Ramannapeta
-
వైఎస్సార్ పాలనను తిరిగి తెస్తాం: షర్మిల
సాక్షి, రామన్నపేట: వైఎస్సార్ కాలం నాటి సంక్షేమ పాలనను తిరిగి తీసుకురావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం, వెల్లంకి, గొల్నేపల్లి గ్రామాల మీదుగా 10 కి.మీ. సాగింది. ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో జరిగిన సభల్లో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదించి అధికారమిస్తే రాజన్నబిడ్డగా చివరిక్షణం వరకు తెలంగాణ ప్రజల బాగు కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ఎలాంటి పన్నులు విధించకుండా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మోడల్ సీఎంగా నిలిచారని అన్నారు. పారదర్శక పాలన అందించాలనే పరితపించి ప్రజలవద్దకు వెళ్తుంటే ప్రాణాలు వదిలాడని భావోద్వేగంతో చెప్పారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, యువకుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని విమర్శించారు. ఆమె వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్ మహ్మద్‌అత్తార్ తదితరులు ఉన్నారు. -
యాదాద్రి: 25వ రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
-
యాదాద్రి: 25వ రోజుకు చేరిన వైఎస్ షర్మిల పాదయాత్ర
-
కులంపేరుతో దూషణ: సర్పంచ్ భర్తకు దేహశుద్ధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురంలో అధికార పార్టీ సర్పంచ్ భర్తకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పల్లెపగ్రతి కార్యక్రమంలో చేసిన పనులకు సర్పంచ్ భర్త కాల్వ శ్రవణ్ బిల్లు ఇవ్వకపోవడంతోపాటు తిరిగి వారినే బెదిరింపులకు గురిచేస్తున్నాడు. అంతేగాక డబ్బులు అడిగినందుకు కులం పేరుతో దూషించడం ప్రారంభించాడు. ఒక్కసారిగా మాట మాట పెరిగి పెనుగులాటకు దారి తీయగా గ్రామస్తులు అతన్ని చితకబాదారు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. -
ముగ్గురు జల సమాధి
రామన్నపేట: మహా శివరాత్రి సందర్భంగా సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చెరువులో కారు కడగడానికి వెళ్లిన తండ్రి, కొడుకు, స్నేహితుడు జలసమాధి అయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో వెలుగుచూసింది. రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ ధర్నె రాణి భర్త మధు (35) టీఆర్ఎస్ నాయకుడు. వీరికి కుమారుడు మణికంఠ (10), కుమార్తె అభినయ ఉన్నారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కారును కడిగేందుకు ఉదయం 11 గంటల సమయంలో సర్నేనిగూడెంలోని తన ఇంటి నుంచి స్నేహితుడైన నన్నూరి శ్రీధర్‌రెడ్డి (25)తో కలిసి వెల్లంకిలోని మరో మిత్రుడి పొలంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పయనమయ్యారు. పండుగ సందర్భంగా స్కూల్‌కు సెలవు కావడంతో కుమారుడు మణికంఠ కూడా వస్తానని మారాం చేయడంతో తండ్రి మధు వద్దని వారించాడు. తాత యాదయ్య మధుకి నచ్చజెప్పి మనవడిని తండ్రితో పాటు పంపించాడు. ఈ క్రమంలో రాణి, ఆమె భర్త మధు, అత్తా మామలు అందరూ కలసి శుక్రవారం సాయంత్రం వెల్లంకిలోని శివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ బావి వద్ద ఉన్న వీరికి గుడికి వెళ్దామని ఇంటి నుంచి ఫోన్ రావడంతో సాయంత్రం 4.30 గంటల సమయంలో బావి వద్ద నుంచి ముగ్గురు కారులో బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. గుడికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా వారి ఫోన్లు కలువ లేదు. రాత్రి వరకు ముగ్గురు తిరిగి రాకపోవడం, ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే వారి ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు ఇళ్లతో పాటు వ్యవసాయ పొలాల వద్ద వెతికినా లాభం లేకుండాపోయింది. శనివారం ఉదయం చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ ఏవీ రంగా, ఎస్ఐలు సీహెచ్ సాయిలు, శివనాగప్రసాద్ సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు, సెల్ టవర్ల నెట్వర్క్ (సీడీఆర్) ఆధారంగా ఆ ముగ్గురు స్థానిక ఈదుల చెరువు శివారులోనే అదృశ్యమైనట్లు గుర్తించారు. చెరువులో జల సమాధి..: సీడీఆర్ ఆధారంగా ఫోన్ మాట్లాడిన కొద్దిసేపటికే సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడం, కారు కడిగిన బావికి 500 మీటర్ల దూరంలోనే చెరువు ఉండటంతో పోలీసుల దృష్టి సమీపంలోని ఈదుల చెరువుపై పడింది. అప్పటికే అక్కడికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏసీపీ, సీఐతో చర్చించారు. వెల్లంకికి చెందిన యువకుల సాయంతో ఈదుల చెరువులోకి దిగి కారు కోసం వెతికారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువు ఒడ్డు సమీపంలో కారు మునిగినట్లుగా గుర్తించారు. జేసీబీ సాయంతో కారును వెలికి తీసి అందులో ఉన్న ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. కారు అదుపు తప్పడంతోనే..: బావి వద్ద నుంచి బయలుదేరిన కారు ఈదుల చెరువుపై నిర్మించిన కట్ట మీదకు రాగానే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఇది ఎవరూ గమనించకపోవడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లిని ఓదార్చిన కుమార్తె..: భర్త అదృశ్యమై పుట్టెడు దుఃఖంలో ఉన్న మధు భార్య రాణిని ఆమె కుమార్తె అభినయ ఓదార్చిన తీరు కంటతడి పెట్టించింది. వెల్లంకి హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న అభియన.. తల్లి, బంధువులతోపాటు కారు కడిగిన వ్యవసాయ బావి వద్దకు వచ్చింది. తన భర్త, కుమారిడి ఆచూకీ చెప్పా లని కనిపించిన వారినల్లా గుండెలవిసేలా రోదిస్తూ అడుగుతుండటంతో.. నాన్న, తమ్ముడు క్షేమంగా తిరిగి వస్తారని, నువ్వు ఏడవద్దని తల్లిని ఓదార్చిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సహాయక చర్యల్లో ఎమ్మెల్యే..: నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. సర్పంచ్ రాణిని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక యువకులతో ఘటనా స్థలానికి వెళ్లి జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను బయటకు తీసిన అనంతరం పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా బోగారం వాసి
సాక్షి, రామన్నపేట (నకిరేకల్) : యాదాద్రిభువనగిరి జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు లక్ష్మణ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వీరితోపాటు మరో ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రప్రతి రామ్నాథ్కోవింద్ ఈనెల 23న ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. బాల్యం–విద్యాభ్యాసం రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు గోపాల్–సత్తెమ్మలది సామాన్య రైతు కుటుంబం. ఆ దంపతులకు శమంత, లక్ష్మణ్, మాధవి, భాస్కర్, అరుణ సంతానం. రెండవ సంతానమైన లక్ష్మణ్ 1966 జూన్ 2న తన అమ్మమ్మగారి ఊరైన ఇంద్రపాలనగరం(తుమ్మలగూడెం)లో జన్మించారు. బోగారం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు. రామన్నపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 10వ తరగతి వరకు, ఇంటర్ రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిచేశారు. ఆమీర్‌పేటలోని న్యూసైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన లక్ష్మణ్ నెల్లూరు వీఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ చదివి పట్టా పొందారు. 1993లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. న్యాయవాదిగా రాణింపు సీనియర్ న్యాయవాది ఎం.రాధాకృష్ణమూర్తివద్ద జూనియర్‌గా చేరి వృత్తికి సంబంధించిన మెళకువలను లక్ష్మణ్ నేర్చుకున్నారు. 1999 నుంచి సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. కొద్దిరోజులకే మంచి న్యాయవాదిగా పేరు సంపాదించారు. యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు న్యాయవాదిగా వ్యవహరించడంతోపాటు, సివిల్, లేబర్, రాజ్యాంగసంబంధ కేసుల్లో ప్రావీణ్యం సాధించారు. 2017లో అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య మంజుల, శ్రీజ, హిమజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణాష్టమిరోజున జన్మించిన లక్ష్మణ్ అదే రోజునే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడం విశేషం. గర్వంగా ఉంది నా కుమారుడు అత్యున్నతమైన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి చదువు మీదనే ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఆడంబరాలకు పోయేవాడు కాదు. తాను ఏ పనితలపెట్టినా పట్టుదలతో పూర్తిచేసేవాడు. వృత్తి నిర్వహణలో తీరిక దొరకక పోయినప్పటికీ మా యోగక్షేమాలు చూసుకోవడం మాత్రం మరచిపోడు. –గోపాల్–సత్తెమ్మ, న్యాయమూర్తి తల్లిదండ్రులు -
కాళేశ్వరంతో వేలాది ఎకరాలకు సాగునీరు : వేముల వీరేశం
సాక్షి, రామన్నపేట : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం తెలిపారు. బుధవారం రామన్నపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజల మనసును చూరగొన్న కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు, ఆసరా పెన్షన్ల రెట్టింపు, నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే చెరువులను నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగుల వెంకటరాజిరెడ్డి, నాయకులు పూస బాలకిషన్, ముక్కాముల దుర్గయ్య, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, అంతటి రమేష్, ఆకవరపు మధుబాబు, గుత్తా నర్సిరెడ్డి, రామిని రమేష్, సాల్వేరు లింగయ్య, మినుముల వెంకటరాజయ్య, ఎండీ నాజర్, చల్లా వెంకట్‌రెడ్డి, పోచబోయిన మల్లేశం పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
‘సబ్‌రిజిస్ట్రార్’ను తరలించొద్దు
రామన్నపేట నల్గొండ : ఆరు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న రామన్నపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించవద్దని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రం లో ఆందోళన నిర్వహించారు.సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాన్ని మరోప్రాంతానికి తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అఖిలపక్ష నాయకులు, డాక్యుమెంట్ రైటర్లు అథిదిగృహం ఆవరణలో సమావేశమై చిట్యాల–భువనగిరి ప్రధాన రహదా రిపై రాస్తారోకోకు దిగారు.సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించవద్దని, అధికారుల నిర్ల్యక్షం న శించాలని పెద్దఎత్తున నినదించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రారంభంలో రామన్నపేట, మోత్కూరు తాలుకా లోని 15కు మండలాల ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలందించడం జరిగిందని, కార్యాలయంను నమ్ముకొని డాక్యుమెంట్ రైటర్లు, వారి సిబ్బంది, హోట ల్, జనరల్‌స్టోర్ నిర్వాహకుల వంటి 100కు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.రామన్నపేట, వలిగొండ మండలాల్లోని 50కిపైగా గ్రా మాల రైతులకు, భూక్రయ విక్రయదారులకు ప్ర యోజనకరంగా ఉండేటటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని, 100 కుటుంబాల ఉపాధిని దెబ్బతీసి ఇతర జిల్లాలకు తరలించాలనే అనాలోచిత నిర్ణయాన్ని మానుకోవాలని, రామన్నపేటప్రాంత ప్ర జల మనోభావాలను గౌరవించాలని కోరారు. కా ర్యాలయాన్ని తరలిస్తే ఊరుకోబోమని, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని, తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో అవసరమైతే పాలనను స్తంభింపజేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత అఖిలపక్షం ఆందోళనకు మద్దతుగా ప్రధాన రహదారిపై గల దుకాణాలను యజమానులు స్వచ్ఛం దంగా మూసివేసి సంఘీభావం ప్రకటించారు. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్‌వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వనం చంద్రశేఖర్, కన్నెకంటి వెంకటేశ్వరాచారి, జెల్లెల పెంటయ్య, ఊట్కూరి నర్సింహ, నీల యాదయ్య, సిందం లింగయ్య, శివరాత్రి సమ్మయ్య, ఏనూతుల రమేష్, ఆముద సాయి, రాజశేఖర్, ఆమేర్, జమీరుద్దిన్, మిర్యాల మల్లేశం, బల్గూరి అంజయ్య, వెంకటేశ్వరాచారి, రేఖ సత్తయ్య, పల్లపు రవి, ఎండీ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
రామన్నపేట అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషిచేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శిం చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలానిన సందర్శించి ప్రభుత్వపథకాల అమలుతీరును సమీక్షించనున్నట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత, అధికారులు అంకితభావంతో పనిచేసేవిధంగా జిల్లాను ముందుకు తీసుకువెళ్లనున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్నిప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేవిధంగా అధికారులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రామన్నపేటలోని ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దనే ప్రజల మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. బహిరంగ మలవిసర్జన లేని మండలంగా తీర్చిదిద్దాలి వచ్చేఏడాది మార్చి31 నాటికి రామన్నపేటను బహిరంగ మలవిసర్జనలేని మండలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వపథకాలపై వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హరితహారం, స్వచ్ఛభారత్, ఉపాధిహామీపథకం, మిషన్‌కాకతీయ,భగీరథ పథకాల అమలుతీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్యపై ఆరా తీశారు. పలు విషయాలను ఎంపీడీఓ వారికి వివరించారు. ప్రభుత్వస్థలాలలో, కాలువలు, చెరువులగట్లపై మొక్కలునాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో నిధులులేక అసంపూర్తిగాఉన్న పాఠశాల, అంగన్వాడీ భవనాల వివరాలు, వంటగదులు అవసరమైన పాఠశాలలను తనకు తెలియజేస్తే నిధులు విడుదల చేయిస్తాని చెప్పారు. మండలంలోని పీఆర్రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలస్థితిపై నివేదిక పంపించాలని ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిని తనిఖీచేసిన కలెక్టర్ అనంతరం కలెక్టర్ అనితారామచంద్రన్ మండలకేంద్రంలోని ఏరియాఆసుపత్రిని తనిఖీచేశారు. చిల్డ్రన్కేర్యూనిట్, ప్రసూతిగది, జనరల్‌వార్డు, ప్రసూతివార్డు, పీపీయూనిట్ను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు, సమస్యలపై ఆరా తీశారు. కలెక్టర్ సందర్శన సమయంలోనే రోగుల సహాయకులు భోజనాలు చేస్తున్న చోటనే పందులు తిరుగడం చూసి విస్మయానికి గురయ్యారు. ఆస్పత్రిలోని సమస్యలను ఆరోగ్యశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. ఆమెవెంట చౌటుప్పల్ ఆర్డీఓ ఆర్. మహేందర్‌రెడ్డి, ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, తహసిల్దార్ ఎ.ప్రమోదిని, ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, మండలవిద్యాధికారి ఎస్.దుర్గయ్య, ఏఈ ప్రశాంత్, డీటీ జె.ఎల్లేశం, ఆర్ఐ డి.జానయ్య, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సిద్దార్ద, సుజాత, సర్పంచ్‌లు నకిరేకంటి మొగులయ్య, గెగ్గెలపల్లి యాదగిరిరెడ్డిలు ఉన్నారు. -
రామన్నపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
రామన్నపేట : అభివృద్ధిలో సమతుల్యను పాటించడానికి ప్రభుత్వం రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్లేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు నియోజకవర్గ, తాలుకా కేంద్రాలుగా విరజిల్లిన రామన్నపేటను పాలకులు వెనుకబాటుకు గురి చేశారని ఆరోపించారు. రామన్నపేట, చౌటుప్పల్, వలిగొండ, మోత్కూరు, వలిగొండ తదితర మండలాలను కలుపుతూ రామన్నపేట కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. దాదాపు అన్నిశాఖలకు సంబంధించిన సబ్ డివిజన్ కార్యాలయాలు రామన్నపేటలో పని చేస్తున్నాయన్నారు. అందుకే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే రామన్నపేట అన్ని విధాలా అభివృద్ధే అవకాశం ఉంటుందన్నారు. గంటపాటు నిర్వహించిన రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీయూవీ నాయకులు ఊట్కూరి నర్సింహ, ఆకవరపు మధుబాబు,గర్దాసు సురేష్, సాల్వేరు అశోక్, కందుల హన్మంత్, ఎస్కే చాంద్, బీకే మూర్తి, జెల్ల వెంకటేశం, వనం చంద్రశేఖర్, నీల ఐలయ్య, గంగాపురం యాదయ్య, కొమ్ము యాదయ్య, బొడ్డు అల్లయ్య, పోతరాజు శంకరయ్య, వనం భిక్షపతి, శివరాత్రి సమ్మయ్య, పాల్వంచ శంకర్, నక్క యాదయ్య, ఎండీ జమీరుద్దిన్, దండుగల సమ్మయ్య, పబ్బతి లింగయ్య, ఎండీ గౌస్, కూనూరు సుధాకర్, సుదర్శన్, మహాలింగం, సహదేవ్, తోటకూరి అంజయ్య, దండుగల సమ్మయ్య పాల్గొన్నారు. -
రుణాలను రెన్యువల్ చేసుకోవాలి
రామన్నపేట : రైతులు తాము తీసుకున్న పంట రుణాలను నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేసుకుంటేనే వడ్డీమాఫీ వర్తిస్తుందని నాబార్డు ఏజీఎం దయామృత స్పష్టంచేశారు. నాబార్డు సహకారంతో మిత్రఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రామన్నపేటలో ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత ప్రచార సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరిపంటకు గ్రామం యూనిట్‌గా ఫసల్‌బీమా యోజన పథకం కింద బీమా వర్తిస్తుందని చెప్పారు. నాబార్డుద్వారా ఆవు, గేదెలు, జీవాలు కొనుగోలు చేసే ఎస్సీలకు 50శాతం సబ్సిడీ, బీసీలకు 30శాతం సబ్సిడీని అందిస్తుందని వివరించారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతీపౌరుడు బ్యాంకుఖాతాలను కలిగి ఉండాలన్నారు. మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థిక అక్షరాస్యత ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ అనుముల బ్రహ్మచారి, భానుప్రకాష్, ఆదర్శరైతులు పిశాటి సత్తిరెడ్డి, ఎస్. రమేష్, లతాశ్రీధర్, ప్రోగ్రాంఆఫీసర్ బి.ఆంజనేయులు, కోఆర్డినేటర్ వి.భరత్, రైతుక్లబ్‌సభ్యులు సిందం లింగయ్య, మోటె లింగస్వామి, బండ లింగస్వామి, గొరిగె బీరప్ప, కళాబృందంసభ్యులు వెంకటచారి, ఆంజనేయులు, క్రిష్ణ, శ్రీను, వేణు పాల్గొన్నారు. -
చేనేతను విస్మరించడం సరికాదు
సిరిపురం (రామన్నపేట) : చేనేత పరిశ్రమను, కార్మికులను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ చేనేత వ్యతిరేక విధానాలను అవలంబించడం ప్రభుత్వానికి సరికాదని చేనేతసహకారసంఘాల అసోసియేషన్ జిల్లాఅధ్యక్షుడు అప్పం రామేశ్వం కోరారు. చేనేతlపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 22న నల్లగొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు సంబంధించిన కరపత్రాను బుధవారం మండలంలోని సిరిపురంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 2014 ఎన్నిక మేనిఫెస్టోలో ప్రభ్వుం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుచేయలేదని ఆరోపించారు. పనికి తగిన ఆదాయం లభించక ఇప్పటివరకు 46మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతను పరిశ్రమలశాఖలో విలీనంచేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు రాపోలు లక్ష్మమ్మ, జెల్ల లక్ష్మినారాయణ, ఏలె నర్సింహ, కొంగరి విఠలయ్య, గుండు బాలరాజు, రాపోలు పాపయ్య, రాపోలు రమేష్, సంగిశెట్టి వెంకటమ్మ, మిర్యాల రామలింగం, రాపోలు విశ్వనాథం, కొంగరి నర్సింహ, జెల్ల శ్రీనాదం, బడుగు రమేష్‌లు ఉన్నారు. -
బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
శోభనాద్రిపురం (రామన్నపేట) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రప్రభుత్వం కొత్తజిల్లాలను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని శోభనాద్రిపురంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రూ. 5లక్షల ఎంపీల్యాడ్స్ నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీహాలు నిర్మాణానికి శంకుస్థాపనచేసి, సీడీపీ నిధులతో వేసిన బోరుమోటారును ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ సొసైటీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ప్రకారమే తెలంగాణరాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. కంచి ముత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దళితసేన రాష్ట్ర అధ్యక్షుడు జేబీ.రాజు, ఎస్సీ వెల్పేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీఆర్ మల్లేష్‌కుమార్, ఎంపీపీలు కక్కిరేణి ఎల్లమ్మ, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ బొడిగె చంద్రకళ, నార్మాక్స్డైరెక్టర్ గంగుల కృష్ణారెడ్డి, ముక్కాముల దుర్గయ్య, కంచి శంకరయ్య, విగ్రహదాత గౌరీకృష్ణ, శిల్పి బోదాసు వెంకటరమణ, బందెల రాములు, ఆహ్వాన కమిటీసభ్యులు కంచి మల్లేశం, కంచి యాదయ్య, మధుసూదన్, రాములు, శంకర్, రమేష్, సురేష్, దశరథ, స్వామి, మధు, సుమన్, పొడిచేటి ఎల్లప్ప, సుమన్, ప్రవీన్, సురేందర్ పాల్గొన్నారు. -
మహిళ బలవన్మరణం
రామన్నపేట : అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..శోభనాద్రిపురం గ్రామానికి చెందిన బొడిగె అండాలు(55) తన భర్త ఆంజనేయులుతో కలిసి రేండేళ్లుగా రామన్నపేటలో నివాసం ఉంటుంది. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. మానసికంగా బాగా కుంగిపోయింది. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవగ్రాయాలపాలయిన అండాలు ఇంట్లోనే మృతి చెందింది. భర్త ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎస్ఐ పైడినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
రామన్నపేట : ప్రభుత్వవైఫల్యం వల్లనే ధర్మారెడ్డిపల్లికాలువ ద్వారా రైతులకు సాగునీరు అందడంలేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆదివారం రామన్నపేట, చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలకు చెందిన పార్టీనాయకులు, రైతులతో కలిసి ధర్మారెడ్డిపల్లి కాలువవెంట ఆయన పర్యటించారు. గోకారం చెరువువద్ద తలుపులకు తట్టినచెత్తను, తూముకు అడ్డంగాపడిన రేకును తొలగించారు. ధర్మారెడ్డిపల్లి కత్వవద్ద నీటిప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం రామన్నపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు మండలాలకు సాగునీరుఅందించే ధర్మారెడ్డిపల్లి కాలువకు నీటిని తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఆయనవెంట జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, చిట్యాల మండలకాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, మాజీఎంపీపీ నీల దయాకర్, వైస్‌ఎంపీపీ బద్దుల ఉమారమేష్, సర్పంచ్ బొక్క భూపాల్‌రెడ్డి, జిట్ట బొందయ్య, జడల ఆదిమల్లయ్య, బండమీది స్వామి, మీర్జా బషీర్‌బేగ్, బొడ్డు అల్లయ్య, కన్నెబోయిన సైదులుయాదవ్, ఏళ్ల వెంకట్ రెడ్డి, కట్టంగూరి మల్లేశం, ఎండీ.జమీరుద్దిన్, దొమ్మాటి లింగారెడ్డి, బండ అంజిరెడ్డి, లింగస్వామి, సతీష్, సైదులు ఉన్నారు. -
కేసీఆర్ పాలనతో లాభం లేదు
రామన్నపేట : త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీమాంద్ర నాయకుల్లా పరిపాలన చేస్తే సహించేదిలేద సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి తెలిపారు. శనివారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23 నెలల కేసీఆర్ పాలనతో ప్రజలకు ఒరిగిందేమిలేదని అన్నారు. వేల కోట్ల నిధులతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో తెలంగాణ కాంట్రాక్టర్లకు అవకాశమివ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 2013 భసేకరణ చట్టం ప్రకారం డిండీ, బస్వాపురం, సింగరాజుపల్లి, ప్రాణహిత–చేవెళ్ల భూనిర్వాసితులకు పరిహారం, పునరావసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండేసోయి మరచి, పెట్టుబడిదారుల క్షేత్రంగా పనిచేస్తుందని ఆరోపించారు. బీజేపీ తిరంగా యాత్ర పేరుతో సాయుధపోరాట నేపథ్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈనెల 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ ∙పోరాట వారోత్సవాల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నుట్ల తెలిపారు. 17న హైదారాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముగింపు సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లొడంగి శ్రవణ్‌కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నెల్లికంటి సత్యం, ఊట్కూరి నర్సింహ, గంగాపురం యాదయ్య ఉన్నారు. -
విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
తుర్కపల్లి (రామన్నపేట) : మండలంలోని సూరారం గ్రామపంచాయతీ ఆవాసగ్రామాల్లో రెండునెలల్లోగా ఇంటింటికీ మిషన్‌భగీరథ పథకం కింద కృష్ణాజలాలు అందిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆదివారం సూరారం పరిధిలోని బి.తుర్కపల్లి ప్రాథమికపాఠశాల విద్యార్థులకు అరుంధతీ మేధావుల సంఘంవారు సమకూర్చిన నోట్‌పుస్తకాలను పంపిణీచేసి మాట్లాడారు. ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు, స్వచ్ఛందసంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, ఎంపీటీసీ చల్లా వెంకట్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బొక్క పురుషోత్తంరెడ్డి, అరుంధతీ సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి నరహరి, కార్యదర్శి ఎన్.కృష్ణ, కోశాధికారి బి.చంద్రకాంత్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ బి.సుదర్శన్, జినుకల ప్రభాకర్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
రామన్నపేటను డివిజన్ కేంద్రంగా మార్చాలి
రామన్నపేట పాత అసెంబ్లీ నియోజకవర ్గకేంద్రమైన రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రామన్నపేట మండలం నూతనంగా ఏర్పడే యాదాద్రి జిల్లాలో కలుస్తుందని, జిల్లాకు చివర నుండే రామన్నపేట భవిష్యత్తులో ఇంకా వెనుకబడే అవకాశం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచనాదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. మునిపంపుల వైద్యాధికారి, సిబ్బంది çసక్రమంగా విధులకు హాజరుకావడం లేదని జెడ్పీటీసీ జినుకల వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతం కావడంవల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని వైద్యాధికారి బదులివ్వడంతో ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి జోక్యంచేసుకొని మండలకేంద్రానికి 7కిలోమీటర్ల దూరంలో ఉన్న మునిపంపుల మారుమూల ప్రాంతం ఎలా అవుతుందని, అలాంటప్పుడు ఉద్యోగాలు మానుకోవాలని తీవ్రంగా స్పందించారు. రెవెన్యూ శాఖ పనితీరును వివరించేందుకు డీటీ జె.ఎల్లేశం వేదికవద్దకు రాగా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూశాఖ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు : ఎమ్మెల్యే భువనగిరి డివిజన్లోని నాలుగు సాగునీటి కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మత్తులు చేయడం జరుగుతుందని చెప్పారు. మూడవవిడత మిషన్కాకతీయపనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఏరియా ఆసుపత్రిలో విధులపట్ల నిర్లక్ష్యం వహించే డాక్టర్లు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, వైస్‌ఎంపీపీ బద్దుల ఉమారమేష్, సభ్యులు ఆకవరపు మధుబాబు, పున్న వెంకటేశం, కూరెళ్ల నర్సింహాచారి, చల్లా వెంకట్‌రెడ్డి బండమీది సరిత, ఊట్కూరి శోభ, సాల్వేరు రోజ, బండ పద్మ, మేకల భద్రమ్మ, మంటి సరోజ, వెలిజాల లక్ష్మమ్మలతోపాటు, వివిధగ్రామాల సర్పంచ్‌లు, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. -
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
రామన్నపేట: నిద్రమత్తులో రైలు నుంచిlజారిపడి యువకుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం రాత్రి రామన్నపేట శివారులో జరిగింది. నల్లగొండ బస్టాండ్ సమీపంలోని సంతోష్‌నగర్‌కు చెందిన సురిగి అజయ్‌కుమార్(38) బీబీనగర్‌లోని ఎంఎస్ కంపనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజు ట్రైన్‌పాస్ ద్వారా వచ్చిపోతున్నాడు. సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకొని నల్లగొండకు బయలుదేరాడు. రామన్నపేట శివారులో ఐడియల్ కంపనీ దగ్గర రైలు నుంచిlకిందపడ్డాడు. తీవ్రగాయాలు పాలైన అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. డెమోరైలులోగానీ, డెల్లాప్యాసింజర్లోగానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి ఉండవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. కీమెన్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య మేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
రామన్నపేట: పాముకాటుకు గురై 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని కక్కిరేణి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన యాదయ్య, మంగమ్మ దంపతులది వ్యవసాయాధారిత కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్నకూతురైన కన్నెబోయిన దివ్య(8) ఆదివారం రాత్రి 8గంటల సమయంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటివద్ద ఆడుకుంటుండగా ఏదో విషపురుగు కరిచింది. కాటుకు గురైన దివ్య బాధతో అరవగా కుటుంబ సభ్యులు గమనించి దీపం వెలిగించి చూస్తుండగానే పాపనోటి నుండి నురగలు కారుస్తూ కింద పడిపోయింది. చికిత్స నిమిత్తం బైక్‌మీద రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రథమచికిత్స అనంతరం పాపపరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బాలిక అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. -
పాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాల ఏర్పాటు
రామన్నపేట : రాజకీయ ప్రయోజనాలకు తావులేకుండా ప్రజల సౌకర్యార్థం, పాలన సౌలభ్యం కోసమే కొత్తజిల్లాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. ఆదివారం రామన్నపేటలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్టీ జిల్లాఅధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 17కొత్తవాటితోపాటు, మొత్తం 27జిల్లాల ఏర్పాటు దాదాపు ఖరారయినట్లేనని వివరించారు. అఖిలపక్షభేటీ జిల్లాకు సంబంధించిన విషయంలో ఏకాభిప్రాయానికి రావడం సంతోషకర విషయమన్నారు. చిట్యాల–భువనగిరి, వలిగొండ–భద్రాచలం(వయా తిర్మలగిరి, మహబూబాబాద్)రోడ్లను నాలుగులేన్లుగా విస్తరించి జాతీయ రహదారులుగా గుర్తించాలని ముఖ్యమంత్రిద్వారా కేంద్రమంత్రి గట్కరీకి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రామన్నపేట నియోజకవర్గం తిరిగి పునరుద్ధరించబడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ మాద యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బందెల రాములు, కాల్య శ్రవణ్‌కుమార్, గంగుల వెంకటరాజిరెడ్డి, బాల్తు నాగయ్య, బొడ్డుపల్లి లింగయ్య, బండ దామోదర్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ.నాజర్, అక్రం, మోటె రమేష్, బండ లింగస్వామి ఉన్నారు. -
నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డు
రామన్నపేట: గ్రామాల్లో పారిశుద్ధ్యంను మెరుగుపరిచే విషయంలో పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి కరువయింది. ఉపయోగించేవారు లేక లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్‌యార్డులు నిరుపయోగంగా మారాయి. రామన్నపేట మండలంలో 20గ్రామపంచాయతీలున్నాఇయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీపథకం కింద 17గ్రామాల్లో డంపింగ్‌యార్డులను తవ్వడం ప్రారంభించారు. స్థలాభావంవల్ల నిధానపల్లి, ఇస్కిళ్ల, సిరిపురంగ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. 10మీటర్ల వెడల్పు, 15మీటర్ల పొడవు, 2మీటర్లలోతు ఉండేవిధంగా 550 పనిదినాలు, రూ. 1.48లక్షల అంచనావ్యయంతో డంపింగ్‌యార్డ్‌లను తవ్వడం ప్రారంభించారు. వీటిలో బోగారం, దుబ్బాక, జనంపల్లి, కుంకుడుపాముల, లక్ష్మాపురం, మునిపంపుల, రామన్నపేట, సూరారం, ఇంద్రపాలనగరం, ఉత్తటూరు, వెల్లంకి, ఎన్నారం గ్రామాల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పల్లివాడ, నీర్నెముల, కక్కిరేణి గ్రామాల్లో వివిధ కారణాలవల్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గేదెనుకొని తాడుకు భయపడ్డ చందంగా ప్రభుత్వం లక్షలు వెచ్చించి డంపింగ్‌యార్డులను తవ్వి, వేలుపెట్టి చెత్త బండ్లను సమకూర్చలేక పోయింది. కూడిపోతున్న డంపింగ్‌యార్డులు పారిశుద్ధ్య కార్మికులు గ్రామాల్లోని మురుగుకాలువలు, వీధుల్లో తీసిన చెత్తను ట్రాక్టర్లు, తోపుడుబండ ్లద్వారా డంపింగ్‌యార్డులకు చేరవేయవలసి ఉంటుంది. డంపింగ్ యార్డులను తవ్వే సమయంలోనే గ్రామీణ నీటిసరఫరా పారిశుద్ధ్య విభాగంవారు చెత్తను రవాణా చేయుటకు అవసరమైన బండ్లను సమకూర్చుటకు అవసరమైన రిక్వైర్మెంట్ను కూడా తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఏఒక్కగ్రామానికి బండ్లను అందజేయలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు తీసిన చెత్తను జనావాసాలకు దగ్గరల్లో పడవేస్తున్నారు. అక్కడ పందులు సంచిరిస్తూ జుగుత్సాకరమైన వాతావరణంను సృష్టిస్తున్నాయి. లక్షలువెచ్చించి తవ్విన డంపింగ్‌యార్డులలో పక్కనున్న మట్టిజారి కూడిపోతున్నాయి. కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి....నక్క రామనర్సయ్య,జనంపల్లి వీధులు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సర్కారువాళ్లు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీధుల్లో పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ప్రజలు కూడా తమ ఇంటి మాదిరిగానే వీధులను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తబండ్లను సమకూర్చాలి.....దేశపాక లక్ష్మినర్సు సర్పంచ్ ఎన్నారం ప్రభుత్వం డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేసింది కానీ చెత్త బండ్లను ఇవ్వడం మరిచింది. గ్రామాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డులకు చేరవేయాలనేది మంచి ఆలోచన. ప్రభుత్వం ఆలోచనకు తగ్గట్లు చెత్తను చేరవేయడానికి తోపుడు బండ్లను సమకూర్చాలి. -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు
రామన్నపేట అధికారపార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఒక్కసారిగా భయటపడ్డాయి. ఓ వర్గం వారు ఏకంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సమీప బంధువు ఇంటిపైనే దాడికి తెగబడ్డారు. ఆరుగురిని గాయపపరచడమే కాకుండా ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. రామన్నపేట మండల పరిధి ఇంద్రపాలనగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మందడి విద్యాసాగర్‌రెడ్డి మంత్రి జగదీశరెడ్డికి సమీప బంధువు. ఇదే గ్రామానికి చెందిన తెలంగాణ బెస్త సేవా సంఘం అధ్యక్షుడు పూస బాలకిషన్‌కు మందడి విద్యాసాగర్‌రెడ్డికి కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. బోనాల పండుగలో.. ఇంద్రపాలనగరానికి చెందిన బెస్తకులస్తులు ఆదివారం బోనాల పండుగ వైభవంగా జరుపుకున్నారు. బోనాల ఊరేగింపు క్రమంలో సర్పంచ్ పూస నర్సింహను అవమనించడానే నెపంతో బోనగిరి శ్రీనుపై దాడిచేశారు. దీంతో శ్రీను అఖిలపక్షం నాయకులను వెంట తీసుకుని చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికే సర్పంచ్ కుమారుడు పూస బాలకిషన్ తన అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. బోనగిరి శ్రీను అనే వ్యక్తి తన తండ్రిని అవమానపరిచాడని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్టేషన్‌లోపల, బయట వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పంపించారు. రాత్రి సమయంలో.. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో పూస బాలకిషన్‌తో పాటు అతని వర్గానికి చెందిన సుమారు 30మంది బైక్‌లపై మందడి విద్యాసాగర్‌రెడ్డి ఇంటికివెళ్లి గేటును గుద్దారు.అప్రమత్తమైన మందడి విద్యాసాగర్‌రెడ్డి కుటుంబసభ్యులు, అతని బం«ధువులు లోపలికిరాకుండా గేటును అదిమిపట్టి ప్రతిఘటించారు. బాలకిషన్‌తో పాటు అతని అనుచరులు ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న సాగర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి.సిద్ధార్థరెడ్డి, వారి బంధువులు బేతి మదన్‌మోహన్‌రెడ్డి, శోభ, మంత్రి వ్యక్తి గత కార్యదర్శి సోదరుడు జయచందర్రెడ్డిపై అక్కడ దొరికిన పొయ్యిలకట్టెలు, ఇనుపరాడ్, కంకరరాళ్లతో దాడిచేసి గాయపరిచారు. ప్రాణభయంతో వారంతా ఇంట్లోకివెళ్లి దాచుకున్నారు. దీంతో కాంపౌండ్‌లో ఉన్న మంత్రి బంధువుల ఇన్నోవా, ఐ ట్వంటీకార్లను, ఇంటికిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి అక్కాబావలు ఇతర బంధువులు అక్కడే ఉన్నారు. తోపులాటలో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు, 100కాల్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. రామచంద్రారెడ్డి మంత్రికి ఫోన్ ద్వారా విషయం తెలియజేశాడు. స్థానిక సీఐ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐ ప్యారసాని శీనయ్య తన బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. జనాన్ని చెదరగొట్టి గాయపడిన వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శ్రీధర్‌రెడ్డి, సిద్ధార్థరెడ్డి, జయచందర్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, శోభలను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి జరిగిన ఇంటిపరిసరాలు, వస్త్రాలు రక్తపు మరకలతో నిండిపోయాయి. ఇంద్రపాలనగరాన్ని సందర్శించిన ఎస్పీ విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాష్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ సుధాకర్ ఆదివారం అర్ధరాత్రి ఇంద్రపాలనగరం గ్రామాన్ని సందర్శించారు. సంఘటన జరిగిన ఇంటివద్దకు వెళ్లి దాyì జరిగిన తీరును బాధితులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని గ్రామస్తులకు హామీఇచ్చారు. దాడికి పాల్పడిన 28మందిపై కేసు మంత్రిబంధువు ఇంటిపై దాడి చేసి గాయపరచిన కేసులో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పూస బాలకిషన్, మండల ప్రధానకార్యదర్శి పెద్దగోని వెంకటేశంతో కలిపి 28మందిపై కేసునమోదు చేసినట్లు సీఐ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నిందితులలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్నిపక్షాలవారు సహకరించాలని కోరారు. చట్టంను ధిక్కరించి, శాంతిభద్రతలకు భంగం కలిగేవిధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. భారీ పోలీస్ బందోబస్తు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఆదేశానుసారం డీఎస్పీ సుధాకర్, స్థానిక సీఐ మామిళ్ల శ్రీధర్‌రెడ్డిల పర్యవేక్షణలో గ్రామంలో పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువు, సర్పంచ్ ఇంటివద్ద ప్రత్యేక బలగాలను మెుహరించారు. సుమారు 100మంది పోలీసులను నియమించారు. చౌటుప్పల్, యాదగిరిగుట్ట సీఐలు నవీన్‌కుమార్, రఘువీరారెడ్డి, సర్కిల్ఎస్సైలు ప్యారసాని శీనయ్య, వెంకటేశ్వర్లు, శివనాగప్రసాద్, రవి, ఏఎస్ఐ సంత్సింగ్లు ఆధ్వర్యంలో గ్రామంలో పికెటింగ్ కొనసాగుతోంది. -
ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
కక్కిరేణి(రామన్నపేట) : కక్కిరేణి గ్రామ శివారులో తెలంగాణ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ రాకుండా చూస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గురువారం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన విజ్ఙప్తి మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు జోక్యం చేసుకొని ఈనెల 5న జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసినట్లు చెప్పారు. ప్రజలు పనులు మాని ఆందోళనలు చేయవలసిన అవసరంలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ కమీషన్ల కోసం కంపనీల గురించి తెలుసుకోకుండా అడ్డగోలుగా భూములు కొనుగోలు చేయించడం మానుకోవాలని హెచ్చరించారు. రాంఖీసంస్థకు భూములు అమ్మిన రైతులు వాటిని దున్నుకోవాలని, బయానాలు తీసుకున్న వాళ్లు రిజిస్ట్రేషన్లు చేయకూడదని చెప్పారు. పోలీసులు ఇబ్బందులు పెడితే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను తెలంగాణ ప్రభుత్వం చేయదని వివరించారు. కక్కిరేణి గ్రామప్రజలకు అండగా ఉండేందుకు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుకోసం తక్షణమే తనకోటానుంచి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ దువ్వాసి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జెడ్పీటీసీ శేపూరి రవీందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గంగుల రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బందెల రాములు, నాయకులు పూజర్ల శంభయ్య, జినుకల ప్రభాకర్, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, బత్తుల క్రిష్ణగౌడ్, వెలిజాల నర్సింహ, వేముల సైదులు, రాంబాబు పాల్గొన్నారు. -
వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఆపాలి
కక్కిరేణి(రామన్నపేట) ప్రజల ప్రాణాలను హరించే అవకాశం ఉన్న తెలంగాణవేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే ఆపాలని మాజీఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. బుధవారం మండలంలోని కక్కిరేణి గ్రామంలో వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, శ్మశానాలలోని చెత్తను రోజుకు 490 లారీలలో కక్కిరేణికి తరలించి ఇక్కడ పాతిపెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మూసీకాలుష్యం, ఫ్లోరిన్రక్కసితో బాధపడుతున్న ప్రజలపై మూలిగేనక్కపై తాడిపండుపడ్డ చందంగా వ్యర్థ పదార్థాల శుద్ధి, నిల్వచేసే ఆలోచనరావడం దుర్మార్గమని అన్నారు. జిల్లాకు చెందిన అధికారపార్టీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంపై ఒత్తిడితెచ్చి ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కంపెనీ ప్రలోభాలకు లొంగితే భవిష్యత్ తరాలు క్షమించవని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి చేసే కుట్రలను తిప్పికొటాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా మొండిగా ప్రాజెక్టును కడితే బాంబులతో పేల్చడానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. బతకాలంటే పోరాడాల్సిందే : వామపక్ష పార్టీల నాయకులు కక్కిరేణితోపాటు, నియోజకవర్గంలోని సుమారు యాబై గ్రామాల ప్రజలు బతకాలంటే వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడాల్సిందేనని సీపీఎం, సీపీఐ జిల్లాకమిటీ సభ్యులు మామిడి సర్వయ్య, లొడంగి శ్రవన్కుమార్లు తెలిపారు. పోలీసుల లాఠీలకు, తూటాలకు భయపడేదిలేదని చెప్పారు. సర్పంచ్ దువ్వాసి పార్వతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, వివిధపార్టీలు, మండలాలకు చెందిన నాయకులు సోమనబోయిన సుధాకర్‌యాదవ్, పిట్ట కుశలవరెడ్డి, పిట్ట జగనోహన్రెడ్డి, నీల దయాకర్, గంగుల వెంకటరాజిరెడ్డి, వేముల సైదులు, వెలిజాల నర్సింహ, బొక్క భూపాల్‌రెడ్డి, ఉండ్ర లింగారెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, చింతపల్లి బయ్యన్న, ఎస్ఆర్ వెంకటేశ్వర్లు, అవిశెట్టి శంకరయ్య, గాలి నర్సింహ, చిరుమర్తి యాదయ్య, పిట్ట రాఘవరెడ్డి, విజయలక్ష్మి, బద్దుల రవి, జిట్ట నాగేష్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.