తెలంగాణ గవర్నర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం  | TS Governor Tamilisai Soundararajan Gets Excellence Award | Sakshi
Sakshi News home page

తెలంగాణ గవర్నర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం 

Published Fri, Mar 5 2021 2:28 AM | Last Updated on Fri, Mar 5 2021 4:47 AM

TS Governor Tamilisai Soundararajan Gets Excellence Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది. గవర్నర్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవం దక్కింది. 9వ వార్షిక కాంగ్రెషనల్‌ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా ఈ నెల 7న అమెరికా నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఈ అవార్డును అందజేస్తారు. సమాజహితం కోసం అత్యున్నత సేవలు చేసినందుకు గవర్నర్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement