ఢిల్లీ వైద్యులతో రీ పోస్టుమార్టం చేయాలి | re-post-mortem with Delhi medical doctors | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వైద్యులతో రీ పోస్టుమార్టం చేయాలి

Published Sun, Apr 12 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

re-post-mortem with Delhi medical doctors

  •       సీబీఐతో విచారణ చేపట్టాలి
  •      అన్బుమణి రాందాస్ డిమాండ్
  •      బాధిత  కుటుంబాలకు పార్టీల
  •      ఆర్థిక సాయం
  •  
     వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో 20 మంది కూలీలు మృతి చెందగా, అందులో ఆరుగురి మృతదేహాలను ఢిల్లీ నిమ్స్ ఆస్పత్రి వైద్యులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని పార్లమెంట్ సభ్యుడు అన్బుమణి రాందాసు డిమాండ్ చేశారు. కన్నమంగళానికి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయనకు మృతుల భార్యలు ఏడుగురు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో తమ భర్త, కుమారులు కూలీ పనుల కోసం తిరుత్తణి వెళ్లారని అక్కడ నుంచి బస్సులో వస్తుండగా, నగరి పోలీసులు అనుమానంతో తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపారన్నారు.
     
     అనంతరం ఎన్‌కౌంటర్ పేరుతో మృత దేహాలను అడవికి తీసుకెళ్లి మూలకు ఒకరిని విసిరేసి ఎర్రచందనాన్ని వారి పక్కన ఉంచి సినీ తరహాలో చిత్రీకరించారన్నారు. అనంతరం మృతి చెందిన వారి బంధువుల ముందు పోస్టుమార్టం నిర్వహించి సొంత గ్రామాలకు పంపారన్నారు. మృతదేహాల్లో చేతులు, కాళ్లు లేకుండా శరీరంలోని కొన్ని బాగాల్లో యాసిడ్ పోసినట్లు గుర్తులు ఉన్నాయని, కత్తుల గాయాలున్నాయని వీటిపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. దీనిపై హైకోర్టులో కేసు దాఖలు చేశామని అదే విధంగా న్యాయవాది బాలుతో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, న్యాయ విచారణ చేపట్టాలని ఆ వినతి పత్రంలో ఉంది.
     
     వినతి పత్రాన్ని స్వీకరించిన అన్బుమణి రాందాసు విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ బాధితులైన 20 మంది అమాయక కూలీల మృత దేహాలను పరిశీలించేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని, డిల్లీ నిమ్స్ ఆస్పత్రి వైద్యులచే రీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారంగా రూ.25లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పామాక ఆధ్వర్యంలోను పరిహారం అందజేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. మృతి చెందిన వారి పిల్లలకు విద్యా ఖర్చులను భరిస్తామన్నారు. ఆయనతో పాటు తమాక పార్టీ అధ్యక్షులు జికే మణి, సెంజి ఎమ్మెల్యే గణష్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
     
     బాధితులకు రూ.5లక్షల పరిహారం
     తిరుపతి ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు ఇస్తామని  మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. దీంతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ముక్కూరు సుబ్రమణి, కలెక్టర్ జ్ఞానశేఖరన్ తిరువణ్ణామలై జిల్లాలోని 12 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చె క్కులను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌పై ఆంధ్ర హైకోర్టులో కేసు దాఖలు చేయాలని చెన్నై హైకోర్టు తీర్పు నిచ్చిందని అక్కడికి వెళ్లేందుకు బాధితులకు స్థోమత లేనందున ప్రభుత్వమే ఈ కేసును నడిపించాలన్నారు.
     
     తమాక ఆధ్వర్యంలో రూ.25 వేలు ఆర్థిక సాయం
     తమిళ మానిల కాంగ్రెస్ అద్వర్యంలో బాధిత కుటుంబాలను జీకే వాసన్ కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ పరంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేలు చెక్కులను అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు ప్రకటించిందని వీటిని రూ.10 లక్షలకు పెంచాలన్నారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 3,500మందికి పైగా తమిళ కూలీలు ఆంధ్ర జైలులో ఉన్నారని వారందరినీ ఆంధ్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.
     
     డీఎంకే లక్ష ఆర్థిక సాయం
     డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు రూ.1లక్ష ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు. దీంతో తిరువణ్ణామలై జిల్లాలోని 12 మంది మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఏవా వేలు, పార్టీ కార్యకర్తలు భాదిత కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.లక్ష  చెక్కులను పరిహారంగా అందజేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement