తొలగిపోలేదని.. భవిష్యత్‌లో ఈ వైరస్ రూపాంతరాలు విరుచుకుపడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయ పద్ధతుల్లో టీకాలను అభివృద్ధి చేసేందుకు కూడా అవకాశం లేనంత వేగంగా వైరస్లు పుట్టుకురావచ్చని.. దీన్ని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎంఆర్ఎన్ఏ సురక్షితం.. ఎంఆర్ఎన్ఏ సాయంతో టీకా అభివృద్ధి చేసిన క్రమాన్ని వైజ్మాన్ ఈ సందర్భంగా వివరించారు. సాధారణ పరిస్థితుల్లో ఆర్ఎన్ఏను శరీరంలోకి ఎక్కిస్తే అది కణజాలాన్ని దెబ్బతీస్తుందన్నారు. అందుకే తాము వాటిల్లో మార్పులు చేయడమే కాకుండా.. నానోస్థాయి కొవ్వుకణాల్లో బంధించి టీకాగా ఉపయోగించేలా చేశామని తెలిపారు. ఎంఆర్ఎన్ఏ టీకా వేగంగా పనిచేస్తుందని, సురక్షితమైందని, డీఎన్ఏను మారుస్తుందన్న అపోహల్లోనూ వాస్తవం లేదని వివరించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా కంపెనీలు తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ టీకాలను వంద కోట్ల మంది తీసుకున్నారని, ఎలాంటి దుష్ఫలితాలూ దాదాపు కనిపించలేదని తెలిపారు. అన్ని రూపాంతరాలకూ ఒకే వ్యాక్సిన్... కరోనా వైరస్ రూపాంతరం చెందడం సహజమని, అల్ఫాతో మొదలై ఒమిక్రాన్ వరకూ ఇది పలు రూపాలు సంతరించుకుందని వైజ్మాన్ గుర్తు చేశారు. అయితే వైరస్ తన రూపం మార్చుకున్న ప్రతిసారీ టీకాలు అభివృద్ధి చేయడం అసాధ్యం... అందుకే తాము ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా అన్ని రకాల కరోనా రూపాంతరాలపై పనిచేసే టీకాను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొన్ని టీకాల అభివృద్ధి ఇప్పటికే జరుగుతోందని ప్రాథమిక ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయని చెప్పారు. 20 ఏళ్లలో కరోనా మూడుసార్లు (సార్స్, మెర్స్, కోవిడ్ కారక సార్స్–కోవ్–2) మానవాళిపై దాడి చేసిందని, భవిష్యత్‌లోనూ మరో రూపంలో ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఇతర వ్యాధులకు కూడా... ఆర్ఎన్ఏ అనేది సంక్లిష్టమైన పరమాణువు అయినా తయారీ చాలా సులువు అని డాక్టర్ వైజ్మాన్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని వాడేందుకయ్యే ఖర్చు కూడా తక్కువని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆర్ఎన్ఏ టీకాలు కరోనాకు మాత్రమే కాదు.. అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగించవచ్చు. హెచ్ఐవీ మొదలుకొని మలేరియా, ఇన్ఫ్లుయెంజా, హెచ్ఎస్వీ, హెచ్‌సీవీ వ్యాధులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఫుడ్ అలె ర్జీలు, కేన్సర్ వ్యాక్సిన్లు, మధుమేహం, కీళ్లవాతం వంటి వ్యాధుల చికిత్సలోనూ ఈ ఆర్ఎన్ఏను వాడవచ్చని.. ఈ దిశగానూ తాము పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. గుండెపోటు వంటి సమస్యలకు, శరీరంలో మంట/వాపులను తగ్గించేందుకు కూడా ఆర్ఎన్ఏ టెక్నాలజీని వాడవచ్చని చెప్పారు. ‘ఆర్ఎన్ఏ టెక్నాలజీని జన్యుచికిత్సలకూ వాడవచ్చన్నది నా అతిపెద్ద నమ్మకం. సిస్టిక్ ఫైబ్రోసిస్, సికెల్ సెల్ అనీమియా వంటి వ్యాధులకు ఒక్క ఎంఆర్ఎన్ఏ ఇంజెక్షన్ ద్వారానే చికిత్స అందించే స్థితి వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు. -
భారత ప్రొఫెసర్‌కి న్యూజెర్సీ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ టెక్నాలజీ ఎక్సలెన్సీ పురస్కారం
నెవార్క్ (న్యూ జెర్సీ): అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది. న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాలకి న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్జేఐటీ) ఎక్సలెన్స్ ఆఫ్ టీచింగ్ పురస్కారం ప్రకటించింది. మెకానికల్ విద్య బోధనలో అత్యుత్తమ ఆధ్యాపకుడంటూ ఆయన సేవలను ప్రశంసించింది. మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్ తో పాటు స్ట్రైస్ ఎనాలిసిస్లను బోధించడంలో త్రివిక్రమ్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్‌లలో ఆయన టాప్ రేటింగ్ సాధించారు. టీచింగ్ ఫీల్డ్‌లో కొనసాగుతూనే బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ స్టాప్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్‌రెడ్డి సేవలందిస్తున్నారు. రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను ఆయన రూపొందించారు. ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలపై ఆయనకు పేటెంట్ల ఉన్నాయి. -
