మహిళపై దాడి చేసిన సర్పంచ్ | sarpanch attacks on a woman bhagya | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి చేసిన సర్పంచ్

Published Wed, Aug 26 2015 7:11 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

sarpanch attacks on a woman bhagya

కరీంనగర్(చొప్పదండి): చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామ సర్పంచ్ వెంకట్‌రెడ్డి అదే ఊరికి చెందిన ఓ మహిళపై దాడిచేశాడు. వివరాలు..గ్రామానికి చెందిన భూమారి భాగ్య ఇంటి పక్కనే రహదారి ఉంది. రహదారికి అవతలి వైపు ఉన్న ఓ ఇంటి ఆవిడ తన ఇంటి ముందు ఉన్న రహదారిపై బాత్రూం కట్టిస్తుండటంతో ఆమెను భాగ్య ప్రశ్నించింది. మీరు ఇలా రోడ్డు మీద కడితే నడవటానికి ఎలా వెళ్లాలి, రోడ్డు విస్తరణలో తమ ఇంటికి నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆ మహిళను భాగ్య సంప్రదించింది.

అయితే నిర్మాణం చేపట్టిన మహిళ సర్పంచ్ వెంకట్ రెడ్డికి మద్ధతుదారు. ఆమెకు మద్ధతుగా వచ్చిన సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఈ విషయంలో భాగ్యపై చేయి చేసుకున్నాడు. తనపై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించి తన బట్టలను చింపేశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సర్పంచ్ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement