
సాక్షి, ముంబై: దీర‍్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల్నిపరిష్కరించాలని కోరుతూ ఓలా, ఉబెర్ డ్రైవర్ల సమ్మె సోమవారం అర్థరాత్రినుంచి ప్రారంభంకానుంది. రాజ్‌థాకరే నాయకత్వంలోని ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవనిర్మాణ్ వాహతుక్ సేన ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో పలునగరాల్లో క్యాబ్ సేవల వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలను ఈ సమ్మెతీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతోపాటు పలు నగరాల్లోని క్యాబ్ వినియోగదారులు ఇబ్బంందులను ఎదుర్కోనున్నారు.
వేలాదిమంది డ్రైవర్ పార్టనర్స్ తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారని ఎంఎన్‌ఎస్ అనుబంధ సంఘం ప్రకటించింది. యూనియన్ అధ్యక్షుడు సంజయ్ నాయక్ మాట్లాడుతూ, సమ్మెకు సహకరించమని జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తామని.. వినకపోతే ఎంఎన్‌ఎస్ శైలిలో సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు. మరోవైపు తమ డ్రైవర్లకు భద్రత కల్పించాల్సిందిగా ఓలా, ఉబెర్ యాజమాన్యాలు పోలీసు అధికారులను కోరాయి. నగరంలో కాబ్ రైడ్ సమయంలో ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలను డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులను కలిశామని ఓలా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అటు మరికొన్ని సంఘాలు ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్‌లో సమ్మెను పాటించడంలేదని ఇప్పటికే కొన్ని సంఘాలు ప్రకటించడం గమనార్హం.
ఇదిఇలా ఉంటే నిరవధిక సమ్మెకు క్యాబ్‌డ్రైవర్లకు హెచ్చరించడంతో ముంబై పోలీసులు నగరంలో149 సెక్షన్ విధించారు. ఈ మేరకు వివిధ సంఘాల నాయకులకు నోటీసులు జారీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్య తీసుకుంటామని సీనియర్ అధికారి వ ెల్లడించారు.కాగా మార్చి 18 ఆదివారం అర్థరాత్రి నుంచి మూకుమ్మడిగా సమ్మెకు దిగనున్నామని ఓలా, ఉబెర్ డ్రైవర్లు హెచ్చరించారు. అంతేకాదు తమ సమస్యల్ని పరిష్కరించకపోతే నిరవధిక సమ్మకు దిగమనున్నామని మహారాష్ట్ర నవనిర్మాణ్ వాహతుక్ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment