
ఆదిలాబాద్ టౌన్: వాహనాలకు ట్రాఫిక్ చలాన్ విధించే అధికారం ఎక్కడిది అంటూ ఓ సర్పంచ్ పోలీసులపై తిరగబడ్డాడు. తమ విధులకు ఆటంకం కలిగించాడని పోలీసులు ఆ సర్పంచ్‌పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కుమారుడు, జైనథ్ మండలంలోని ఆడ సర్పంచ్ పాయల్ శరత్. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ చలాన్ విధించడాన్ని పాయల్ శరథ్ తప్పుబట్టాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు చలాన్ విధించే అధికారం లేదంటూ తమ విధులకు పాయల్ శరథ్ ఆటంకం కలిగించారని ట్రాఫిక్ ఎస్సై రామారావు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు.
చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు
చదవండి: కుక్కర్‌లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే!