
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) సంస్థ అందించే ప్రతిష్టాత్మక ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి ప్రథమ స్థానం దక్కింది. ‘ఐటీ ఇన్ డిజిటలైజేషన్’ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారం ఆర్టీసీని వరించింది.
ఈ పోటీల్లో దేశంలోని 64 రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొనగా, ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డు లభించింది. ఏపీఎస్ ఆర్టీసీలో ఐటీ విభాగం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. ట్రాకింగ్ సిస్టమ్, రిజర్వేషన్ విధానం తదితరాలు ప్రయాణికులకు ఆటంకాల్లేని సేవలు అందిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ఆర్టీసీలో ఐటీ పనితీరు మెరుగ్గా ఉంది. శుక్రవారం ఢిల్లీలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి విజయ్‌కుమార్ సింగ్ చేతుల మీదుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు పురస్కారం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment