Lalita Jewelry
-
ఫ్యాప్సీలో లలితా జ్యువెల్లరి చైర్మన్‌కు ఘన సత్కారం
విశాఖపట్నం: లలితా జ్యువెల్లరి చైర్మన్ ఎం.కిరణ్ కుమార్‌ను ఏపీ మంత్రులు ఘనంగా సత్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్(ఫ్యాప్సీ) ఎక్స్‌లెన్స్ అవార్డుల లాంచింగ్ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 11 రంగాలలో రాణించిన వారికి ఫ్యాప్సీ ఎక్స్‌లైన్స్ అవార్డులు అందజేశారు. 2023 నుంచి 2033 వరకు పదేళ్ల కాలానికి అగ్రి, ఆక్వా ఆధారిత పరిశ్రమల్లో ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పినందుకుగానూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు కిరణ్‌కుమార్‌కు సన్మాసం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి, ఉపాధ్యాక్షుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
లలితా జ్యువెల్లరీ అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా లలితా జ్యువెల్లరీ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు ఇస్తుంది. వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2000 తగ్గింపు అందిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ ఏప్రిల్ 24 వరకూ కొనసాగుతుంది. కస్టర్లంతా ఈ అద్భుతమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. అందరి ఇళ్లలో బంగారం, వజ్రాలు, వెండి నిండాలని అక్షయ తృతీయ సందర్భంగా కుబేర లక్ష్మీని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. -
మొక్కులు తీర్చుకున్న పోలీసులు
సాక్షి, చెన్నై: కొలిక్కిరాని కేసు ఛేదించడంతో పోలీసులు మొక్కులు తీర్చుకున్నారు. సమయపురం మారియమ్మన్‌ను దర్శించుకుని తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లలిత జ్యువెలరీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మురుగన్ దోపిడీల అనంతరం నటీమణులతో జల్సా చేసినట్టు విచారణలో తేలడం ఆ నటీమణులు ఎవరో అని ఆరాతీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరిలో తిరుచ్చి సమయపురం టోల్గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. 470 సవర్ల నగలు, రూ. 19 లక్షల నగదును దుండగులు అపహరించుకు వెళ్లారు. ఈ కేసు విచారణ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. కనీసం ఆదారం కూడా లభించకపోవడంతో నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. అదే సమయంలో కొద్ది రోజుల క్రితం తిరుచ్చిలో మరో దోపిడీ జరిగింది. ప్రముఖ నగల షోరూమ్ లలిత జ్యువెలరీలో జరిగిన దోపిడీ స్టైల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టైల్ ఒకే రకంగా ఉండడంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. లలిత జ్యువెలరీ కేసు విచారణలో లభించిన సమాచారాలు, ఆధారాలు, దోపిడీ దొంగల చెంతకు పోలీసుల్ని తీసుకెళ్లింది. లలిత జ్యువెలరీ కేసులో తొలుత సెంగం కోర్టులో సురేష్ అనే నిందితుడు లొంగిపోయాడు. అతడ్ని విచారించగా, గణేష్ అనే మరో దొంగ దొరికాడు. ఈ దోపిడీల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న తిరువారూర్ మురుగన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయాడు. ఇతగాడ్ని ఇక్కడకు తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టిన బంగారాన్ని బయటకు తీశారు. మళ్లీ బెంగళూరు పోలీసులు తమ పరిధిలో ఉన్న కేసుల విచారణ నిమిత్తం మురుగన్‌ను పట్టుకెళ్లారు. తలనీలాలు సమర్పించుకుని.. మురుగన్‌ను తమ కస్టడీకి తీసుకునేందుకు తిరుచ్చి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే, బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్న దృష్ట్యా, అక్కడ విచారణ ముగించినానంతరం, ఇక్కడకు అతడ్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించి ఉన్నారు. లలితా జ్యువెలరీ దోపిడితోపాటు తొమ్మిది నెలల క్రితం జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోపిడీ కూడా మురుగన్ ముఠా పనితనంగా తేలింది. ఈ కేసులో రాధాకృష్ణన్ అనే నిందితుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులు కొలిక్కిరావడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసును విచారిస్తున్న బృందంలోని ఇద్దరు పోలీసులు హరిహరన్, విజయకుమార్ ఉదయాన్నే సమయపురం మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసును ఎట్టకేలకు ఛేదించడంలో తమకు దేవుడి ఆశీస్సులు సైతం ఉన్న దృష్ట్యా, మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించుకోవడం గమనార్హం. 25 కేజీలు బంగారం స్వాధీనం.. లలిత జ్యువెలరీ కేసులో ఇప్పటి వరకు 25 కేజీల బంగారు స్వాధీనం చేసుకున్నట్టు తిరుచ్చి పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసు విచారణ గురించి వివరించారు. ప్రస్తుతం నిందితుడు మురుగన్ బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అక్కడ విచారణ ముగించినానంతరం ఇక్కడ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతడిపై మరెన్ని కేసులు ఉన్నాయో అని ఆరా తీస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ సాగుతున్నదన్నారు. కాగా నిందితుడు మురుగన్ దోపిడీల అనంతరం మోడల్స్, నటీమణులతో కలిసి జల్సా చేసేవాడుగా విచారణలో తేలినట్టు సమాచారం. కొందరికి దోపిడీ చేసిన నగలను సైతం ఇచ్చి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడం, రెండు సినిమాలకు సైతం ఫైనాన్స్ చేసి ఉన్నట్టు తేలడంతో ఆ నటీమణులు ఎవరో, ఆ సినిమాల వెనుక ఉన్న వాళ్లు ఎవరో ఆరా తీసే పనిలో ప్రత్యేక బృందం నిమగ్నమైంది. -
లలిత జ్యువెల్లర్స్లో చోరీ: నిందితుల అరెస్ట్
హైదరాబాద్: లలితా జ్యువెల్లరీ షాపులో దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అక్టోబర్‌లో జరిగిన ఈ దొంగతనం కేసులో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన షేక్ కరీముల్లా(27) సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలో ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. అతనికి అదే కాలనీలో గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న కర్నూలు జిల్లాకు చెందిన వాణి క్రాంతి(26) అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంది. వీరు ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నారు. ఈ క్రమంలో అక్టోబర్‌లో సోమాజిగూడలోని లలితా జ్యువెల్లర్స్‌కు వెళ్లి అక్కడ ఎవరూ గమనించకుండా బంగారపు గాజులు, బ్రేస్‌లెట్‌ను దొంగిలించారు. వీటిని కరీముల్లా పేరుతో రూ.1.20 లక్షలకు నందిగామలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టారు. జ్యువెల్లర్స్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. -
34 ఏళ్లు.. 15 స్టోర్లు 10,700 కోట్ల టర్నోవర్
♦ తెలంగాణలో అడుగుపెట్టిన లలితా జ్యుయలరీ ♦ సోమాజిగూడలో భారీ షోరూమ్‌తో రంగంలోకి ♦ 1983లో తమిళనాడులో షోరూమ్‌తో ఆరంభం ♦ ఇపుడు తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఏపీల్లో ♦ త్వరలో విజయవాడ, రాజమండ్రిలో షోరూమ్‌లు ♦ తరుగు లేకుండా, తక్కువ ధరలకే: ఛైర్మన్ కిరణ్‌కుమార్ ♦ ఈ ప్రత్యేక నియమాలే తమను నిలబెట్టాయని వ్యాఖ్య హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన లలితా జ్యుయలరీ మార్ట్... అత్యంత భారీ షోరూమ్‌తో తెలంగాణలో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ సర్కిల్లో 1.3 లక్షల చదరపుటడుగుల్లో ఏర్పాటయిన లలితా జ్యుయలరీ షోరూమ్... ఆదివారం అట్టహాసంగా ఆరంభమయింది. 1983లో తమిళనాడులో ఒక షోరూమ్‌తో మొదలైన లలితా జ్యుయలరీ... ఇపుడు ఒక్క తమిళనాడులోనే తొమ్మిది భారీ షోరూమ్‌లతో పాటు... పాండిచ్చేరిలో ఒకటి, బెంగళూరులో రెండు, తిరుపతి, విశాఖపట్నంలలో తలా ఒకటి చొప్పున మెగా షోరూమ్‌లను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌తో షోరూమ్‌ల సంఖ్య 15కు చేరినట్లయింది. ‘‘బంగారం, వజ్రాలు, వెండి, ప్లాటినం ఆభరణాలను తయారీ ధరకే అందిస్తున్నాం. అంతేకాదు! తరుగును ఇంకా ఇంకా తగ్గించటంపై మేం నిరంతరం శ్రమిస్తున్నాం. అందుకే 1 నుంచి 9 శాతం తరుగుకే నగలను విక్రయించగలుగుతున్నాం. వజ్రాభరణాల తరుగు క్యారెట్‌కు రూ.975 మాత్రమే. వెండికి తరుగే లేదు. బంగారు ఆభరణాలకు బీఐఎస్916 హాల్‌మార్క్ సర్టిఫికెట్‌ను, వజ్రాభరణాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తున్నాం’’ అని షోరూమ్ ఆరంభం సందర్భంగా లలితా జ్యుయలరీ మార్ట్ ఎండీ, చైర్మన్ ఎం.కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. తమ సంస్థ వార్షిక టర్నోవర్ రూ.10,700 కోట్ల వరకూ ఉందని, త్వరలో విజయవాడ, రాజమండ్రిలో కూడా షోరూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ‘‘తక్కువ తరుగు, బయటికి చెప్పని చార్జీలు వడ్డించకపోవటం, సరసమైన ధర వంటివి మా నియమాలు. వీటిని పాటిస్తుండటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాం’’ అని ఆయన వివరించారు. ధరలు పోల్చి నగలు కొనొచ్చు! ఏ షాపులోనైనా బంగారం కొనేటపుడు సదరు నగను ఫొటో తీసుకుని మరో షాపులో చూపిస్తామంటే ససేమిరా అంగీకరించరు. లలితా జ్యులయరీ మాత్రం దీన్నే ఓ చాలెంజ్ స్థాయికి తీసుకెళ్లింది. తాము నగలు కొనేముందు ఎస్టిమేట్ స్లిప్ ఇస్తామని, నగ ఫొటోను కూడా తీసుకోవచ్చని తెలిపింది. ‘‘ఆ ఫొటోను, నగను ఇతర షోరూమ్‌లలో ఎక్కడైనా చూపించొచ్చు. ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడే కొనొచ్చు. ఇంత ధైర్యంగా ఈ చాలెంజ్‌ను ఎందుకు స్వీకరించామంటే ఎవ్వరూ మాకన్నా తక్కువ ధరకు విక్రయించలేరన్న మా నమ్మకమే కారణం’’ అని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో కిరణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘‘కొందరు ఉచిత ఆఫర్లు చూసి మోసపోవటం, స్కీమ్ అనగానే చేరిపోవటం, బిల్లు – ట్యాక్స్ లేదంటే వెంటనే ఒప్పేసుకోవటం చేస్తుంటారు. అలా చేయొద్దనేది నా అభ్యర్థన. తరుగుకు ఎంత చెల్లిస్తున్నామో చూసుకోవటంతో పాటు బిల్లులో అన్ని అంశాలూ ఉన్నాయో లేదో కూడా గమనించాలి. నగ బరువు, ఆ రోజు బంగారం ధర, తరుగు చార్జీలు, రాళ్ల ధర వంటివన్నీ బిల్లులో ఉండాలి. అప్పుడే మీ డబ్బుకు తగ్గ విలువైన బంగారాన్ని సొంతం చేసుకుంటారు’’ అని వివరించారు. వజ్రాభరణాలకు పలు జాగ్రత్తలు వజ్రాభరణాలు కొనేవారు దానికి షోరూమ్ ఇచ్చే సొంత సర్టిఫికెట్ కాకుండా అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని కిరణ్‌కుమార్ స్పష్టంచేశారు. వజ్రాల రంగు, కట్, క్యారెట్, క్లారిటీ తదితరాలన్నీ సర్టిఫికెట్లో ఉంటాయని తెలియజేశారు. హైదరాబాద్ షోరూమ్ ఆరంభం సందర్భంగా పరిమిత కాలం పాటు అన్ని వజ్రాభరణాలకూ క్యారెట్‌పై రూ.2వేల వరకూ తగ్గింపు అందజేస్తున్నట్లు తెలిపారు. బంగారం తరుగులోనూ 1 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. బంగారం నగలకు రెండు స్కీమ్‌లు... ‘స్వర్ణ ఉదయం’ పేరిట లలితా జ్యుయలరీ అందిస్తున్న స్కీమ్ వ్యవధి 11 నెలలు. దీన్లో తొలి నెల వాయిదా పూర్తిగా ఉచితం. మిగిలిన 10 నెలలు చెల్లించాక తగిన నగలు పొందొచ్చు. అంతేకాక ఈ స్కీమ్‌లో భాగంగా కొనుగోలు చేసే నగలకు తరుగు లేదని కూడా ప్రకటించింది. ‘అడ్వాన్స్ నగల బుకింగ్ స్కీమ్’లో కూడా నగలు కొనేటపుడు తరుగు లేదని సంస్థ తెలిపింది. ‘‘ఒకసారి నగదు చెల్లించి 7 నెలల తరవాత తరుగు లేకుండా మీకు నచ్చిన నగలు కొనుగోలు చేయొచ్చు. 7 శాతం తరుగు ఉన్న నగలను 7 నెలల తరవాత, 8 శాతం తరుగున్న నగనలు 8 నెలల తరవాత తరుగు లేకుండా కొనొచ్చు. అంతకన్నా ఎక్కువ తరుగుంటే ఆ వ్యత్యాసం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే పాత నగలు ఇచ్చి కూడా దీన్లో చేరొచ్చు.