Published
Sat, Sep 3 2016 9:54 PM
| Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
కేసీఆర్ పాలనతో లాభం లేదు
రామన్నపేట : త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీమాంద్ర నాయకుల్లా పరిపాలన చేస్తే సహించేదిలేద సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి తెలిపారు. శనివారం రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23 నెలల కేసీఆర్ పాలనతో ప్రజలకు ఒరిగిందేమిలేదని అన్నారు. వేల కోట్ల నిధులతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో తెలంగాణ కాంట్రాక్టర్లకు అవకాశమివ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 2013 భసేకరణ చట్టం ప్రకారం డిండీ, బస్వాపురం, సింగరాజుపల్లి, ప్రాణహిత–చేవెళ్ల భూనిర్వాసితులకు పరిహారం, పునరావసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండేసోయి మరచి, పెట్టుబడిదారుల క్షేత్రంగా పనిచేస్తుందని ఆరోపించారు. బీజేపీ తిరంగా యాత్ర పేరుతో సాయుధపోరాట నేపథ్యాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈనెల 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ ∙పోరాట వారోత్సవాల సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నుట్ల తెలిపారు. 17న హైదారాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ముగింపు సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి లొడంగి శ్రవణ్‌కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు నెల్లికంటి సత్యం, ఊట్కూరి నర్సింహ, గంగాపురం యాదయ్య ఉన్నారు.