
విశాఖపట్నం: లలితా జ్యువెల్లరి చైర్మన్ ఎం.కిరణ్ కుమార్‌ను ఏపీ మంత్రులు ఘనంగా సత్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్(ఫ్యాప్సీ) ఎక్స్‌లెన్స్ అవార్డుల లాంచింగ్ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 11 రంగాలలో రాణించిన వారికి ఫ్యాప్సీ ఎక్స్‌లైన్స్ అవార్డులు అందజేశారు. 2023 నుంచి 2033 వరకు పదేళ్ల కాలానికి అగ్రి, ఆక్వా ఆధారిత పరిశ్రమల్లో ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పినందుకుగానూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌లు కిరణ్‌కుమార్‌కు సన్మాసం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి, ఉపాధ్యాక్షుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment