రుణాలను రెన్యువల్ చేసుకోవాలి
రుణాలను రెన్యువల్ చేసుకోవాలి
Published Fri, Sep 30 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
రామన్నపేట : రైతులు తాము తీసుకున్న పంట రుణాలను నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేసుకుంటేనే వడ్డీమాఫీ వర్తిస్తుందని నాబార్డు ఏజీఎం దయామృత స్పష్టంచేశారు. నాబార్డు సహకారంతో మిత్రఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రామన్నపేటలో ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత ప్రచార సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరిపంటకు గ్రామం యూనిట్‌గా ఫసల్‌బీమా యోజన పథకం కింద బీమా వర్తిస్తుందని చెప్పారు. నాబార్డుద్వారా ఆవు, గేదెలు, జీవాలు కొనుగోలు చేసే ఎస్సీలకు 50శాతం సబ్సిడీ, బీసీలకు 30శాతం సబ్సిడీని అందిస్తుందని వివరించారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతీపౌరుడు బ్యాంకుఖాతాలను కలిగి ఉండాలన్నారు. మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థిక అక్షరాస్యత ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ అనుముల బ్రహ్మచారి, భానుప్రకాష్, ఆదర్శరైతులు పిశాటి సత్తిరెడ్డి, ఎస్. రమేష్, లతాశ్రీధర్, ప్రోగ్రాంఆఫీసర్ బి.ఆంజనేయులు, కోఆర్డినేటర్ వి.భరత్, రైతుక్లబ్‌సభ్యులు సిందం లింగయ్య, మోటె లింగస్వామి, బండ లింగస్వామి, గొరిగె బీరప్ప, కళాబృందంసభ్యులు వెంకటచారి, ఆంజనేయులు, క్రిష్ణ, శ్రీను, వేణు పాల్గొన్నారు.
Advertisement
Advertisement