MP Margani Bharat Receives Indo-Arab International Excellence Award - Sakshi
Sakshi News home page

ఎంపీ భరత్‌కు ఇండో అరబ్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్‌ 

Published Tue, Jun 20 2023 8:24 AM | Last Updated on Tue, Jun 20 2023 12:39 PM

Indo Arab Excellence Award To MP Bharat Ram - Sakshi

రాజమహేంద్ర­వరం రూరల్‌: వైఎస్సా ర్‌సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్, రాజ మహేంద్రవరం ఎంపీ మా­ర్గాని భరత్‌­రామ్‌కు ఇండో అరబ్‌ ఇంటర్నేష­న­­ల్‌ ఎక్స­లె­న్స్‌ అవార్డ్‌ లభించింది. దు­బా­య్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన ఇంటర్నే­షనల్‌ కాన్ఫరెన్స్‌ జీ–20 ఇండియా ప్రెసిడెన్సీ సెలబ్రేషన్స్‌లో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేతుల మీదుగా ఎంపీ భరత్‌కు ఈ అవార్డ్‌ను అందజేశారు. 

యువతా హరితా, గోగ్రీన్‌ చాలెంజ్‌ పేరుతో ఎంపీ భరత్‌రామ్‌ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డ్‌ను ప్రదానం చేసినట్లు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తెలిపింది. ప్రతి­ష్టాత్మకమైన ఇండో అరబ్‌ ఇంటర్నేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు రావడంపై ఎంపీ భరత్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఈ అవార్డును రాజమహేంద్రవరం విద్యా­ర్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలకు అంకితమిస్తున్నానని తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement