Sarpanch attack
-
సర్పంచ్ దాడి.. చెట్టుకు కట్టేసి మరీ చితకబాదిన వైనం..?
ధర్మారం(ధర్మపురి): వీధిలో రోడ్డు నిర్మించడం లేదని చౌరస్తాలో తనను దూషించాడన్న సమాచారంతో మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ సదరు వ్యక్తిని పంచాయతీ తాత్కాలిక సిబ్బందితో మోటార్ సైకిల్‌పై ఇంటికి రప్పించుకుని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల బాగోగులు చూడాల్సిన సర్పంచే ఏకంగా ఓ వ్యక్తిని ఇంటికి పిలిపించుకుని కొట్టడంపై గ్రామస్తులు విస్తుపోతున్నారు. ఈ ఘటనపై మండలస్థాయి అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ తెలియనట్లు నటిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత శుక్రవారం సాయంత్రం తమ వాడలో సర్పంచ్ రోడ్డు నిర్మించడం లేదని గ్రామ చౌరస్తాలో దూషించినట్లు సమాచారం. విషయాన్ని స్థానికుడొకరు సర్పంచ్ దృష్టికి ఫోన్లో చేరవేశారు. నిజాలు తెలుసుకోకుండానే కోపోద్రిక్తుడైన సదరు సర్పంచ్.. వెంటనే పంచాయతీ తాత్కాలిక ఉద్యోగికి ఫోన్ చేసి సదరు వ్యక్తిని తీసుకరావాలని హుకూం జారీ చేశాడు. సదరు ఉద్యోగి ఆ వ్యక్తిని సర్పంచు ఇంటికి తీసుకొని వెళ్లడమే ఆలస్యం.. ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ముందున్న చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా సదరు వ్యక్తి కుమారుడికి ఫోన్ చేసి ‘మీ తండ్రిని చెట్టు కట్టేశాం..’ అని చెప్పారు. ఆందోళనకు గురైన బాధితుడి కుమారుడు తన మేనమామను వెంట తీసుకుని వెళ్లి చెట్టుకు కట్టేసి ఉన్న తండ్రిని చూసి చలించిపోయాడు. విడిచిపెట్టాలని సర్పంచ్‌ను కోరగా ఇష్టమొచ్చినట్లు తిడితే తాము పడతామా అని సర్పంచు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సర్పంచు కాళ్లు మొక్కి.. ఇకమీదట తిట్టకుండా చూస్తామని చెప్పి తండ్రిని ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు కూడా వార్నింగ్..? చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన నుంచి తేరుకోని బాధిత కుటుంబానికి శనివారం గ్రామ పంచాయతీ నుంచి పిలుపు వచ్చింది. ఓ పెద్దమనిషి ఫోన్ చేసి పంచాయతీ కార్యాలయం వద్దకు రావాలని ఆదేశించగా.. మళ్లీ ఏం జరుగుతుందోనన్న భయాందోళనతో వెళ్లిన యువకుడికి మళ్లీ క్లాస్ పీకారు. ఇలాంటి ఘటన పునరావృతం అయితే పోలీస్‌స్టేషన్‌లో వేయిస్తానని సర్పంచు బెదిరించినట్లు సమాచారం. అక్కడే ఉన్న మిగతావారు కూడా సర్పంచును దూషించొద్దని సూచించి పంపించినట్లు సమాచారం. ఈ విషయమై బాధితుడి కుమారుడిని వివరణ కోరగా.. తనతండ్రిని చెట్టుకు కట్టేసి కొట్టారని, విడిపించాలని కోరితే సర్పంచుతోపాటు ఆయన కుటుంబసభ్యులు హెచ్చరించి వదిలేశారని చెప్పాడు. -
సర్పంచ్ భర్తపై టీడీపీ కార్యకర్తల దాడి
వీరులపాడు(నందిగామ): ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం బోడవాడ గ్రామ సర్పంచ్ శీలం సంధ్య భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు శీలం ఉదయభాస్కర్రెడ్డిపై శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసి గాయపరిచారు. గ్రామస్తులు, బాధితుల కథనం మేరకు.. బోడవాడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు రాయల అనూరాధ కుమారుడు ఉదయ్‌కుమార్ శనివారం రాత్రి 8గంటల సమయంలో బజారుకు వెళ్లి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన శివనాగసతీష్ అడ్డుకుని ‘మీకు ఇటు దారి లేదు. ఇటు నడవటానికి వీల్లేదు’ అని చెప్పాడు. ఈ విషయాన్ని ఉదయ్‌కుమార్ తన తల్లి అనూరాధకు చెప్పగా, ఆమె వెళ్లి దారి లేదని ఏ హక్కుతో చెప్పారంటూ శివనాగసతీ‹Ùను ప్రశి్నంచింది. దీంతో ఆమెపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రాయల సత్యనారాయణ, రాయల చిన్నశ్రీను, రాయల లక్షి్మ, లక్ష్మీతిరుపతమ్మ, మరికొంత మంది మహిళలు దాడి చేశారు. అనూరాధకు ఉదయభాస్కర్‌రెడ్డి ధైర్యం చెప్పి ఫిర్యాదు చేసేందుకు వీరులపాడులోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే సర్పంచ్ సంధ్యను టీడీపీ వారు దూషిస్తున్నారని ఫోన్ రావడంతో ఉదయభాస్కర్‌రెడ్డి తిరిగి గ్రామానికి వచ్చారు. గ్రామస్తులతో ఆయన మాట్లాడుతుండగానే వెనుక నుంచి టీడీపీ కార్యకర్తలు రాయల శివనాగసతీష్, రాయల అనిల్, గంగినేని చిన్న మంగయ్య, పెద్ద మంగయ్య, సరిపూడి హరికృష్ణ, మరికొంతమంది కర్రలతో దాడి చేయటంతో ఉదయభాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన్ను కుటుంబ సభ్యులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయభాస్కర్‌రెడ్డి, అనూరాధను ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ఆదివారం పరామర్శించారు. రాయల అనూరాధ, ఉదయభాస్కర్‌రెడ్డి వేర్వేరుగా ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్ తెలిపారు. చదవండి: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి -
Nirmal: సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్
-
ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్
ఆదిలాబాద్ టౌన్: వాహనాలకు ట్రాఫిక్ చలాన్ విధించే అధికారం ఎక్కడిది అంటూ ఓ సర్పంచ్ పోలీసులపై తిరగబడ్డాడు. తమ విధులకు ఆటంకం కలిగించాడని పోలీసులు ఆ సర్పంచ్‌పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కుమారుడు, జైనథ్ మండలంలోని ఆడ సర్పంచ్ పాయల్ శరత్. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ చలాన్ విధించడాన్ని పాయల్ శరథ్ తప్పుబట్టాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు చలాన్ విధించే అధికారం లేదంటూ తమ విధులకు పాయల్ శరథ్ ఆటంకం కలిగించారని ట్రాఫిక్ ఎస్సై రామారావు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు చదవండి: కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే! -
కులంపేరుతో దూషణ: సర్పంచ్ భర్తకు దేహశుద్ధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురంలో అధికార పార్టీ సర్పంచ్ భర్తకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పల్లెపగ్రతి కార్యక్రమంలో చేసిన పనులకు సర్పంచ్ భర్త కాల్వ శ్రవణ్ బిల్లు ఇవ్వకపోవడంతోపాటు తిరిగి వారినే బెదిరింపులకు గురిచేస్తున్నాడు. అంతేగాక డబ్బులు అడిగినందుకు కులం పేరుతో దూషించడం ప్రారంభించాడు. ఒక్కసారిగా మాట మాట పెరిగి పెనుగులాటకు దారి తీయగా గ్రామస్తులు అతన్ని చితకబాదారు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. -
మహిళపై దాడి చేసిన సర్పంచ్
కరీంనగర్(చొప్పదండి): చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామ సర్పంచ్ వెంకట్‌రెడ్డి అదే ఊరికి చెందిన ఓ మహిళపై దాడిచేశాడు. వివరాలు..గ్రామానికి చెందిన భూమారి భాగ్య ఇంటి పక్కనే రహదారి ఉంది. రహదారికి అవతలి వైపు ఉన్న ఓ ఇంటి ఆవిడ తన ఇంటి ముందు ఉన్న రహదారిపై బాత్రూం కట్టిస్తుండటంతో ఆమెను భాగ్య ప్రశ్నించింది. మీరు ఇలా రోడ్డు మీద కడితే నడవటానికి ఎలా వెళ్లాలి, రోడ్డు విస్తరణలో తమ ఇంటికి నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆ మహిళను భాగ్య సంప్రదించింది. అయితే నిర్మాణం చేపట్టిన మహిళ సర్పంచ్ వెంకట్ రెడ్డికి మద్ధతుదారు. ఆమెకు మద్ధతుగా వచ్చిన సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఈ విషయంలో భాగ్యపై చేయి చేసుకున్నాడు. తనపై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించి తన బట్టలను చింపేశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ పరారీలో ఉన్నాడు. -
దురాగతాలపై పోరుబాటే
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొని తీరతాం అధికార పార్టీకి వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరిక ఎస్.యానాం సర్పంచ్‌పై దాడి పట్ల ఆగ్రహం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజం అమలాపురం : ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుల సొంత మండలమైన ఉప్పలగుప్తం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న దాడుల పట్ల ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తీవ్రంగా స్పందించారు. హోం మంత్రిని మచ్చిక చేసుకోవాలనో, ఎమ్మెల్యే వత్తిడి చేశారనో అధికారపార్టీకి చెందినవారు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంపై భగ్గుమన్నారు. అధికారపార్టీ అండదండలతో జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని, తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్ష నాయకులను దారికి తెచ్చుకోవాలన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ఎలుగెత్తారు. గత శనివారం ఎస్.యానాం సర్పంచ్ 70 ఏళ్ల పెట్టా వెంకట్రావుపై టీడీపీకి చెందినవారు దాడి చేయగానే బాధితుడైన ఆయనపైనే తిరిగి హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధితులైన తమ పార్టీ వారికి న్యాయం చేయకుంటే ఎంతవరకు వెళ్లేందుకైనా వెనుకాడేది లేదని అన్నారు. ఆమరణదీక్షకు సిద్ధం : విశ్వరూప్ ‘టీడీపీహయాంలో కారంచేడులో జరిగిన సంఘటన ఇప్పుడు అమలాపురంలో పునరావృతమయ్యేలా ఉంది. ఎస్సీ అధికారులను వేధిస్తున్నారు. దూరంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు దళితులపై దాడులు చేస్తుంటే పోలీసులు వారికి అండగా ఉంటున్నారు. ఎస్.యానాం సర్పంచ్ పెట్టా వెంకట్రావుపై దాడి కేసులో న్యాయం చేయకుంటే అమలాపురంలో ఆమరణదీక్ష చేస్తాను’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం వద్ద సోమవారం జరిగిన అమలాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ హోం మంత్రి చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుల అండ ఉందంటూ ఉప్పలగుప్తం మండలంలో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామానికి చెందిన కొంతమంది సర్పంచ్‌పై దాడి చేయడమే కాక ఆయనను తీసుకు వెళుతున్న అంబులెన్స్‌పై కూడా దాడి చేశారని అన్నారు. అటువంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు దెబ్బలుతిని ఆస్పత్రి పాలైన 70 ఏళ్ల సర్పంచ్ హత్యాయత్నానికి పాల్పడినట్టు 307 కేసు పెట్టడం హాస్యాస్పదమన్నారు. హోంమంత్రి రాజప్ప నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్ కేంద్రంగా అధికార దర్పం : బోస్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ దళితపేటలో ఇంటి వద్దనున్న వ్యక్తిని కొట్టేందుకు వెళ్లారంటే దాడి చేసేవారికి గల అధికారపార్టీ దన్నును అర్థం చేసుకోవచ్చన్నారు. సర్పంచ్‌పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేసి, అతనిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. దాడి జరగడానికి ముందు సర్పంచ్ రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు కేసు కట్టలేదో చెప్పాలన్నారు. దళితులు ఫిర్యాదు చేసినప్పుడు కేసులు పెట్టకుంటే వారు కూడా ముద్దాయిలవుతారని ఎస్సీఎస్టీ అట్రాసిటీలో ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. హోంమంత్రికి బయపడి బాధితులకు అన్యాయం చేస్తున్నందున ఎస్.యానాం దాడి కేసులో ఇతర ప్రాంతానికి చెందిన డీఎస్పీతో విచారణ చేయించాలన్నారు. ‘అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అభివృద్ధి చేద్దామని లేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దానితో పోలీస్ స్టేషన్ కేంద్రంగా అధికార దర్పాన్ని ఇలా ప్రదర్శిస్తుండడం భావ్యం కాదు’ అని హితవు పలికారు. ఇది ఆపకపోతే ఢిల్లీ తరహా తీర్పు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు ఆపకుంటే ఉద్యమించయినా అధికార పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజప్ప గౌరవాన్ని నిలుపుకోవాలి : కుడుపూడి కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ కోనసీమలో పార్టీల మధ్య కక్షా రాజకీయాలు గతంలో ఎప్పుడూ లేవని, హోంమంత్రి రాజప్ప తన మండలంలో జరుగుతున్న దాడులపై స్పందించాలని అన్నారు. సర్పంచ్‌పై దాడి విషయంలో న్యాయంగా దర్యాప్తు చేయించి గౌరవాన్ని నిలుపుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు, ఉప్పలగుప్తం ఎంపీపీ శిరంగు రాజా ఎస్.యానాం ఘటన జరిగిన తీరును వివరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఐ.వి.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రాష్ట్ర యువత సంయుక్త కార్యదర్శులు వాసంశెట్టి సుభాష్, గనిశెట్టి రమణలాల్, సుంకర సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముత్తాబత్తుల మణిరత్నంతోపాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నాయకులు కాకినాడ వెళ్లి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.