best teaching
-
ఉపాధ్యాయ రత్నా
సుజాతనగర్ : సమయపాలన.. అంకిత భావం, సామాజిక సేవ.. పరమావధిగా ఓ గిరిజన ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. 29 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్‌గా విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు బాణోత్ రత్నా. 2011 నుంచి 2018 వరకు సుజాతనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేసిన రత్నా ఇటీవల జరిగిన ఉపాధాయ బదిలీల్లో సర్వారం ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఆయన పాఠశాలకు వచ్చే నాటికి బడిలో 26 మందే విద్యార్థులు ఉన్నారు. వీరిలో 20 మంది మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు రత్నా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడిలోకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పుడు 26 మందీ పాఠశాలకు రావడంతోపాటు మరో 14 మందిని అదనంగా పాఠశాలలో చేర్చారు. ప్రస్తుతం సర్వారం పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుతన్నారు. వీరందరూ గిరిజన పిల్లలే. ఆంగ్లంపై పట్టులేకపోవడంతో ప్రత్యేక తరగతులు నిర్వహించి.. పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. ఏకాగ్రత పెంపొందించేందుకు విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ బడి.. అవకాశం దొరికితే చాలు..విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులున్న నేటి రోజుల్లో సెలవు రోజున కూడా పాఠశాల నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెలలో 24న వరలక్ష్మీ వ్రతం, రెండో శనివారం, ఆదివారం, జెండా వందనం, వాజ్‌పేయి మృతి తదితర 12 రోజులు సెలవులు వచ్చాయి. కానీ రత్నా విద్యార్థుల అభ్యున్నతి కోసం సెలవు రోజుల్లో కూడా పాఠశాల నిర్వహించారు. సెలవు కావడంతో మధ్యాహ్నం ప్రతీ రోజు మధ్యాహ్నం వడ్డించే అక్షయపాత్ర సంస్థ భోజనం ఏర్పాటు చేయకపోవడంతో ఈ నెల 24న వరలక్ష్మీ వ్రతం రోజు సొంత ఖర్చులతో భోజనం తయారు చేయించి పెట్టారు. గతంలో పనిచేసిన పాఠశాలలోనూ.. రత్నా సుజాతనగర్ మండల పరిషత్ పాఠశాలలో 2011 నుంచి ఇటీవల బదిలీల వరకు పనిచేశారు. ఆయన రాకముందు పాఠశాలలో విద్యార్థులు కేవలం 45 మందే ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 200కు పెరిగింది. సొంత ఖర్చులతో విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్ నిర్మించారు. గోడలూ పాఠాలు చెబుతాయి గతంలో ఆయన పనిచేసిన సుజాతనగర్ పాఠశాలలో గోడలను అందంగా ముస్తాబు చేసి చక్కని రంగులతో వివిధ కళాకృతులను వాటిపై తీర్చిదిద్దారు. జాతీయ నాయకులు చిత్రపటాలు, వివేకానందుని సూక్తులు, తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్, సరçస్వతి చిత్రపటాలతో పాటు, స్వచ్ఛ భారత్ లోగో, భారతదేశం, తెలంగాణ రాష్ట్ర చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రాష్ట్ర పుష్పం, రాష్ట్ర పిట్ట, రాష్ట్ర చెట్టు, రాష్ట్ర జంతువుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ పలువురు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అవార్డులు 1998లో జూలూరుపాడు మండలం కరివారిగూడెం పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. 2004లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(క్యూఐటీ) జిల్లా స్థాయిలో ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్నారు. -
తెలుగు ప్రొఫెసర్‌కు దక్షణ కొరియా బెస్ట్ టీచింగ్ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ కొరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం కోన్‌కుక్ యూనివర్శిటీ ఇచ్చే ‘బెస్ట్ టీచింగ్ ఎక్సలెన్స్’ అవార్డును 2017 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డాక్టర్ కొప్పుల శుశృతకు అందజేశారు. ప్రస్తుతం ఆయన అదే విశ్వవిద్యాలయంలో 2009 నుంచి అసోసియేట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. వర్శిటీలో బుధవారం జరిగిన ప్రత్యేక వేడుకలో ఆయన యూనివర్సీటీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు. 1931లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఓ విదేశీ అధ్యాపకుడికి ఉత్తమ టీచింగ్ అవార్డు రావడం ఇదే తొలిసారి. విజయవాడకు చెందిన డాక్టర్ శుశృత ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ చేశారు. సియోల్ నేషనల్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టర్‌గా పనిచేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్లోనే ఇది మరుపురాని క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. భారత్, దక్షిణ కొరియాల మధ్య పరిశోధనా సత్సంబంధాలు మరింతగా మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. డాక్టర్ శుశృతను దక్షిణ కొరియా తెలుగు సంఘం ( టీఏఎస్కే) సభ్యులు డాక్టర్ వేణు నూలు, డాక్టర్ అనిల్ కావల, తరుణ్, అంకంరెడ్డి హరినారాయణ, కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
కార్పొరేట్‌కు దీటుగా ‘గురుకుల’ంలో విద్యాబోధన
చిలమత్తూరు : గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని వసతులతో విద్యాబోధన అందిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి హెచ్.కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన టేకులోడు బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.3.75 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 గురుకుల పాఠశాలలు మంజూరు కాగా ఆరింటిని మత్య్సకారుల పిల్లల కోసం కేటాయించినట్లు చెప్పారు. మరో మూడు రాయదుర్గం మండలం కోనేబావి, మడకశిర మండలం గుండుమల, గుడిబండకు మంజూరయ్యాయన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో తరుగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్, జయసింహ నాయుడు, శ్యాంభూపాల్‌రెడ్డి, లేపాక్షి, కొడిగెనహళ్లి ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
మాస్టర్ ...
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇద్దరి ఎంపిక 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఉత్తమ బోధన.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు జిల్లా నుంచి ఇద్దరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యూరు. ఒకరు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఎండీ రాజ్‌మహ్మద్ కాగా, మరొకరు తొర్రూరు మండలం మాటేడు పీఎస్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేస్తున్న పరాంకుశం రఘునారాయణ. వీరిద్దరు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. - విద్యారణ్యపురి నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన పరాంకుశం రఘునారాయణ 1984లో ఎస్జీటీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. నాటి నుంచి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు. విద్యబోధనతోపాటు సామాజిక సేవలోనూ ఈయన ముందుంటున్నారు. అంతర్జిల్లా బదిలీల్లో పాలకుర్తితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవలందించారు. 2013లో తొర్రూరు మండలం మాటేడు యూపీఎస్‌లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా నియమితులయ్యూరు. పాఠశాలల్లో వసతుల కోసం కృషి వివిధ స్వచ్ఛంద సంస్థల సహాకారంతో పాఠశాలలో ఫర్నీచర్ ఇతర పరికరాలను రఘునారాయణ సేకరించారు. నోటు పుస్తకాలు, టై బెల్టులు నగదు, వస్తు రూపేణ బహుమతులు ఇచ్చే వారిని ప్రోత్సహించేవారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఇంటింటి ప్రచారం చేసేవారు. ఉపాధ్యాయులతో ప్రభావవంతంగా విద్యాబోధన చే రుుంచేవారు. పాఠశాలల్లో మొక్కలను నాటించారు. బడితోటకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రచయితగానూ ముద్ర.. బాలరంజని గేయమాలిక రచించటంతోపాటు ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు కూడా చేశారు. పలు దిన,వార,మాసపత్రికల్లో వ్యాసాలు, 50 కవితలు రాశారు. తెలుగు ప్రపంచ సభలకూ ప్రతినిధిగా వెళ్లారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుండేవారు. 2007లో జిల్లాస్థాయిలో, 2008లో రాష్ర్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు. ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో డైమండ బెస్టిజిన్ అవార్డు అందుకున్నారు. భద్రాచంలో సర్వేపెల్లి వాలంటరీ ఆర్గనైజేషన్‌ద్వారా సర్వేపెల్లి పురస్కారం, సాహిత్యసంస్కృతిక అకాడమీ ద్వారా గురజాడ అవార్డు అందుకున్నారు. అంకితభావం రఘునారాయణ ఆస్తి మరింతగా బాధ్యత పెరిగింది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావటంతో నా బాధ్యత మరింత పెరిగింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు మరింత గా శ్రమిస్తాను. విద్యార్థుల్లోనూ సామాజిక స్పృహ అలవర్చేలా ప్రయత్నిస్తాను. నేను అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం ఆనందంగా ఉంది. అవార్డు కింద వచ్చే రూ. 50 వేలను మాటేడు ప్రాధమిక పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం వినియోగిస్తా. - రఘునారాయణ