డెత్..జర్నీ
ఇంద్రపాలనగరం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
బస్సుడ్రైవర్‌తో సహా 10 మంది దుర్మరణం
హాహాకారాలతో దద్దరిల్లిన
ప్రమాదప్రాంతం
నార్కట్‌పల్లి డిపోనకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు భువనగిరి-నల్లగొండ మధ్య రోజూ మూడు ట్రిప్పులు తిరుగుతుంది.
మధ్యాహ్నం 2.15 నిమిషాలకు
నల్లగొండ నుంచి భువనగిరికి వచ్చింది.
క్యాంటిన్‌లో డ్రైవర్, కండక్టర్ భోజనం చేశారు.
2.45 గంటలకు నల్లగొండకు బయలు దేరారు. 3.35 గంటలకు రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్దకు
చేరుకుంది.
బస్టాప్ వద్ద కొందరు ప్రయాణికులు ఎక్కి వెనక సీట్లలో కూర్చున్నారు.
బస్సు ముందుకు కదిలింది.
3.40 గంటలకు కండక్టర్ రాజేష్ టిక్కెట్లు ఇవ్వడానికి వెనక్కి వెళ్లాడు.
ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన
లారీ ఢీకొట్టడంతో ఘోరం జరిగింది.
మృతులు వీరే..
1)యాస మల్లారెడ్డి(45)
2)కాదారి అశ్విని(20)
3) భూపతి శ్రీదేవి (32)
4) సయ్యద్ సాజిదా
బేగం (18)
5) అంతటివెంకన్న (45)
6) గోనె శ్రీనివాస్ (40)
7) తోట విజయలక్ష్మి (22)
8) పసుపుల నిర్మల (22),
9) పసుపుల జగదీశ్
(9నెలలు) వీరిద్దరూ
తల్లి,కుమారుడు.
10) వేముల యాదిగిరి (40)