శ్రమ అనే ఆయుధంతో విజయం సాధించాలి
రామన్నపేట
విద్యార్థులు శ్రమ అనే ఆయుధాన్ని ఉపయోగించి జీవితంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న సబ్జెక్టులో మంచి ప్రావీణ్యాన్ని సాధించాలని సూచించారు. అబ్దుల్‌కలాం ఆలోచనలకు అనుగుణంగా సామాన్యులకు నాణ్యమైనవిద్యను అందించేవిధంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సరైనవసతులు లేనందున రవాణామంత్రి మహేందర్‌రెడ్డి కాలేజీలకు కూడా ప్రభుత్వం అనుమతించలేదని వివరించారు. కళాశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భానుప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, టీఆర్‌ఎస్‌పార్టీ మండల అధ్యక్షుడు బందెల రాములు, వైస్‌ప్రిన్సిపాల్ ఎ.ప్రదీప్‌రెడ్డి, అధ్యాపకులు బి.రవీందర్, కె.అనిత, సీహెచ్ భిక్షమయ్య, వి.బుచ్చిరెడ్డి, కె.భాస్కర్, ఆర్‌వీ రామారావు, కె.సాలయ్య, సీహెచ్ రాకేష్‌భవానీ, బీఎస్‌ఆర్‌యూ రాజశేఖర్, జి.యాదగిరి, మల్లేశం పాల్గొన్నారు.