రామన్నపేటలో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నాయకులు
రామన్నపేట నల్గొండ : ఆరు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న రామన్నపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించవద్దని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రం లో ఆందోళన నిర్వహించారు.సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాన్ని మరోప్రాంతానికి తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అఖిలపక్ష నాయకులు, డాక్యుమెంట్ రైటర్లు అథిదిగృహం ఆవరణలో సమావేశమై చిట్యాల–భువనగిరి ప్రధాన రహదా రిపై రాస్తారోకోకు దిగారు.సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించవద్దని, అధికారుల నిర్ల్యక్షం న శించాలని పెద్దఎత్తున నినదించారు.
ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రారంభంలో రామన్నపేట, మోత్కూరు తాలుకా లోని 15కు మండలాల ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలందించడం జరిగిందని, కార్యాలయంను నమ్ముకొని డాక్యుమెంట్ రైటర్లు, వారి సిబ్బంది, హోట ల్, జనరల్‌స్టోర్ నిర్వాహకుల వంటి 100కు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.రామన్నపేట, వలిగొండ మండలాల్లోని 50కిపైగా గ్రా మాల రైతులకు, భూక్రయ విక్రయదారులకు ప్ర యోజనకరంగా ఉండేటటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని, 100 కుటుంబాల ఉపాధిని దెబ్బతీసి ఇతర జిల్లాలకు తరలించాలనే అనాలోచిత నిర్ణయాన్ని మానుకోవాలని, రామన్నపేటప్రాంత ప్ర జల మనోభావాలను గౌరవించాలని కోరారు.
కా ర్యాలయాన్ని తరలిస్తే ఊరుకోబోమని, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని, తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో అవసరమైతే పాలనను స్తంభింపజేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత
అఖిలపక్షం ఆందోళనకు మద్దతుగా ప్రధాన రహదారిపై గల దుకాణాలను యజమానులు స్వచ్ఛం దంగా మూసివేసి సంఘీభావం ప్రకటించారు. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్‌వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్‌లు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వనం చంద్రశేఖర్, కన్నెకంటి వెంకటేశ్వరాచారి, జెల్లెల పెంటయ్య, ఊట్కూరి నర్సింహ, నీల యాదయ్య, సిందం లింగయ్య, శివరాత్రి సమ్మయ్య, ఏనూతుల రమేష్, ఆముద సాయి, రాజశేఖర్, ఆమేర్, జమీరుద్దిన్, మిర్యాల మల్లేశం, బల్గూరి అంజయ్య, వెంకటేశ్వరాచారి, రేఖ సత్తయ్య, పల్లపు రవి, ఎండీ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment