వీరులపాడు(నందిగామ): ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం బోడవాడ గ్రామ సర్పంచ్ శీలం సంధ్య భర్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు శీలం ఉదయభాస్కర్‌రెడ్డిపై శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసి గాయపరిచారు. గ్రామస్తులు, బాధితుల కథనం మేరకు.. బోడవాడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు రాయల అనూరాధ కుమారుడు ఉదయ్‌కుమార్ శనివారం రాత్రి 8గంటల సమయంలో బజారుకు వెళ్లి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన శివనాగసతీష్ అడ్డుకుని ‘మీకు ఇటు దారి లేదు. ఇటు నడవటానికి వీల్లేదు’ అని చెప్పాడు.
ఈ విషయాన్ని ఉదయ్‌కుమార్ తన తల్లి అనూరాధకు చెప్పగా, ఆమె వెళ్లి దారి లేదని ఏ హక్కుతో చెప్పారంటూ శివనాగసతీ‹Ùను ప్రశి్నంచింది. దీంతో ఆమెపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రాయల సత్యనారాయణ, రాయల చిన్నశ్రీను, రాయల లక్షి్మ, లక్ష్మీతిరుపతమ్మ, మరికొంత మంది మహిళలు దాడి చేశారు. అనూరాధకు ఉదయభాస్కర్‌రెడ్డి ధైర్యం చెప్పి ఫిర్యాదు చేసేందుకు వీరులపాడులోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే సర్పంచ్ సంధ్యను టీడీపీ వారు దూషిస్తున్నారని ఫోన్ రావడంతో ఉదయభాస్కర్‌రెడ్డి తిరిగి గ్రామానికి వచ్చారు.
గ్రామస్తులతో ఆయన మాట్లాడుతుండగానే వెనుక నుంచి టీడీపీ కార్యకర్తలు రాయల శివనాగసతీష్, రాయల అనిల్, గంగినేని చిన్న మంగయ్య, పెద్ద మంగయ్య, సరిపూడి హరికృష్ణ, మరికొంతమంది కర్రలతో దాడి చేయటంతో ఉదయభాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన్ను కుటుంబ సభ్యులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయభాస్కర్‌రెడ్డి, అనూరాధను ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ఆదివారం పరామర్శించారు. రాయల అనూరాధ, ఉదయభాస్కర్‌రెడ్డి వేర్వేరుగా ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్ తెలిపారు.
చదవండి: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Comments
Please login to add a commentAdd a comment