
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి మరో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎక్సలెన్సీ 2018 అవార్డును దక్కించుకుది. నేడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా రాష్ట్రంలోని 13 మందికి అధికారులకు అవార్డులు దక్కగా వీరిలో జీహెచ్ఎంసీ కమీషనర్ డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి కూడా ఉండడం విశేషం.
గ్రటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మాణాలకు అతి తక్కువ సమయంలో భూసేకరణ చేయడం సఫలీకృతమైనందుకు కమీషనర్ బి. జనార్ధన్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.