సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ కొరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం కోన్‌కుక్ యూనివర్శిటీ ఇచ్చే ‘బెస్ట్ టీచింగ్ ఎక్సలెన్స్’ అవార్డును 2017 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డాక్టర్ కొప్పుల శుశృతకు అందజేశారు. ప్రస్తుతం ఆయన అదే విశ్వవిద్యాలయంలో 2009 నుంచి అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. వర్శిటీలో బుధవారం జరిగిన ప్రత్యేక వేడుకలో ఆయన యూనివర్సీటీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు. 1931లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఓ విదేశీ అధ్యాపకుడికి ఉత్తమ టీచింగ్ అవార్డు రావడం ఇదే తొలిసారి.
విజయవాడకు చెందిన డాక్టర్ శుశృత ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ చేశారు. సియోల్ నేషనల్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టర్‌గా పనిచేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే ఇది మరుపురాని క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. భారత్, దక్షిణ కొరియాల మధ్య పరిశోధనా సత్సంబంధాలు మరింతగా మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. డాక్టర్ శుశృతను దక్షిణ కొరియా తెలుగు సంఘం ( టీఏఎస్‌కే) సభ్యులు డాక్టర్ వేణు నూలు, డాక్టర్ అనిల్ కావల, తరుణ్, అంకంరెడ్డి హరినారాయణ, కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment