ప్రవాసీ కూలీకి ఎక్సలెన్సీ అవార్డు | Non-resident wage Excellence Award | Sakshi
Sakshi News home page

ప్రవాసీ కూలీకి ఎక్సలెన్సీ అవార్డు

Published Sat, Dec 17 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

ప్రవాసీ కూలీకి ఎక్సలెన్సీ అవార్డు

ప్రవాసీ కూలీకి ఎక్సలెన్సీ అవార్డు

అవార్డు గెలుచుకున్న పోలసాని లింగయ్య

సాక్షి, హైదరాబాద్‌: మైగ్రెంట్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌ దేశవ్యాప్తంగా ఇచ్చే ప్రవాసీ ఎక్సలెన్సీ అవార్డులను ఆరుగురు తెలుగు ఎన్‌ఆర్‌ఐలకు ప్రకటించింది. అందులో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌కు చెందిన పోలసాని లింగయ్య ప్రవాసీ కూలీ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 18న ఆయనకు హైదరాబాద్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు.

లింగయ్య ఒమన్‌ దేశానికి కూలీపని కోసం వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే స్థాయికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి గల్ఫ్‌ దేశానికి వెళుతోన్న వారిలో చాలామందికి ఉపాధి కల్పించడంతో పాటు అక్కడి తెలుగువారికి లింగయ్య అండగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement