హృదయ విదారకం...
రామన్నపేట
ఇంద్రపాలనగరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న గర్భిణీ, వైద్యపరీక్షలు చేయించేందుకు తల్లిని తీసుకువెళ్తున్న కూతురు, తొమ్మిదినెలల పసికందు మృతిచెందిన తీరు హృదయ విదారకంగా ఉంది.
పరీక్షరాసేందుకు వెళుతూ...
భువనగిరికి చెందిన కందారి అశ్విని(20) డిగ్రీ సప్లమెంటరీపరీక్ష రాసేందుకు తనతల్లిగారి ఊరైన రామన్నపేటకు బయలుదేరింది. మార్గమధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందింది. మృతురాలు గర్భిణీ కూడా కావడంతో ఆమె మృతి కుటుంబంలో విషాదాన్ని నింపింది.
వైద్యపరీక్షలుకు వెళుతూ...
రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన సయ్యద్‌సాజిదాబేగం(21) రామన్నపేటకు వెళ్లి తనతల్లికి జుబెదాబేగానికి వైద్యపరీక్షలు చేయించేందుకు ఇంద్రపాలనగరంలోనే బస్సు ఎక్కింది. రెండు నిమిషాలకే ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఆమెతండ్రి ఖలీల్ ప్రమాదస్థలాన్ని చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలై ఉన్న సాజిదాబేగాన్ని బస్సులో నుంచి కిందికి దింపగాన తనవడిలో కూర్చోబెట్టుకున్నాడు. కొనఊపిరితో ఉన్న సాజిదాబేగం తనతండ్రి ఒడిలో కన్నుమూసి అనంతలోకాలకు వెళ్లింది. ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి బయలుదేరిన కూతురు, ఆస్పత్రిలో శవమై పడుకున్నావా అంటూ తల్లిరోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.