యూత్‌కాంగ్రెస్‌ ర్యాలీని జయప్రదం చే యాలి | To success the youth congress rally | Sakshi
Sakshi News home page

యూత్‌కాంగ్రెస్‌ ర్యాలీని జయప్రదం చే యాలి

Published Sun, Jul 31 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

యూత్‌కాంగ్రెస్‌ ర్యాలీని జయప్రదం చే యాలి

యూత్‌కాంగ్రెస్‌ ర్యాలీని జయప్రదం చే యాలి

రామన్నపేట : యూత్‌ కాంగ్రెస్‌ జాతీయఅధ్యక్షుడు రాజుబార్‌ అమరేందర్‌సింగ్‌ తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ర్యాలీకి జిల్లానుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వనం చంద్రశేఖర్‌ కోరారు. ఆదివారం రామన్నపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ర్యాలీ  సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు వరకు కొనసాగుతుందని చెప్పారు. అనంతరం ఆర్టీసీ కల్యాణమండపంలో కార్యకర్తల సమావేశం ఉంటుందని తెలిపారు. ఆయనవెంట నాయకులు ఎండీ.జమీరుద్దిన్, మిర్యాల మల్లేశం, మినుముల సందీప్, ఎండీ.ఎజాజ్, దొడ్డి అజయ్, ఎండీ.జాని, రవి, మోహన్‌లు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement