సీఎస్‌ఆర్ నిధులతో శాశ్వత భవనాలు, పునర్వ్యవస్థీకరణ
తొలిదశలో 4 జిల్లాల్లో నిర్మాణం... గచ్చిబౌలిలో మోడల్ ఆఫీస్
సేవ, వసతులే ప్రధానాంశాలుగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వారికి అవసరమైన వసతులు కల్పించడమే ధ్యేయంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్య కలాపాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
ప్రజలు చెట్ల కింద నిరీక్షించే పరి స్థితిని నివారించేలా ప్రస్తుతమున్న సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) నిధులతో అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి మంగళ వారం ఆయన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు.
తొలుత పటాన్‌చెరు, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఫోర్త్‌సిటీలో నిర్మాణం
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాల కోసం స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశలవారీగా ఈ నిర్మా ణాలు ఉంటాయని, తొలిదశలో పటాన్‌చెరు, సంగా రెడ్డి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీ లో నిర్మి స్తామని చెప్పారు.
గండిపేట, శేరిలింగంపల్లి, రంగా రెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిపి గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో సమీకృత సబ్‌రిజి స్ట్రార్ నమూనా కార్యాలయాన్ని నిర్మిస్తామని వివరించారు.
ఈ నెలలో శంకు స్థాపనలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని బంజా రాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను షేక్‌పేటలో నిర్మించాలని నిర్ణయించామన్నారు.
వెయిటింగ్ హాల్, విశాల పార్కింగ్ సదుపాయాలతో..
మొదటి దశలో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీ సం 3 ఎకరాల్లో ఉంటాయని, 10–15 వేల చదరపు
అడు గుల్లో కార్యాలయాల భవన నిర్మాణాలు చేపడతామని పొంగులేటి చెప్పారు. వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, విశాల పార్కింగ్ వసతులుండేలా డిజైన్‌లు రూపొందించా లని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడుతుందని, పర్యవే క్షణ సులభతరం అవుతుందని.. దస్త్రాల పరిశీలిన వేగవంతం అవుతుందన్నారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీ తిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేలా తక్షణమే కార్యాచరణ రూపొందించాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment