re-post-mortem
-
మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం
-
మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టం
► జడ్జి, తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన వైద్య నిపుణులు ► ఒంటిపై గాయాలు లేవు, ఎముకలు విరగలేదు: ఫోరెన్సిక్ నిపుణులు సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మం డలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన దళిత యువకుడు మంథని మధుకర్ మృతదేహానికి సోమవారం రీపోస్టు మార్టం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ఖననం చేసిన చోటే పోలీస్ బందోబస్తు మధ్య రీపోస్టుమార్టం జరిపించారు. కరీంనగర్ జిల్లా ఫస్ట్‌క్లాస్ కోర్టు మేజిస్ట్రేట్ కుష, మంథని తహసీల్దార్ జి.శ్రీనివాస్, మధుకర్ కేసు విచారణాధికారి, పెద్దపల్లి ఏసీపీ సింధు శర్మ, మధుకర్ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్య సమక్షంలో కాకతీయ, ఉస్మానియా మెడికల్ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు కృపాల్‌సింగ్, దేవరాజ్ రీపోస్టుమార్టం చేశా రు. మధుకర్ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు బంధువులు మారుపాక సమ్మయ్య, నక్క ఎల్లయ్యను కూడా రీపోస్టుమార్టం వద్దకు అనుమతించారు. వీడియో చిత్రీకరణ మధ్య వైద్య నిపుణులు 2 గంటలకుపైగా రీపోస్టు మార్టం నిర్వహించారు. ప్రక్రియ జరుగుతు న్నంతసేపు సమీపంలో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టుకు నివేదిక... రీపోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో వారం రోజుల్లో హైకోర్టుకు పంపనున్నట్లు వైద్యులు తెలిపారు. కాకతీయ, ఉస్మానియా మెడికల్ కళాశాలల ఫోరెన్సిక్ నిపుణులు వేర్వే రుగా తమ నివేదికలను కరీంనగర్ జిల్లా ఫస్ట్‌క్లాస్ కోర్టు మేజిస్ట్రేట్ కుషకు అందజేసి ఆయన ద్వారా హైకోర్టుకు పంపనున్నారు. వీడియో సీడీలను సీల్డ్కవర్లో భద్రపరిచి, సీజ్ చేశారు. ఎలాంటి గాయాలు లేవు: కృపాల్‌సింగ్ రీపోస్టుమార్టం అనంతరం కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు కృపాల్‌సింగ్ విలేకరులతో మాట్లాడారు. మృతదేహాన్ని ఖననం చేసి 27 రోజులు అవుతుండడంతో పూర్తిగా కుళ్లిపోయిందని, దీంతో పోస్టుమార్టం ఆసల్యమైందని తెలిపా రు. శరీరం కుళ్లిపోయినందున క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడని ఇప్పుడు చెప్ప లేమన్నారు. తలపై ఎలాంటి గాయాలు లేవని, ఎముకలు విరగలే దని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ ఎల్ రిపోర్టు నెలరోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నా రు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 60 మంది ని విచారించినట్లు పెద్దపల్లి డీసీపీ కె.విజేందర్ రెడ్డి చెప్పారు. ముమ్మాటికీ హత్యే : మధుకర్ తల్లిదండ్రులు మధుకర్ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్య కూడా విలేకరులతో మాట్లాడారు. మధుకర్ మృతదేహంపై గాయాలు ఉన్నాయని, ఎముకలు ఎక్కడికక్కడ విరిగిపోయి ఉన్నాయన్నారు. మర్మంగా లను కోసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఎడమ కన్ను లేదన్నారు. ఇదే విషయాన్ని అక్కడ డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. తమ కొడుకుది ముమ్మా టికీ హత్యేనని పునరుద్ఘాటించారు. -
రీతూను చంపింది భర్తే