సింగరేణికి సోలార్ ఎక్సలెన్స్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించి నందుకు సింగరేణి బొగ్గుగనుల సంస్థకు జాతీయ స్థాయిలో సోలార్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఏషియన్ పసిఫిక్, ఆఫ్రికన్ దేశా ల్లో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు అవార్డులను అందించే సోలార్ క్వార్టర్ అనే సంస్థ శుక్రవారం ఢిల్లీలో పురస్కారాన్ని జీఎం సూర్యనారాయణ రాజుకు అందజేసింది. -
తెలంగాణ గవర్నర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్ కాంగ్రెస్‌మ్యాన్ డానికే డేవిస్ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును ప్రకటించింది. గవర్నర్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవం దక్కింది. 9వ వార్షిక కాంగ్రెషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల 7న అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందజేస్తారు. సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకు గవర్నర్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. -
ఏపీఎస్ ఆర్టీసీకి ఏఎస్ఆర్టీయూ ఎక్స్‌లెన్స్ అవార్డు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) సంస్థ అందించే ప్రతిష్టాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి ప్రథమ స్థానం దక్కింది. ‘ఐటీ ఇన్ డిజిటలైజేషన్’ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం ఆర్టీసీని వరించింది. ఈ పోటీల్లో దేశంలోని 64 రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొనగా, ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డు లభించింది. ఏపీఎస్ ఆర్టీసీలో ఐటీ విభాగం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. ట్రాకింగ్ సిస్టమ్, రిజర్వేషన్ విధానం తదితరాలు ప్రయాణికులకు ఆటంకాల్లేని సేవలు అందిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ఆర్టీసీలో ఐటీ పనితీరు మెరుగ్గా ఉంది. శుక్రవారం ఢిల్లీలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి విజయ్‌కుమార్ సింగ్ చేతుల మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకున్నారు. -
‘పవర్ గ్రిడ్’కు సీఎస్ఆర్ ఎక్స్‌లెన్స్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సమీకృత నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుకు చేసిన కృషికి గుర్తింపుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు ఈ అవార్డు దక్కింది. కోవింద్ చేతుల మీదుగా సంస్థ చైర్మన్, ఎండీ కందికుప్ప శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు. -
జీహెచ్ఎంసీకి మరో జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి మరో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎక్సలెన్సీ 2018 అవార్డును దక్కించుకుది. నేడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా రాష్ట్రంలోని 13 మందికి అధికారులకు అవార్డులు దక్కగా వీరిలో జీహెచ్ఎంసీ కమీషనర్ డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి కూడా ఉండడం విశేషం. గ్రటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మాణాలకు అతి తక్కువ సమయంలో భూసేకరణ చేయడం సఫలీకృతమైనందుకు కమీషనర్ బి. జనార్ధన్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. -
జీహెచ్ఎంసీకి పీఎం ఎక్సలెన్సీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు జీహెచ్ఎంసీని ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషికి కేంద్ర ప్రభుత్వపరిపాలన సంస్కరణలు, ఫిర్యా దుల విభాగం కార్యదర్శి కె.వి.ఈపెన్ నుంచి లేఖ అందింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జీహెచ్ఎంసీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 21న నిర్వహించే సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోవడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డిని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 2,010 నామినేషన్లు.. మొత్తం 13 విభాగాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు శాఖాధిపతులు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఉన్నతాధికారుల నుంచి 2,010 నామినేషన్లు ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు అందాయి. మొత్తం ఐదుదశల్లో స్క్రూటినీ చేసిన అనంతరం తుది జాబితాలో ఎంపికైన వారిని కేంద్రక్యాబినెట్ కార్యదర్శి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఇం దులో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్‌ను గురువారం ఇంటర్వ్యూ చేసి అవార్డుకు ఎంపిక చేశారు. కాగా, జీహెచ్ఎంసీకి అవార్డు రావడంపట్ల మంత్రి కేటీఆర్ ట్వీటర్లో హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని అభినందించారు. మేయర్ హర్షం జీహెచ్ఎంసీలో నిరుపేదలకు నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు గుర్తింపుగా జీహెచ్ఎంసీకి అవార్డు దక్కడంపై మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా రూ.8,598.58 కోట్ల వ్యయంతో లక్ష ఇళ్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 580 చ.అ.ల విస్తీర్ణంలో రూ.7.90 లక్షల వ్యయంతో రెండు బెడ్రూమ్లు, రెండు బాత్రూమ్లు, ఒక కిచెన్, హాల్‌తో వీటిని నిర్మిస్తున్నారు. జీహెచ్ఎంసీలో 41 బస్తీల్లోని నివాసితులను ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడంలో జీహెచ్ఎంసీ సఫలీకృతమైంది. -
‘ఖిల్జీ’కి అరుదైన పురస్కారం
సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి విడుదల వరకూ ఎన్నో వివాదాలు, వాయిదాలు...ఇంకెన్నో ఆంక్షలు...చివరకూ కోర్టు మెట్లు కూడా ఎక్కి, భద్రత నడుమ విడుదలైంది పద్మావత్ సినిమా. సినిమా విడుదలైన తర్వాత రికార్డులు బద్దలయ్యాయి. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన విధానం, దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్‌ల నటన పద్మావత్‌ను ఓ స్థాయిలో నిలిపాయి. ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణ్వీర్ సింగ్‌ను అరుదైన పురస్కారం వరించింది. ఖిల్జీ పాత్రను చరిత్రలో చదవడమే కానీ, ఎవరూ చూసి ఉండరూ. కానీ రణ్వీర్ తన నటనతో ప్రేక్షకులకు ఖిల్జీని చూపించేశాడు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. రణ్వీర్ ఆ పాత్రను పండించిన తీరుకు దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్ని పాత్రలను అద్భుతంగా మలిచినా...ఖిల్జీ పాత్ర మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. -
తెలుగు ప్రొఫెసర్‌కు దక్షణ కొరియా బెస్ట్ టీచింగ్ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ కొరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం కోన్‌కుక్ యూనివర్శిటీ ఇచ్చే ‘బెస్ట్ టీచింగ్ ఎక్సలెన్స్’ అవార్డును 2017 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డాక్టర్ కొప్పుల శుశృతకు అందజేశారు. ప్రస్తుతం ఆయన అదే విశ్వవిద్యాలయంలో 2009 నుంచి అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. వర్శిటీలో బుధవారం జరిగిన ప్రత్యేక వేడుకలో ఆయన యూనివర్సీటీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు. 1931లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఓ విదేశీ అధ్యాపకుడికి ఉత్తమ టీచింగ్ అవార్డు రావడం ఇదే తొలిసారి. విజయవాడకు చెందిన డాక్టర్ శుశృత ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ చేశారు. సియోల్ నేషనల్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టర్‌గా పనిచేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్లోనే ఇది మరుపురాని క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. భారత్, దక్షిణ కొరియాల మధ్య పరిశోధనా సత్సంబంధాలు మరింతగా మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. డాక్టర్ శుశృతను దక్షిణ కొరియా తెలుగు సంఘం ( టీఏఎస్కే) సభ్యులు డాక్టర్ వేణు నూలు, డాక్టర్ అనిల్ కావల, తరుణ్, అంకంరెడ్డి హరినారాయణ, కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రవాసీ కూలీకి ఎక్సలెన్సీ అవార్డు
అవార్డు గెలుచుకున్న పోలసాని లింగయ్య సాక్షి, హైదరాబాద్: మైగ్రెంట్స్ రైట్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఇచ్చే ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డులను ఆరుగురు తెలుగు ఎన్ఆర్ఐలకు ప్రకటించింది. అందులో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్‌కు చెందిన పోలసాని లింగయ్య ప్రవాసీ కూలీ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 18న ఆయనకు హైదరాబాద్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. లింగయ్య ఒమన్ దేశానికి కూలీపని కోసం వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే స్థాయికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి గల్ఫ్ దేశానికి వెళుతోన్న వారిలో చాలామందికి ఉపాధి కల్పించడంతో పాటు అక్కడి తెలుగువారికి లింగయ్య అండగా నిలుస్తున్నారు. -
ఏపీజీవీబీకి నేషనల్ పేమెంట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ)కు నేషనల్ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఎల్) నుంచి నేషనల్ పేమెంట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ లభించింది. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్(ఎన్ఎఫ్ఎస్) ఏటీఎం నెట్వర్క్కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్(ఆర్ఆర్బి) కేటగిరిలో ఈ అవార్డు లభించిందని ఏపీజీవీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ నుంచి తమ బ్యాంక్ చైర్మన్ వి.నర్సిరెడ్డి ఈ అవార్డును స్వీకరించారని పేర్కొంది. తమ బ్యాంక్ జారీ చేసిన రూపే ఏటీఎం కార్డుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.214 కోట్ల విలువైన ఒక లక్షకు పైగా లావాదేవీలు జరిగాయని బ్యాంక్ చైర్మన్ నర్సిరెడ్డి పేర్కొన్నారు. బ్యాంక్ సౌకర్యాలు అందుబాటులో లేని 4,444 గ్రామాల కోసం 1,880 బిజినెస్ కరెస్పాండెట్స్(బ్యాంక్ మిత్ర)లను నియమించుకున్నామని తెలిపారు. -
ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న భారతి సిమెంట్
సాక్షి, చెన్నై: భారతి సిమెంట్‌కు ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీంద్రరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ - 2014 కార్యక్రమం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో శనివారం రాత్రి జరిగింది. దీనికి గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. నిర్మాణ రంగంలో ప్రతిభ చూపిన 34 సంస్థలకు, ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశారు. విరివిగా మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతున్న తమిళ హాస్య నటుడు వివేక్‌కు గ్రీన్ గ్లోబ్ అవార్డును ప్రదానం చేశారు. భారతి సిమెంట్‌కు ఎక్సలెన్సీ ఇన్ హైటెక్ సిమెంట్ టెక్నాలజీ అవార్డును అందచేశారు. నిర్మాణ రంగంలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
నోవాటెల్ విశాఖ వరుణ్ బీచ్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు
హైదరాబాద్: నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ హోటల్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డ్ లభించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2013-14 సంవత్సరానికి 5 స్టార్ డీలక్స్ హోటల్ (రాష్ట్రస్థాయి) కేటగిరిలో ఈ అవార్డ్ లభించిందని నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ హోటల్ ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ను అందుకోవడం ఇది వరుసగా రెండో ఏడాదని పేర్కొంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అవార్డును నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ హోటల్ జనరల్ మేనేజర్ మాధవ్ బెల్లంకొండకు ప్రదానం చేశారని తెలిపింది. గత మూడేళ్లుగా తాము ఎన్నో అవార్డులను గెల్చుకుంటున్నామని మాధవ్ బెల్లంకొండ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక, తొలి 5 స్టార్ హోటల్ తమదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్‌లో పర్యాటక అభివృద్ధికు తాము చేస్తున్న కృషికి ఈ అవార్డు మరో గుర్తింపని వివరించారు. ఈ అవార్డ్ సాధించడంలో తోడ్పడిన తమ సిబ్బందికి, సంబంధితులందరికీ ఆయన కృతజ్జతలు తెలియజేశారు.