
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురంలో అధికార పార్టీ సర్పంచ్ భర్తకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పల్లెపగ్రతి కార్యక్రమంలో చేసిన పనులకు సర్పంచ్ భర్త కాల్వ శ్రవణ్ బిల్లు ఇవ్వకపోవడంతోపాటు తిరిగి వారినే బెదిరింపులకు గురిచేస్తున్నాడు. అంతేగాక డబ్బులు అడిగినందుకు కులం పేరుతో దూషించడం ప్రారంభించాడు. ఒక్కసారిగా మాట మాట పెరిగి పెనుగులాటకు దారి తీయగా గ్రామస్తులు అతన్ని చితకబాదారు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు.
Comments
Please login to add a commentAdd a comment