వీడిన మాజీ ఎయిర్ హోస్టెస్ హత్య కేసు మిస్టరీ నేరాన్ని అంగీకరించిన ఆమె భర్త సచిన్ హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ పరిధి ఇందిరానగర్‌కు చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూను ఆమె భర్తే అంత మొందించాడు. ఆమె ముఖంపై దిండుతో అదిమి ప్రాణాలు తీసినట్లు రీతూ భర్త సచిన్ ఉప్పల్ నేరాన్ని అంగీకరించాడు. కేసు వివరాలను గురువారం ఉప్పల్ ఏసీపీ కార్యాలయంలో మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. రీతూ ఈ నెల 19 న హత్యకు గురైన సంగతి విదితమే. భార్య మీద అనుమానంతో పాటు తనను స్నేహితుని ముందు అవమానించిందన్న ఆగ్రహంతో ఆమెను భర్తే అంతమొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మద్యం తాగి..స్నేహితునితో వచ్చి.. ఈ నెల 19వ తేదీ రాత్రి సచిన్ తన స్నేహితుడు కోటగిరి రాకేశ్‌తో కలిసి హిమాయత్ నగర్‌లోని ఓ బార్లో మద్యం తాగాక 10.30 గంటల సమయంలో అతన్ని తీసుకొని తమ ప్లాట్‌కు వచ్చాడు. అలా రావడాన్ని భార్య రీతూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని పట్టించుకోని సచిన్ ఆమె టీవి చూస్తుండగా రిమోట్ తీసుకొని స్నేహితునితో కలిసి చూసేందుకని క్రికెట్ మ్యాచ్ పెట్టాడు. ఇది వారి మధ్య తొలుత వాగ్వాదానికి దారి తీసింది. అంతే కాకుండా తనకూ, తన స్నేహితునికీ ఇంట్లో ఉన్న బిర్యానీ వడ్డించమని కోరాడు. రీతూ అంగీకరించక పోవడంతో అవమానంగా భావించి స్నేహితుని సమక్షంలోనే ఆమెపై చేయి చేసుకున్నాడు. దాన్ని అడ్డుకునేందుకు రాకేశ్ ప్రయత్నించడంతో అతన్ని ఇంట్లోనుంచి బయటకు గెంటి తలుపు వేసేశాడు. అనంతరం రీతూను మంచంపైకి నెట్టి ఆమె ముఖంపై దిండుతో అదిమి హతమార్చాడు. ఈ సంఘటనను దాచి ఉంచి భార్య తల్లితండ్రులకు సచిన్ ఫోన్‌చేసి రీతూ ఆరోగ్యస్థితి సీరియస్‌గా ఉందని తెలియజేశాడు. వారు అక్కడికి చేరువలోనే ఉన్న తమ మరో కుమార్తె ఇంటివద్ద ఉంటున్నారు. వారు వెంటనే వచ్చి చూసేసరికి రీతూ మంచంపై మరణించి ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అదే రోజు నిందితుడ్ని కస్టడీలోకి తీసుకొని విచారించడంతో కేసు గుట్టు వీడింది. ఈ మేరకు పోలీసులు గురువారం సచిన్ ఉప్పల్‌ను రిమాండ్‌కు తరలించారు. నిందితులుగా ఉన్న అతని తండ్రి రమేష్ ఉప్పల్, తల్లి సీమా ఉప్పల్, సోదరి నితిన్ ఉప్పల్‌పై కూడా కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సచిన్, అతని స్నేహితుడు రాకేశ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా తమ కుమార్తె మరణానికి కారకుడైన సచిన్‌కు ఉరిశిక్ష వేస్తేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని రీతూ తల్లిదండ్రులు తెలిపారు.కాగా సచిన్ దంపతుల ఆరునెలల కొడుకు తల్లి మంచంపై ఆడుకుంటున్న సమయంలోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి పలువురు కదిలిపోయారు. రీ పోస్టుమార్టం నిర్వహించాం: ఏసీపీ రీతూ హత్య కేసులో రెండో అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రీ-పోస్టుమార్టం కూడా జరిపించామని ఏసీపీ రవిచందన్‌రెడ్డి తెలిపారు. కాగా సచిన్‌కు కొడుకు విషయంలో భార్యపై అనుమానం ఉండేదనీ దీనికోసం డీఎన్ఏ పరీక్ష కోసం ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఈ విషయమై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదనీ ఈ కోణంలోనూ విచారణ చేపడతామని వెల్లడించారు. రీతు హత్య కేసులో వెంటనే స్పందించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి, పోలీస్ సిబ్బందికి తగిన పారితోషికం అందచేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
అవమానించిందనే రీతూను చంపేశా..
-
రీతూ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం
హైదరాబాద్ : భర్త చేతిలో దారుణ హత్యకు గురైన మాజీ ఎయిర్‌హోస్టెస్ రీతూ మృతదేహానికి వైద్యులు రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో 11 మంది సభ్యుల వైద్యుల బృందం మంగళవారం రీ పోస్ట్‌మార్టం చేశారు. మరోవైపు అల్లుడు సచిన్‌నే తన కుమార్తెను హత్య చేసినట్లు రీతూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా భర్త ఇంట్లో మద్యం సేవించడంపై రీతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో మద్యం మత్తులో ఉన్న సచిన్ బీరు సీసాతో రీతు తలపై బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడ్డ సచిన్ స్నేహితులు, అపార్ట్మెంట్ వాచ్‌మన్ సహకారంతో రామంతాపూర్‌లోని మాట్రిక్ అస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. అయితే అప్పటికే రీతు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో... కంగారుపడి ఏమీ ఎరగనట్టుగా రీతు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి బెడ్రూంలో పడేసి... ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. -
ఢిల్లీ వైద్యులతో రీ పోస్టుమార్టం చేయాలి
సీబీఐతో విచారణ చేపట్టాలి అన్బుమణి రాందాస్ డిమాండ్ బాధిత కుటుంబాలకు పార్టీల ఆర్థిక సాయం వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్లో 20 మంది కూలీలు మృతి చెందగా, అందులో ఆరుగురి మృతదేహాలను ఢిల్లీ నిమ్స్ ఆస్పత్రి వైద్యులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని పార్లమెంట్ సభ్యుడు అన్బుమణి రాందాసు డిమాండ్ చేశారు. కన్నమంగళానికి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయనకు మృతుల భార్యలు ఏడుగురు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో తమ భర్త, కుమారులు కూలీ పనుల కోసం తిరుత్తణి వెళ్లారని అక్కడ నుంచి బస్సులో వస్తుండగా, నగరి పోలీసులు అనుమానంతో తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపారన్నారు. అనంతరం ఎన్కౌంటర్ పేరుతో మృత దేహాలను అడవికి తీసుకెళ్లి మూలకు ఒకరిని విసిరేసి ఎర్రచందనాన్ని వారి పక్కన ఉంచి సినీ తరహాలో చిత్రీకరించారన్నారు. అనంతరం మృతి చెందిన వారి బంధువుల ముందు పోస్టుమార్టం నిర్వహించి సొంత గ్రామాలకు పంపారన్నారు. మృతదేహాల్లో చేతులు, కాళ్లు లేకుండా శరీరంలోని కొన్ని బాగాల్లో యాసిడ్ పోసినట్లు గుర్తులు ఉన్నాయని, కత్తుల గాయాలున్నాయని వీటిపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. దీనిపై హైకోర్టులో కేసు దాఖలు చేశామని అదే విధంగా న్యాయవాది బాలుతో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, న్యాయ విచారణ చేపట్టాలని ఆ వినతి పత్రంలో ఉంది. వినతి పత్రాన్ని స్వీకరించిన అన్బుమణి రాందాసు విలేకరులతో మాట్లాడుతూ ఎన్కౌంటర్ బాధితులైన 20 మంది అమాయక కూలీల మృత దేహాలను పరిశీలించేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని, డిల్లీ నిమ్స్ ఆస్పత్రి వైద్యులచే రీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారంగా రూ.25లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పామాక ఆధ్వర్యంలోను పరిహారం అందజేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. మృతి చెందిన వారి పిల్లలకు విద్యా ఖర్చులను భరిస్తామన్నారు. ఆయనతో పాటు తమాక పార్టీ అధ్యక్షులు జికే మణి, సెంజి ఎమ్మెల్యే గణష్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధితులకు రూ.5లక్షల పరిహారం తిరుపతి ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. దీంతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ముక్కూరు సుబ్రమణి, కలెక్టర్ జ్ఞానశేఖరన్ తిరువణ్ణామలై జిల్లాలోని 12 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చె క్కులను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌పై ఆంధ్ర హైకోర్టులో కేసు దాఖలు చేయాలని చెన్నై హైకోర్టు తీర్పు నిచ్చిందని అక్కడికి వెళ్లేందుకు బాధితులకు స్థోమత లేనందున ప్రభుత్వమే ఈ కేసును నడిపించాలన్నారు. తమాక ఆధ్వర్యంలో రూ.25 వేలు ఆర్థిక సాయం తమిళ మానిల కాంగ్రెస్ అద్వర్యంలో బాధిత కుటుంబాలను జీకే వాసన్ కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ పరంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేలు చెక్కులను అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు ప్రకటించిందని వీటిని రూ.10 లక్షలకు పెంచాలన్నారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 3,500మందికి పైగా తమిళ కూలీలు ఆంధ్ర జైలులో ఉన్నారని వారందరినీ ఆంధ్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. డీఎంకే లక్ష ఆర్థిక సాయం డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు రూ.1లక్ష ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు. దీంతో తిరువణ్ణామలై జిల్లాలోని 12 మంది మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఏవా వేలు, పార్టీ కార్యకర్తలు భాదిత కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.లక్ష చెక్కులను పరిహారంగా అందజేశారు.