కార్మిక వ్యతిరేక విధానాలు వద్దు..
కార్మిక వ్యతిరేక విధానాలు వద్దు..
Published Fri, Sep 2 2016 9:39 PM | Last Updated on Tue, Aug 21 2018 8:07 PM
అరండల్‌పేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు మద్దు ప్రేమ్‌జ్యోతిబాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇతర వామపక్ష యూనియన్‌లతో కలిసి వైఎస్సార్‌టీయూసీ శుక్రవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా మద్దు ప్రేమ్‌జ్యోతిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విచ్చలవిడిగా అనుమతిస్తుందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలలో వాటాలను ఉపసంహరించే ప్రక్రియను వెంటనే విడనాడాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుష్కరాల పనుల్లో కీలకమైన పాత్ర పోషించిన పారిశుధ్య కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వకుండా వారి ఉసురుపోసుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు.
Advertisement