టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు | Conflicts in TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

Published Mon, Aug 8 2016 11:22 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు - Sakshi

టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

రామన్నపేట
అధికారపార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఒక్కసారిగా భయటపడ్డాయి. ఓ వర్గం వారు ఏకంగా రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి సమీప బంధువు ఇంటిపైనే దాడికి తెగబడ్డారు. ఆరుగురిని గాయపపరచడమే కాకుండా ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. రామన్నపేట మండల పరిధి ఇంద్రపాలనగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 
రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మందడి విద్యాసాగర్‌రెడ్డి మంత్రి జగదీశరెడ్డికి సమీప బంధువు. ఇదే గ్రామానికి చెందిన తెలంగాణ బెస్త సేవా సంఘం అధ్యక్షుడు పూస బాలకిషన్‌కు మందడి విద్యాసాగర్‌రెడ్డికి కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది.
బోనాల పండుగలో..
ఇంద్రపాలనగరానికి చెందిన బెస్తకులస్తులు ఆదివారం బోనాల పండుగ వైభవంగా జరుపుకున్నారు. బోనాల ఊరేగింపు క్రమంలో సర్పంచ్‌ పూస నర్సింహను అవమనించడానే నెపంతో బోనగిరి శ్రీనుపై దాడిచేశారు. దీంతో శ్రీను అఖిలపక్షం నాయకులను వెంట తీసుకుని  చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికే సర్పంచ్‌ కుమారుడు పూస బాలకిషన్‌ తన అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. బోనగిరి శ్రీను అనే వ్యక్తి తన తండ్రిని అవమానపరిచాడని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్టేషన్‌లోపల, బయట వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పంపించారు.
రాత్రి సమయంలో..
 రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో పూస బాలకిషన్‌తో పాటు అతని వర్గానికి చెందిన సుమారు 30మంది బైక్‌లపై మందడి విద్యాసాగర్‌రెడ్డి ఇంటికివెళ్లి గేటును గుద్దారు.అప్రమత్తమైన మందడి విద్యాసాగర్‌రెడ్డి కుటుంబసభ్యులు, అతని బం«ధువులు లోపలికిరాకుండా గేటును అదిమిపట్టి ప్రతిఘటించారు. బాలకిషన్‌తో పాటు అతని అనుచరులు  ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న సాగర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి.సిద్ధార్థరెడ్డి, వారి బంధువులు బేతి మదన్‌మోహన్‌రెడ్డి, శోభ, మంత్రి వ్యక్తి గత కార్యదర్శి సోదరుడు జయచందర్‌రెడ్డిపై అక్కడ దొరికిన పొయ్యిలకట్టెలు, ఇనుపరాడ్, కంకరరాళ్లతో దాడిచేసి గాయపరిచారు. ప్రాణభయంతో వారంతా ఇంట్లోకివెళ్లి దాచుకున్నారు. దీంతో కాంపౌండ్‌లో ఉన్న మంత్రి బంధువుల ఇన్నోవా, ఐ ట్వంటీకార్లను, ఇంటికిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి అక్కాబావలు ఇతర బంధువులు అక్కడే ఉన్నారు. తోపులాటలో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు, 100కాల్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. రామచంద్రారెడ్డి మంత్రికి ఫోన్‌ ద్వారా  విషయం తెలియజేశాడు. స్థానిక సీఐ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ ప్యారసాని శీనయ్య తన బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. జనాన్ని చెదరగొట్టి గాయపడిన వారిని కామినేని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శ్రీధర్‌రెడ్డి, సిద్ధార్థరెడ్డి, జయచందర్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, శోభలను బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి జరిగిన ఇంటిపరిసరాలు, వస్త్రాలు రక్తపు మరకలతో నిండిపోయాయి.
 ఇంద్రపాలనగరాన్ని సందర్శించిన ఎస్పీ
విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాష్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ సుధాకర్‌ ఆదివారం అర్ధరాత్రి ఇంద్రపాలనగరం గ్రామాన్ని సందర్శించారు. సంఘటన జరిగిన ఇంటివద్దకు వెళ్లి దాyì  జరిగిన తీరును బాధితులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని గ్రామస్తులకు హామీఇచ్చారు.  
దాడికి పాల్పడిన 28మందిపై కేసు 
మంత్రిబంధువు ఇంటిపై దాడి చేసి గాయపరచిన కేసులో టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు పూస బాలకిషన్, మండల ప్రధానకార్యదర్శి పెద్దగోని వెంకటేశంతో కలిపి 28మందిపై కేసునమోదు చేసినట్లు సీఐ మామిళ్ల శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నిందితులలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.  గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్నిపక్షాలవారు సహకరించాలని కోరారు. చట్టంను ధిక్కరించి, శాంతిభద్రతలకు భంగం కలిగేవిధంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
 భారీ పోలీస్‌ బందోబస్తు
గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఆదేశానుసారం డీఎస్పీ సుధాకర్, స్థానిక సీఐ మామిళ్ల శ్రీధర్‌రెడ్డిల పర్యవేక్షణలో గ్రామంలో పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువు, సర్పంచ్‌ ఇంటివద్ద ప్రత్యేక బలగాలను మెుహరించారు. సుమారు 100మంది పోలీసులను  నియమించారు. చౌటుప్పల్, యాదగిరిగుట్ట సీఐలు  నవీన్‌కుమార్, రఘువీరారెడ్డి, సర్కిల్‌ఎస్సైలు ప్యారసాని శీనయ్య, వెంకటేశ్వర్లు, శివనాగప్రసాద్, రవి, ఏఎస్‌ఐ సంత్‌సింగ్‌లు ఆధ్వర్యంలో గ్రామంలో పికెటింగ్‌ కొనసాగుతోంది.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement