హామీలు నెరవేర్చాలని ధర్నా | labor agitation | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చాలని ధర్నా

Jul 30 2016 10:32 PM | Updated on Sep 4 2017 7:04 AM

హామీలు నెరవేర్చాలని ధర్నా

హామీలు నెరవేర్చాలని ధర్నా

మున్సిపల్‌ శాఖలో పని చేసే ఇంజినీరింగ్‌ విభాగ కార్మికులకు (సెమీ స్కిల్డ్, స్కిల్డ్‌) గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన జీతాల పెంపు హామీలను నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు.

కార్మికులకు జీతాలు పెంచాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్‌
 
నెహ్రూనగర్‌: మున్సిపల్‌ శాఖలో పని చేసే ఇంజినీరింగ్‌ విభాగ కార్మికులకు (సెమీ స్కిల్డ్, స్కిల్డ్‌) గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన జీతాల పెంపు హామీలను నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. దిగుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు  తెలిపిన  అప్పిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం జూలై 25వ తేదీన పుష్కర సమయంలో జరిగిన చర్చలలో భాగంగా ఇంజినీరింగ్‌ విభాగపు సెమీ స్కిల్డ్, స్కిల్డ్‌ కార్మికులకు వేతన పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ చేసిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా ఇంత వరకు ఈ విషయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మజ్దూర్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కార్మికులకు సాక్ష్యాత్తూ రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీలను తక్షణమే ఇంజినీరింగ్‌ విభాగం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, యనమల రామకష్ణుడు, కె.అచ్చెన్నాయుడులతో ఇంజినీరింగ్‌ కార్మికులకు జరిగిన చర్చలలో అన్‌ స్కిల్డ్‌ కార్మికులకు వేతనాలు పెంచిన విధంగానే సెమీ స్కిల్డ్, స్కిల్డ్‌ వర్కర్లకు కూడా పూర్వ ప్రభుత్వాలు అనుసరించిన వేతన పెంపు రీతిలో, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటిల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ కార్మికులకు వేతన పెంపు చేయాలన్నారు. కార్యక్రమంలో  జేఏసీ నాయకులు మాదా వెంకటముత్యాలరావు, వరికల్లు రవికుమార్, సోమి శంకరరావు, సీఐటీయూ నాయకులు ముత్యాలరావు, ఆది నికల్సన్, ఐఎన్‌టీయూసీ నాయకుల పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement