సైనిక శిబిరంలో రాజకీయ కలకలం
నిగూఢమైన సైనిక వ్యవహారాలకు, నివురుగప్పిన నిప్పు లా ఉండే కాశ్మీర్‌కు మధ్య ఏర్పడిన రగడ ఇది. ఇటీవల పదవీ విమరణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ విజయ్‌కుమార్ సింగ్ దీనికి కేంద్ర బిందువు. ఈ వివాదంలో కొన్ని అం శాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఆరోపణలు కరాఖండిగా కూడా ఉన్నాయి. అయితే దర్యాప్తు జరిపించడానికి, బాధ్యులైన వారిని దేశం ముందు నిలబెట్టడానికి గాని ఉన్న అవకాశాలు అత్యంత పరిమితం. ఈ వివాదంలో సరి హద్దు రాష్ట్రమైన జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేయడానికి సాక్షాత్తు ఒక మంత్రికే ముడుపులు ముట్టాయన్నది ఒక ఆరోపణ. వీకే సింగ్ వారసునిగా బిక్రమ్సింగ్కు అవకాశం రాకుండా కుట్రపన్నారన్న ఆరో పణ మరొకటి. జమ్మూ-కాశ్మీర్ వంటి సమస్యాత్మక రాష్ట్రం లో వీకే సింగ్ గూఢచర్యం నడపడానికి ఒక సంస్థ సేవలు వినియోగించుకున్నారన్నది మరో ఆరోపణ. దీని కోసం కేటాయించిన నిధులను సైనిక దళాల ప్రధానాధికారి దుర్వినియోగం చేశాడన్న మాటా ఉంది. ఈ మొత్తం అం శం మీద సీబీఐ దర్యాప్తు జరపడం గురించి కేంద్ర ప్రభు త్వం, రక్షణ మంత్రిత్వశాఖ ఒక నిర్ణయానికి రాలేని పరి స్థితి ఏర్పడింది. కారణం సైనిక వ్యవహారాలు, దేశ భద్రతే.
జనరల్ వీకే సింగ్ 1970లో సైన్యంలో చేరారు. తం డ్రి, తాత కూడా సైనికులే. సింగ్ మార్చి 31, 2010లో సైనిక దళాల ప్రధానాధికారి అయ్యారు. మే 31, 2012లో పదవీ విరమణ చేశారు. ఈ కాలమే ఈ మొత్తం వివాదా నికి భూమిక. సింగ్ పదవి చేపట్టిన కొద్ది కాలానికే అంటే 2010, మే నెలలో టెక్నికల్ సర్వీసెస్ డివిజన్ (టీఎస్డీ) అనే గూఢచారి సంస్థను కాశ్మీర్‌లోనూ నెలకొల్పారు. ఎలాంటి జమా ఖర్చులు చూపించనవసరం లేని రీతిలో టీఎస్డీకి నిధులు కేటాయించుకునే అవకాశం ఉంది.
అం దువలనే సింగ్ ఆ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని మొన్న సెప్టెంబర్ 20న ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయ టపెట్టింది. దీనిని సింగ్ పూర్తిగా ఖండించలేదు సరి కదా పత్రిక పేర్కొన్న అంశాలు సైనిక, గూఢచర్యాలలో సర్వ సాధారణమేనని మూడురోజుల తర్వాత ఒక ఛానె ల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించడం విశేషం.
వీకే సింగ్ వారసునిగా బిక్రమ్‌సింగ్ పదవి చేపట్టిన తర్వాతే ఈ పరిణామాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేగం గా చోటు చేసుకున్నాయి. సింగ్ స్వరాష్ట్రం హర్యానా. అక్కడే రేవారి అనే పట్టణంలో సెప్టెంబర్ 15న ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తొలి సభ జరిగింది. ఆ సభలో మోడీ పక్కన సింగ్ ఆశీనులయ్యారు. బిక్రమ్‌సింగ్ ఆదే శించిన మేరకు లెఫ్ట్‌నెంట్ జనరల్ వినోద్ భాటియా రూపొందించిన నివేదిక అనూహ్యంగా నాలుగు రోజులకే బహిర్గతమైంది. ఆ అంశాలతో ఆంగ్ల దినపత్రిక సింగ్ వ్యవ హారాలపై కథనం ప్రచురించి సంచలనం రేపింది. ఈ నివే దికలోనే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి వ్యవసాయ మంత్రి గులాం హసన్ మీర్‌కు రూ.1.19 కోట్లు ముడుపులుగా అందజేసి నట్లు ఆరోపణలున్నాయి.
వీటిని మీర్ వెంటనే ఖండిం చారు. జమ్మూ-కాశ్మీర్ హ్యుమానిటేరియన్ సర్వీస్ ఆర్గనై జేషన్ పేరుతో ఒక ప్రభుత్వేతర సంస్థను ఏర్పాటు చేయ డానికి కూడా వీకే సింగ్ ప్రోత్సహించారన్న ఆరోపణ ఉం ది. కాశ్మీర్లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌కు బిక్రమ్సింగ్ను బాధ్యుడిని చేసి సైనిక దళాల ప్రధానాధికారి పదవి దక్క కుండా ఈ ఎన్జీఓను అడ్డుపెట్టుకునే వీకే సింగ్ ప్రయత్నం చేశారని ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు రూ.2.38 కోట్లు చెల్లించారని భాటియా నివేదికలో ఉన్నట్లు ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులు, రక్షణ సిబ్బం ది, కాశ్మీర్ రాజకీయ నాయకుల సెల్ఫోన్లు టాపింగ్ చేయడానికి అవసరమైన యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడానికి టీఎస్డీ ద్వారానే రూ.8 కోట్లు మంజూరు చేశారని కూడా సింగ్‌పై ఆరోపణలు ఉన్నాయి.
2008లో ముంబై నగరం మీద ఉగ్రవాదులు దాడులు జరిపిన తరువాత టీఎస్డీని ఏర్పాటు చేశారు. దానిని అత్యంత రహస్యంగా ఉంచారు. అయితే రాజకీయ నాయ కుల ైవైఖరి, సెన్యం మీద పడిన రాజకీయ నీడ ఫలితంగా ఈ వివాదం పుణ్యమా అని టీఎస్డీ పేరు వెలుగులోకి వచ్చింది. టీఎస్డీ పేరు సహా సింగ్ మీద ఉన్న ఆరోపణ లు బహిర్గతమైన సమయం గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంగ్ల దినపత్రిక నివేదిక మీద స్పందిం చినప్పుడు వీకే సింగ్, ఇదంతా కాంగ్రెస్ కుట్రేనని సమా ధానం ఇచ్చారు. దేశ భద్రతల దృష్ట్యా ఈ అంశం మీద ఎక్కువగా మాట్లాడలేమని చెబుతూనే కాంగ్రెస్ నాయ కులు సింగ్ మీద ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకునే విషయం ఆలోచిస్తామని మాత్రమే చెబుతున్నారు. దర్యా ప్తు గురించి కూడా ఒక ప్రకటన చేయడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధపడటం లేదు.
అయితే జమ్మూ-కాశ్మీర్ శాసనసభ మాత్రం వీకే సింగ్ వ్యవహారం మీద దర్యాప్తు జరిపించాల్సిందేనని అక్టోబర్ 6న కోరింది. నేషనల్ కాన్ఫ రెన్స్తో సహా కాశ్మీర్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఈ ముడుపుల వ్యవహారం మీద దర్యాప్తు చేయించాల్సిందే నని పట్టుబడుతున్నాయి. కానీ అవసరమైనప్పుడు ముడు పులు చెల్లించడం గతంలోనూ ఉందని వీకే చేసిన వ్యాఖ్య ను ఎనిమిది మంది మాజీ సైన్యాధ్యక్షులు ఖండించారు. ఏమైనా ఈ అంశం మీద దర్యాప్తు జరపడం కేంద్రానికి అంత సులభం కాదని అర్థమవుతోంది. ఇప్పుడు దరాప్తు చేస్తే మరిన్ని వివాదాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉం టుందన్న భీతి కూడా ఉంది.
మోడీ సభలో పాల్గొనడానికి ముందే సామాజిక ఉద్య మకారుడు అన్నా హజారేను వీకే సింగ్ సమర్థించారు. సైనికుల స్థితిగతుల గురించి ఆయన నేరుగా ప్రధానికి లేఖ రాసి ఇరుకున పెట్టారు. అవినీతి ఆరోపణలు ఉన్న సైనికా ధికారులపట్ల సింగ్ తన హయాంలో కఠినంగా వ్యవహ రించారన్న పేరు ఉంది. కాబట్టి యూపీఏ ప్రభుత్వం సిం గ్ మీద కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తే తెర వెనుక మం త్రాంగమే ఎక్కువ అని అనుకోక తప్పదు. దేశ భద్రత, కాశ్మీర్ వ్యవహారం ముడిపడి ఉన్న ఇలాంటి ఉదంతంలో కూడా నేతల బాధ్యతారాహిత్యం క్షమార్హం కాదు.
-డాక్టర్ గోపరాజు నారాయణరావు