నోవాటెల్ విశాఖ వరుణ్ బీచ్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు | Excellence Award to Novotel Visakhapatnam Varun Beach | Sakshi
Sakshi News home page

నోవాటెల్ విశాఖ వరుణ్ బీచ్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు

Published Mon, Sep 29 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

నోవాటెల్ విశాఖ వరుణ్ బీచ్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు

నోవాటెల్ విశాఖ వరుణ్ బీచ్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు

హైదరాబాద్: నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ హోటల్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డ్ లభించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2013-14 సంవత్సరానికి 5 స్టార్ డీలక్స్ హోటల్ (రాష్ట్రస్థాయి) కేటగిరిలో ఈ అవార్డ్ లభించిందని నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ హోటల్ ఈ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ను అందుకోవడం ఇది వరుసగా రెండో ఏడాదని పేర్కొంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అవార్డును నోవాటెల్ విశాఖపట్టణం వరుణ్ బీచ్ హోటల్ జనరల్ మేనేజర్ మాధవ్ బెల్లంకొండకు ప్రదానం చేశారని తెలిపింది.

గత మూడేళ్లుగా తాము ఎన్నో అవార్డులను గెల్చుకుంటున్నామని మాధవ్ బెల్లంకొండ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక, తొలి 5 స్టార్ హోటల్ తమదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్‌లో పర్యాటక అభివృద్ధికు తాము చేస్తున్న కృషికి ఈ అవార్డు మరో గుర్తింపని వివరించారు. ఈ అవార్డ్ సాధించడంలో తోడ్పడిన తమ సిబ్బందికి, సంబంధితులందరికీ ఆయన కృతజ్జతలు  తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement