పిడుగుపాటుకు 26 మందికి అస్వస్థత | 26 people sickness due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 26 మందికి అస్వస్థత

Published Mon, Nov 10 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

26 people  sickness due to thunderbolt

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఘటన

కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం మైలారంలో ఆదివారం ఉదయం 11 గంటలకు పిడుగు పడడంతో పత్తి చేనులో పనిచేస్తున్న 26 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వారు చేనులో పత్తి తీస్తుండగా చిన్నపాటి వర్షం పడింది. దీంతో అందరూ సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్దామని బయలుదేరారు.

వారు చెట్టుకు 100 గజాల దూరంలో ఉండగానే ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో షాక్‌కు గురైన కూలీలంతా అస్వస్థతకు లోనయ్యారు. పక్కనున్న వారు కూలీలను కొత్తగూడెం మండలం రేగళ్లలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement