Adilabad police
-
‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త
గుడిహత్నూర్ (బోథ్): ‘సోనీ.. నన్ను క్షమించు. నీకు, పిల్లలకు ఏం చేయలేక పోయాను. నువ్వు చాలా అమాయకురాలివి.. నీ సంతోషం కోసం ఎక్కడికి తీసుకెళ్లలేకపోయా.. బంగారం లాంటి నా పిల్లలను వీడి చనిపోతున్నా’ అంటూ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యాపారి జక్కుల శ్రీనివాస్ (38) సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘అప్పులు, వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటున్న వారిని దూషి స్తూ.. నా చావుతోనైనా వారికి కనువిప్పు కలగాలి’ అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుడిహత్నూర్‌లో జరిగింది. ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్ ఉస్మాస్ బిస్కెట్ ఏజెన్సీ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వ్యాపారంతోపాటు తనకు తెలిసిన వారికి ఇతరుల దగ్గరి నుంచి అప్పులు ఇప్పించాడు. శ్రీనివాస్ పూచికత్తుగా ఉండి అప్పులు ఇప్పించడంతో అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోవడంతో ఇచ్చినవారికి శ్రీనివాస్ వడ్డీలు కూడా చెల్లించాడు. ఇలా ఇతరుల అప్పులు చెల్లిస్తూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన భార్య సోనిని జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లో ఉండే అత్తవారింట్లో వదిలి పనిపై గుడిహత్నూర్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. మాన్కాపూర్ శివారులో పత్తి చేను వద్ద పురుగుల మందుతో వెళ్లిన శ్రీనివాస్ ముందుగా సెల్ఫీ వీడియో తీశాడు. భార్య సోని, కూతురు లక్ష్మీభవాని, కొడుకు దుర్గాప్రసాద్‌ను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. (చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి) తీసుకున్న అప్పులు, ఇప్పించి అప్పులు వాటికి తాను నెలనెలా కడుతున్న వడ్డీలు మానవత్వం లేకుండా అప్పులు ఇచ్చినవారు వేధిస్తున్న తీరును చెప్పుకొచ్చాడు. తన చావుకు అప్పులు వారు, డీసీబీ బ్యాంకు సిబ్బంది వేధింపులే కారణమని తెలిపాడు. గత్యంతరం లేక తాను ఆత్మహత్య చేసుకుని తన కుటుంబానికి దూరమవుతున్నానని అన్నాడు. కాగా, సాయంత్రం అయినా శ్రీనివాస్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వాకబు చేస్తూ వెతికారు. గురువారం ఉదయం మాన్కాపూర్ శివారు పత్తి చేనులో శ్రీనివాస్ పురుగుల మందు తాగి విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే! -
ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్
ఆదిలాబాద్ టౌన్: వాహనాలకు ట్రాఫిక్ చలాన్ విధించే అధికారం ఎక్కడిది అంటూ ఓ సర్పంచ్ పోలీసులపై తిరగబడ్డాడు. తమ విధులకు ఆటంకం కలిగించాడని పోలీసులు ఆ సర్పంచ్‌పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కుమారుడు, జైనథ్ మండలంలోని ఆడ సర్పంచ్ పాయల్ శరత్. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ చలాన్ విధించడాన్ని పాయల్ శరథ్ తప్పుబట్టాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు చలాన్ విధించే అధికారం లేదంటూ తమ విధులకు పాయల్ శరథ్ ఆటంకం కలిగించారని ట్రాఫిక్ ఎస్సై రామారావు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: ‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు చదవండి: కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే! -
రేవంత్‌రెడ్డి పోలీసులను కించపరిచేలా మాట్లాడారు: ఎస్పీ రాజేష్‌చంద్ర
-
ఇక నా పెళ్లి జరగదు.. యువతి ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ(22) తనకు పెళ్లి కాదని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ గ్రామానికి చెందిన హరిప్రియకు మహారాష్ట్రకు చెందిన మేనబావతో వివాహం జరిపేందుకు రెండు కుటుంబాలు నిశ్చయించాయి. హరిప్రియ తండ్రి మధుకర్ తన అక్క దగ్గర గత సంవత్సరం రూ.2 లక్షల వరకు అప్పు తీసుకవచ్చాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో మధుకర్ అప్పు తీర్చలేకపోయాడు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పు తీరిస్తేనే పెళ్లి అని మధుకర్ అక్క చెప్పడంతో హరిప్రియ తన పెళ్లి జరగదని కలత చెంది సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇది గమనించిన హరిప్రియ నాన్నమ్మ విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. పిక్ల తండాలో యువకుడు.. లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని పిక్లతండాకు చెందిన బానోత్ గోవింద్(32) ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి మృతిచెందాడు. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్ రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివార రాత్రి కూడా బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. భార్య మందలించడంతో చేను వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుబ సభ్యులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహ మేరకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాదు రీమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ప్రియుడి ఇంటి ఎదుట యువతి నిరసన కాసిపేట(బెల్లంపల్లి): మండలంలోని పెద్దనపల్లి గ్రామానికి చెందిన చెండె స్వరూప సోమవారం ప్రియుడి ఇంటిముందు నిరసన తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనపల్లికి చెందిన లౌడం మహేందర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏడాది క్రితం తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. ఇటీవల ప్రెగ్నేన్సి టెస్ట్ కూడా చేయించాడని, ప్రెగ్నేన్సీ లేకపోవడంతో నామోబైల్లో కాల్స్, మేసెజ్ డాటా మొత్తం తొలగించి తనతో ఎలాంటి సంబంధం లేదని వెళ్లిపోయాడని వివరించింది. తనకు న్యాయం చేయాలని, మహేందర్‌తో వివాహం జరిపించాలని బైఠాయించింది. గ్రామస్తులు మద్దతు తెలపడంతో గోడవ జరుగుతుందని, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోని ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో కాసిపేట పోలిస్స్టేషన్లో స్వరూప ఫిర్యాదు చేసింది. మహేందర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, అతను కోలుకున్నాక విచారణ చేసి కేసునమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా..ప్రమాదమా? -
అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు
సాక్షి, ఆదిలాబాద్: ఆవేశంలో అక్క ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. చెల్లెలు అక్క మృతిని తట్టుకోలేక టాయిలెట్ క్లీనర్ ద్రావణం తాగేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అక్క మృతి చెందగా చెల్లెలు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్లో చోటుచేసుకుంది. అయితే వారు ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. . ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సంజయ్‌నగర్‌లో ఉంటున్న అక్క రేఖశ్రీ మంగళవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యతో అక్క మృతి చెందడంతో ఆమె చెల్లెలు దీపశ్రీ తట్టుకోలేకపోయింది. అక్క మృతిని కళ్లారా చూసినా దీప తాను కూడా చచ్చిపోతానని బాత్రూమ్లో ఉండే టాయిలెట్ క్లీనర్ తాగేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే దీపశ్రీని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీప పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషాదానికి కారణం కుటుంబ కలహాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: నా భార్యకు భర్తగా కొడుకు పేరా? -
సోనూసూద్ ఔదార్యం.. పసిబిడ్డకు ప్రాణం పోశాడు!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయం కోసం తన వద్దకు వచ్చినవారందరికీ అండగా నిలుస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు సోనూసూద్. కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు. ఎంతో మందికి సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. నష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ని కొనియాడింది. ఆదుకోవాలని అడిగిన వారందరికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన పోతు మహేశ్, లక్ష్మీప్రియ దంపతులకు రెండు నెలల కిందట నెలలు నిండకముందే కొడుకు పుట్టాడు. అయితే బాబు 900 గ్రాముల బరువుతో జన్మించాడు. అవయవాలు ఎదగలేదని, స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. పదిహేను రోజుల తర్వాత బాబును హైదరాబాద్‌లోని రెయిన్బో హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ నాలుగు వారాలకు కొంత కోలుకున్నాడు. అయితే బిల్లు రోజురోజుకు పెరుగుతూ రూ.7లక్షలు దాటింది. అప్పటి నుంచి మహేశ్ డబ్బులు లేకపోవడంతో తెలిసినవారిని సాయం అడిగాడు. చదవండి: సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం! కరీంనగర్‌లోని ఒక వ్యక్తి బాబు పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే స్పందించి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎంత ఖర్చయినా భరిస్తానని, బాబుకు మెరుగైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చిన్నారి మరో 300 గ్రాముల బరువు పెరిగాడు. ఇన్ఫెక్షన్ తగ్గుతూ తల్లిపాలు తాగుతున్నాడు. చదవండి: హీరో ఔదార్యం.. 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం -
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
ఆదిలాబాద్ : రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం జైత్రాం తండాలో ఇరు వర్గాల ఘర్షణ విషయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సంజీవ్, బ్రహ్మానంద్లను జిల్లా ఎస్పీ విష్ణు సస్పెండ్ చేశారు. -
పోలీస్: ‘దండం పెడుతా.. బయటకు రాకండి’
సాక్షి, ఇచ్చోడ(బోథ్): దండం పెట్టి చెబుతున్న అనవసరంగా బయట తిరగకండి అని ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వారిని కానిస్టేబుల్ ప్రేంసింగ్ ఇలా దండం పెట్టి వేడుకున్నాడు. ఆదిలాబాద్ : జిల్లాలోని ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతం, నేరడిగొండ, ఉట్నూర్ మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలో ఒక కిలో మీటర్ వరకు, మండల ప్రాంతంలో మూడు కిలో మీటర్ల రేడియస్‌లో ఈ దిగ్బంధం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ఏరియాను పూర్తిగా దిగ్బంధం చేశారు. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో పోలీసుల బందోబస్తు డప దాటకుండానే.. ఈ కంటైన్మెంట్ జోన్లలో 19,541 ఇళ్లు ఉండగా, 72,666 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో ఆదిలాబాద్‌లోనే 17,083 ఇళ్లు ఉండగా 63,587 మంది జనాభా ఉన్నారు. మిగితా ఇళ్లు, జనాభా నేరడిగొండ, ఉట్నూర్ మండల కంటైన్మెంట్ జోన్లలో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, ఇతర ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని 19 వార్డులకు ఒక్కొక్క స్పెషలాఫీసర్, ఒక అసిస్టెంట్‌ను నియమించింది. వార్డుల్లో గడప గడపకు కూరగాయలు సరఫరా చేసే విధంగా కొంత మంది కూరగాయలు విక్రయించే వ్యక్తులతో ఒప్పందం చేసుకుని వారి ఫోన్ నంబర్లను ప్రకటించారు. మరో ముగ్గురికి నెగిటివ్... జిల్లాలో మరో ముగ్గురికి నెగెటివ్ రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం వరకు 72 ఫలితాలు రాగా మరో ముగ్గురు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. ఇక ప్రైమరీ కాంటాక్ట్‌లో మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన వారికి సంబంధించి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫలితాలు రావాల్సి ఉంది. ఈనెల 10వరకు జిల్లాలో పాజిటివ్ వచ్చిన 11మందిని గాంధీ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. నెగిటివ్ వచ్చిన 152 మందిని హోమ్ క్వారంటైన్‌కు గురువారం పంపించిన విషయం తెలిసిందే. ఇందులో మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన 65 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దేవసేన వార్డులకు గల్లీ వారియర్స్ ఆదిలాబాద్‌అర్బన్: ఆదిలాబాద్ పట్టణంలోని కంటైన్మెంట్ ఏరియాలో గల 19 వార్డుల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు, పాలు, మందులు గల్లీ వారియర్స్ ద్వారా ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని, అన్ని వార్డులకు గల్లీ వారియర్స్‌ను నియమించాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు.టీటీడీసీలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. అవసరమైన నిత్యావసరాలు గల్లీ వారియర్స్ ద్వారా ఇంటికే పంపాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డేవిడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ మారుతి ప్రసాద్ ఉన్నారు. జిల్లాలో కరోనా వివరాలు.. మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన వారు : 76 నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపినవి : 76 ఫలితాలు వచ్చినవి : 75 (ఈ సంఖ్యలో మూడు ఫలితాలు శుక్రవారం వచ్చినవి కలిపి) పాజిటివ్ : 10 నెగెటివ్ : 65 ఫలితాలు రావాల్సినవి : 01 ప్రైమరీ కాంటాక్ట్ వివరాలు.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల గుర్తింపు : 116 నమూనాలు సేకరించి పంపినవి : 116 ఫలితాలు వచ్చినవి : 88 పాజిటివ్ : 01 నెగెటివ్ : 87 ఫలితాలు రావల్సినవి : 28 -
ఈ పోలీసుల లెక్కే వేరు..!
సాక్షి, ఆదిలాబాద్ : తామున్న ఠాణా వదిలేది లేదంటూ ఆ పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. క్రమశిక్షణకు పెద్దపీట వేసే పోలీసుశాఖలో ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత నెలలోనే బదిలీలు జరిగినప్పటికీ తమ స్థానాల నుంచి కదలడం లేదు. పోలీసులు బదిలీలకు విముఖత చూపుతుండడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. బదిలీలకు ఆదేశాలు.. గత నెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సివిల్ పోలీసులైన పోలీస్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీలకు ఆదేశాలు వెలవడ్డాయి. అంతకుముందు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఎస్పీలు, మంచిర్యాల జిల్లా కిందకు వచ్చే రామగుండం సీపీలు ఆయా జిల్లాల్లోని పీసీలు, హెచ్‌సీలు, ఏఎస్సైల నుంచి బదిలీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అందులో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆయా ఠాణాల్లో పోలీసు అధికారులకు దరఖాస్తులను మరుసటి రోజులోగా సమర్పించాలని ఆదేశాలు రావడంతో అప్పట్లోనే పోలీసు సిబ్బందిలో హైరానా వ్యక్తమైంది. ఆ తర్వాత రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటీవ్ గ్రౌండ్స్‌లో ఉమ్మడి జిల్లాలో సుమారు 70 మంది వరకు బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి ఇతర జిల్లాలకు పలువురిని బదిలీ చేశారు. ఈ మేరకు ఆయా పోలీసులను సంబంధిత డీఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలు, సీఐలు, ఎస్సైలు తక్షణం సంబంధిత పోలీసుస్టేషన్ నుంచి రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు సంబంధిత పోలీసు ఉన్నతాధికారికి జాయినింగ్ లెటర్ ఇవ్వాలని సూచించారు. ఇది జరిగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటి వరకూ పోలీసులు తమ స్థానాల నుంచి రిలీవ్ కాలేదు. ఇప్పుడీ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో చర్చనీయాశంగా మారింది. అసలు ఏం జరుగుతోంది..? పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీ వ్యవహారంలో పోలీసులు పట్టువీడనట్లు తెలుస్తోంది. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటి పోయినందున తాము వెళ్లలేమని పేర్కొన్నారని సమాచారం. 2016లో జిల్లా విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలకు పలువురు పోలీసులను ఆర్డర్ టు సర్వ్ ద్వారా బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో రెండు సార్లు బదిలీలు జరిగాయి. అయితే ఆర్డర్ టు సర్వ్ ద్వారా ఉమ్మడి జిల్లాలోనే బదిలీ అయిన వారు ప్రస్తుతం సొంత జిల్లాలకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు. అయితే గత నెల జరిగిన బదిలీలకు సంబంధించి ఆదేశాలు వెలువడినా పోలీసులు బేఖాతరు చేయడం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. పరిశీలన జరిగిందా..! జిల్లాల విభజనకు ముందే పలువురు పోలీసులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రధానంగా కొన్నేళ్లుగా ఒకే దగ్గర పోస్టింగ్ ఉండడంతో ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. అయితే 2016లో జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖకు సంబంధించి జిల్లా పోలీసు అధికారి (డీపీవో) కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లో ఏర్పాడ్డాయి. మంచిర్యాలకు సంబంధించి రామగుండం కమిషనరేట్ నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి. అప్పట్లోనే పోలీసులకు సంబంధించి సర్వీస్ బుక్‌లను ఆయా జిల్లాల వారీగా డీపీవో కార్యాలయాలకు తరలించారు. ప్రస్తుతం బదిలీల్లో సదరు పోలీసులు చదువుకున్న ప్రాంతానికి సంబంధించి బోనాఫైడ్ సర్టిఫికెట్, పోలీసు శాఖలో అతని సర్వీసుకు సంబంధించిన బుక్‌ను పరిశీలించి వారు ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికి చెందినవారైతే ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏళ్లుగా తమ సొంత ప్రాంతాన్ని విడిచి ప్రస్తుతం వేరే చోట స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారు బదిలీపై వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మరో పక్క ఆర్డర్ టు సర్వ్ ద్వారా కొంత మంది ఇతర జిల్లాలకు వెళ్లిన వారు మూడు సంవత్సరాలైనా తమ సొంత జిల్లాకు బదిలీ చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. -
వివాదాల్లో చిక్కుకుంటున్న ఖాకీలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు బరితెగిస్తున్నారు. తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు మహిళ అక్రమ రవాణా కేసులో నిందితుడైతే.. మరొకరు వివాహేతర సంబంధాలు.. వరకట్న వేధింపుల కేసును ఎదుర్కొంటున్నారు. ఇంకొకరు ప్రేమపేరుతో మహిళను గర్భవతి చేసి పరారీ కావడంతోపాటు ఆమె మృతికి కారణమయ్యాడు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో కేవలం రెండురోజుల్లో జరిగిన ఈ మూడు ఘటనలు పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చిపెట్టాయి. సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ఏర్పడ్డాక అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం శాంతిభద్రతలకు పెద్దపీట వేసింది. పోలీస్స్టేషన్ల ఆధునీకరణ, ఆధునాతన వాహనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ పోలీసు వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేసింది. అవినీతి, ఒత్తిడిని నియంత్రించేందుకు జీతాలు పెంచడంతోపాటు, వారాంతపు సెలవులు కూడా అమలు చేస్తోంది. ఓ వైపు ప్రభుత్వం పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తుంటే.. కొంతమంది పోలీసులు మాత్రం తమ పాత పద్ధతిని వీడడం లేదు. తమ ఖాకీ యూనిఫారాన్ని దౌర్జన్యాలకు, దందాలకు వినియోగిస్తూ.. వివాదాస్పదంగా మారుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో పోలీసులపై ఏకంగా మూడు కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను ప్రస్ఫుటిస్తోంది. అందునా మూడు కేసులూ మహిళలకు సంబంధించినవి కావడం వ్యవస్థను సిగ్గుపడేలా చేసింది. ప్రేమ పేరుతో మోసం, అక్రమ సంబంధం, వరకట్న వేధింపులు, మహిళల అక్రమరవాణ కేసులతో పోలీసులు అప్రతిష్టను మూటగట్టుకున్నారు. వివాదాలు, కేసుల్లో ఉన్న పోలీసులపై నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతుండడంతో మరింత బరితెగిస్తున్నారనే విమర్శలున్నాయి. మరికొంతమంది పోలీసులు సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా రియల్ఎస్టేట్ వ్యాపారంలో తమ బినామీలతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి పోలీసులపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టకుండా.. కఠిన చర్యలు తీసుకుంటేనే వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో జరిగిన సంఘటనల్లో కొన్ని... రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా విక్రయంలో కోర్టు కానిస్టేబుల్ నిందితుడు కావడం కలకలం రేపుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో గిరిజన మహిళను ఉద్యోగం పేరుతో మధ్యప్రదేశ్‌లో విక్రయించిన కేసులో కోర్టు కానిస్టేబుల్ కూడా నిందితుడు. కోర్టు కానిస్టేబుల్‌తో సహా ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. మంచిర్యాల జిల్లాలోని 17వ బెటాలియన్‌లో రిజర్వ్ సీఐగా పనిచేసిన శ్రీనివాస్‌పై లక్సెట్టిపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. శ్రీనివాస్‌పై ఆయన భార్యే ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతోపాటు, వరకట్నం కోసం వేధిస్తున్నారని రెండురోజుల క్రితం అతడి భార్య అవంతిక ఫిర్యాదు చేయడంతో లక్సెట్టిపేట పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. కొమురంభీం జిల్లాలో తాజాగా మరో పోలీసు నిర్వాకం దిగ్భాంతి కల్పించింది. సజన్‌లాల్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగా ర్డుగా పనిచేస్తున్నాడు. ధాంపూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళను ప్రేమపేరుతో గర్భవతి చేశాడు. ప్రసవ వేదనపడుతున్న మహిళను రోడ్డుపై నిర్ధాక్షిణ్యంగా వదిలేయడంతో ఆమె మగబిడ్డను ప్రసవించి మృతి చెందింది. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్సై తైసినొద్దీన్, కానిస్టేబుల్ మాణిక్యరావు, మహిళా కానిస్టేబుల్ మల్లేశ్వరి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు సస్పెండ్ అయ్యారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన పోలీసు డిపార్ట్మెంట్లో సంచలనం కలిగించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొందరు కానిస్టేబుళ్లు అక్రమ దందాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మూడు నెలల క్రితం ఒకేసారి 9మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ బృందంలో ఉన్న ఇద్దరు సీఐలను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మహా రాష్ట్రకు చెందిన ఎస్సై ఒకరు సంతలో రివా ల్వర్‌తో వీరంగం సృష్టించిన సంఘటన కూడా ఇటీవలే జరిగింది. స్థానికులు, స్థానిక పోలీసులు సదరు ఎస్సైని నిలువరించారు. తాజాగా కాళేశ్వరం సందర్శనకు వెళ్లి వస్తున్న కారు ఒకటి చెన్నూరు, సిరోంచ మధ్య బ్రిడ్జిపై డివైడర్‌ను ఢీకొట్టుకొని నిలిచిపోయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదమూ వాటిల్లలేదు. కానీ మహారాష్ట్రకు చెందిన పోలీసు అధికారి ఒకరు వాహనదారులను బెదిరించి రూ.40 వేలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. -
‘ముడుపులకు’ తప్పని భారీ మూల్యం
సాక్షి, ఆదిలాబాద్: గుట్కా.. మట్కా.. అక్రమ దం దాల్లో మామూళ్లకు రుచిమరిగారు.. కేసుల్లో బాధితుల పక్షాన కాకుండా నిందితులకు కొమ్ముకాస్తూ వసూళ్లకు తెగబడ్డారు. స్టేషన్ మెయింటనెన్స్ కోసం వచ్చే నిధుల్లోంచి కమీషన్ కక్కుర్తి.. ఇదీ పో లీసు ఆఫీసర్ల దురాశ.. ఆదిలాబాద్ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి, జైనథ్ ఎస్సై తోట తిరుపతి సస్పెన్షన్ వ్యవహారం పోలీసు శాఖలో కలవరానికి దారి తీసింది. ఓ హోదాలో ఉన్న పోలీసు అధికారుల వసూళ్లకు అడ్డుఅదుపు లేకపోవడంతో కింది పో లీసుల్లో నైతికత కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆది నుంచి అక్రమ వసూళ్లపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కొంతమంది పోలీసు అధికా రుల కారణంగా ఆ శాఖకు మచ్చ వస్తోంది. డీజీపీకి ఫిర్యాదుతోనే.. ఫోర్స్క్వేర్ టెక్నో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట నిరుద్యోగులకు డిజిటల్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కల్పిస్తామని కొంతమంది నమ్మబలికారు. నిజామాబాద్ జిల్లా కు చెందిన నగరం కల్యాణ్‌కుమార్ చైర్మన్‌గా, స య్యద్ సాహెర్ పాషా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఈ కంపెనీకి జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని సెమినార్ నిర్వహించి వసూళ్లు చేస్తూ వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 596 మంది నుంచి రూ.50వేల నుంచి మొదలుకొని రూ.2లక్షల చొప్పున మొత్తంగా సుమారు రూ. 3.57 కో ట్లు ఏజెంట్ల ద్వారా వసూళ్లు చేశారు. దీని పై 2018 ఏప్రిల్ 11న ఆదిలాబాద్ రూరల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆదిలాబాద్ రూరల్ ఎస్సైగా తోట తిరుపతి వ్యవహరిం చారు. ఈ కేసులో పోలీసులు సూత్రధారులను విడిచి స్థానికంగా ఉన్న ఏజెంట్లను అరెస్టు చేశారని తెలుస్తోంది. దీంతో వీరు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డీజీపీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇచ్చోడ సీఐ విచారణ.. ఎస్పీ ఆదేశాల మేరకు ఇచ్చోడ సీఐ శ్రీనివాస్ ఈ కేసు విచారణను రెండు నెలల కింద చేపట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వనస్తలిపురంలో ఉన్న ఫోర్స్క్వేర్ టెక్నో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మెయిన్ బ్రాంచ్‌లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో వారు రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని వసూళ్లు చేసినట్లు తేలింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోనూ వీరి కార్యకలాపాలు విస్తరించి ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ఫిర్యాదు చేయడంతో కేసులో చైర్మన్ నగరం కల్యాణ్‌కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ సాహెర్ పాషా, ఆదిలాబాద్ ఏజెంట్ సయ్యద్ హైమద్లతో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు లక్షల్లో మామూళ్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. రూ.12 లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. దీంతోనే యేడాది కిందట నమోదైన కేసులో ప్రధాన సూత్రధారులను అరెస్టు చేయకుండా కేసును పక్కదారి పట్టించడంలో మామూళ్లు వసూలు చేసిన పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించారన్న అపవాదు మూ టగట్టుకున్నారు. ఈ వ్యవహారం డీజీపీ వరకు వెళ్లడం, డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించడంతో అక్రమార్కుల వ్యవహారం బయట పడింది. ఈ సంఘటన పోలీసు శాఖలో జరుగుతున్న మామూళ్ల వ్యవహారాలకు అద్దం పడుతుంది. అడ్డు, అదుపు లేకుండా సాగుతున్న అక్రమ దందాలకు పోలీ సు అధికారులే వెన్ను కాస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. గతంలో జిల్లాలో పెద్ద ఎత్తున పట ్టబడిన గుట్కా, కలప స్మగ్లింగ్ వ్యవహారాలు సంచలనం కలిగించాయి. అందులోనూ పోలీసు అధికారుల పాత్రపై విమర్శలు వ్యక్తమైనా అవి చడిసప్పుడు కాకుండా మూతపడ్డాయి. రికవరీ చేస్తున్నాం ఫోర్స్క్వేర్ టెక్నో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన సూత్రధారులను అరెస్టు చేయడం జరిగింది. నిరుద్యోగుల నుంచి వారు వసూలు చేసిన డబ్బులను రికవరీ చేస్తున్నాం. నిరుద్యోగ బాధితులకు న్యాయం చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉమ్మడి పలు జిల్లాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. – జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ -
నయా మోసగాళ్లు!
బెల్లంపల్లి: జనాల్లో ఉన్న మూఢనమ్మకాలే ఆ యుధంగా ఓ ముఠా టోపీ పెట్టేందుకు సిద్ధమైంది. ‘మరుగుమందు విక్రయం’ అంటూ పన్నాగం పన్నింది. కానీ, పోలీసుల అప్రమత్తతతో ఆ న యా మోసగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. కట్ చేస్తే.. ఆ ముఠా కటకటాలపాలైంది. ఈ సంఘటన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ వి.బాలు జాదవ్ గురువారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇలా వెల్లడించారు. మరుగుమందు పేరుతో కొందరు జనాలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారమందింది. దీంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్ టీమ్‌తోపాటు తాళ్లగురిజాల పోలీసులు సంయుక్తంగా బెల్లంపల్లి మండలం దుగినేపల్లి గ్రామ శివారులోని ఓ మామిడితోటలో బుధవారం ఆకస్మిక దాడి చేశారు. తోటలో మరుగుమందును అమ్మడానికి ప్రయత్నిస్తున్న తుమ్మిడ మల్లేష్ (చిన్న రాస్పల్లి, దహెగాం మండలం), ఎలుకారి అంజన్న(చిన్న రాస్పెల్లి, దహెగాం మండలం), చింతకింది రమేష్ (నవభారత్కాలనీ, రామకృష్ణాపూర్), పాగిడి మధుకర్ (దుగినేపల్లి, బెల్లంపల్లి), కొండగొర్ల రాజేష్(జన్కాపూర్, కన్నెపల్లి మండలం), జాడి స్వామి (బొప్పారం, నెన్నెల మండలం), కరెకొండ రామన్న(బొప్పారం, నెన్నెల మండలం), జావీద్ (ఐబీ, తాండూర్ మండలం), వొడ్నాల సాయివిజయ్( 24 డీప్ ఏరియా, బెల్లంపల్లి మున్సిపాలిటీ), టేకం గంగు (మాలగొండి, ఆసిఫాబాద్)ను అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు. వారి నుంచి చెట్ల పసరు సీసాలు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పన్నాగమేమిటంటే.. ఈ మోసగాళ్లు తాము తయారు చేసిన మందును ముందు కోడిపై ప్రయోగిస్తారు. అప్పుడు మందు రాసినవారు చెప్పినట్లు నడుచుకుంటుందని నమ్మిస్తారు. ఆ తర్వాత ఈ కుట్రను తమ ప్రయోగంగా చెప్పుకుంటూ మందును ప్రజలకు అమ్ముతారు. అంటే, మనుషులకు కూడా ఈ మందు రాస్తే.. రాసినవారి చుట్టూ రాయించుకున్న వారు తిరుగుతారని నమ్మిస్తారు. ఇలా నమ్మించి మందును అమ్మి కోట్లలో దండుకోవడమే వారి వ్యూహం. కేవలం ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో మరుగుమందు పేరుతో సదరు ముఠా ఈ పథక రచన చేసినట్లు ఏసీపీ వివరించారు. మూఢనమ్మకాలు వీడాలి.. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ప్రజలు నమ్మినంతా కాలం ఇలాంటి నయా మోసగాళ్లు పుడుతూనే ఉంటారని, ఇప్పటికైనా వీరితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ సీఐ సాగర్, కానిస్టేబుళ్లు రాజేందర్, దేవేందర్, శేఖర్, సదానందం, హోంగార్డులు హైదర్, మహాంకాళితోపాటు తాళ్లగురిజాల పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. పట్టుబడ్డ నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి రూరల్ సీఐ అల్లం నరేందర్, తాళ్ల గురిజాల ఎస్సై సీహెచ్.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. బాలుజాదవ్, ఏసీపీ -
మూగబోనున్న ‘మైకు’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారాలతో అట్టుడికిన పల్లెలు, పట్టణాలు మరికొద్ది గంటల్లో పూర్వపు స్థితికి చేరనున్నాయి. ఈనెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండడంతో బుధవారం సాయంత్రంతో మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు అన్ని పార్టీలు ప్రచారాలు బంద్ చేయాల్సిందే. ఇక మిగిలిన కొద్ది గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రణా ళికలు సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు తుది ప్రచారాన్ని అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన పార్టీల ముఖ్య నాయకులెవరూ ప్రచారానికి వచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ... అందుబాటులో ఉన్న నేతలతోనే అభ్యర్థులు ఉనికిని చాటేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారానికి తెరపడనుంది. ప్రలోభాలకు లేచిన తెర నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి బూత్‌ల వారీగా నియమితులైన నాయకులు, స్థానిక పెద్దలు ఇప్పటికే ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాల్లో మునిగిపోయారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ జరిగే 7వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని వచ్చిన ఆదేశాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ‘సరుకు’ను రహస్య ప్రదేశాలకు తరలించారు. మండల కేంద్రాలు, పట్టణాల నుంచి మద్యం సీసాలు బూత్‌ల వారీగా తరలిపోయాయి. బుధవారం రాత్రి నుంచి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రెబల్స్‌గా పోటీ చేస్తున్న ముఖ్య నాయకులు ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. బూత్‌ల వారీగా పర్యవేక్షణకు సంబంధించి అన్ని పార్టీలు డబ్బుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశాయి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పోలింగ్‌కు మరో రెండ్రోజులే గడువు మిగిలి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, సహాయ, రిటర్నింగ్ అధికారులు పోలింగ్ ప్రక్రియకు çఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రచారం ముగిసిన వెంటనే పోలింగ్ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకొని అధికారులకు అప్పజెప్పనున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు అవసరమైన అధికారుల నియామకాలు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో వెబ్‌కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సాయంత్రం 4గంటల వరకే కొనసాగనున్నందున మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్నికల పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించిన అధికారులు ఇప్పటికే విధుల్లో బిజీగా ఉన్నారు. పెరిగిన పోలీస్ నిఘా.. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీని అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఎస్పీలతో పాటు మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఇందుకోసం పనిచేస్తున్నాయి. బస్తీలు, గ్రామాల్లో నగదు, మద్యం పంపిణీకి సం బంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఈ పనిలో తలమునకలైంది. బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి తరలిస్తున్న రూ.50 లక్షల నగదును సోమవారం రాత్రి మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేష్ సీజ్ చేయగా, అంతకు ముందు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో పరిధిలో ఓ పార్టీకి చెందిన వ్యక్తి నుంచి రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే మరో రూ.20 లక్షలు కూడా పట్టుబడ్డాయి. ఇప్పటికే మద్యం పంపిణీ చేస్తున్న 8మందిపై కేసు నమోదు చేసి 575 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా నిఘా కొనసాగుతుందని ఆదిలాబాద్‌కు చెందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. మద్యం, మనీ పంపిణీలో ఏ పార్టీని, అభ్యర్థిని ఉపేక్షించవద్దని కచ్చితమైన ఆదేశాలు ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. -
చూసీచూడనట్లు..
జైనథ్(ఆదిలాబాద్): ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు గుండా అక్రమంగా నగదు, లిక్కర్, దేశీదారు, ఇతరాత్ర నిషేధిత మత్తు పదార్థాల రవాణాను నిరోధించడానికి ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వచ్చే కార్లను మాత్రమే తనిఖీ చేస్తుండడంతో ‘సగం తనిఖీలే’ జరుగుతున్నాయి. లారీలు, భారీ కంటైనర్లు, ఇతర వాహనాలను పట్టించుకోవడం లేదు. అంతర్ జిల్లా తనిఖీ కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తనిఖీల కోసం ప్రత్యేకంగా నియమించిన ఎస్ఎస్ టీం సిబ్బంది కొరత ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో తనిఖీల ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా గట్టి నిఘా కోసం మూడు అంతర్రాష్ట్రీయ, ఆరు జిల్లా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజా, బేల మండలం శంకర్‌గూడ, బోథ్ మండల ఘన్పూర్ వద్ద అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీటితో పాటు దేవాపూర్, రోల్మామడ, గుడిహత్నూర్, ఇచ్చోడ సిరికొండ ఎక్స్‌రోడ్, గంగాపూర్, ఇంద్రవెళ్లి వద్ద జిల్లా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో కేంద్రం వద్ద మూడు బృందాలు, మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయి. సరిపోని సిబ్బంది.. తనిఖీ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఒక్కొక్క షిఫ్టులో ఒక కెమెరామెన్, ఒక కానిస్టేబుల్, ఒక అధికారి మాత్రమే ఉండడంతో తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేవలం కార్లను మాత్రమే ఆపి తనిఖీలు చేస్తున్నారు. లారీలు, కంటైనర్లు, ఇతర వాహనాలను దర్జాగా వెళ్లనిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తేగాని ఇతర వాహనాల జోలికి వెళ్లకపోవడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే ఆస్కారం కనిపించడం లేదు. లారీలు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తే కనీసం 15 నిమిషాల నుంచి అరగంట వరకు సమయం పట్టడం, తనిఖీల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడం, సరిపడా సిబ్బంది కూడా లేకపోవడం వంటి కారణాలతో పూర్తిస్థాయి తనిఖీలు జరగడం లేదు. అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రాల వద్ద.. జిల్లాలోని మూడు అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రా ల వద్ద పట్టుబడిన నగదు వివరాలు ఇలా ఉన్నా యి. బోథ్ మండలంలోని ఘన్పూర్ చెక్‌పోస్టు వద్ద రెండుసార్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి రూ.2.45లక్షలు, మరోసారి రూ.3.22లక్షలను పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ మొత్తం రూ.5.67లక్షలను సీజన్ చేశారు. అలాగే జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద ఇప్పటి వరకు రూ.10.14కోట్లు పట్టుబడ్డాయి. బేల మండలంలోని శంకర్‌గూడ తనిఖీ కేంద్రం వద్ద రూ.5.45లక్షల నగదు పట్టుబడింది. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.11.36కోట్ల నగదు, 1565 లీటర్ల మద్యం పట్టుబడింది. ఈ నాలుగు రోజులైనా.. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు సా ధారణంగా మద్యం, నగదు అక్రమరవాణా పెద్ద మొత్తంలో జరుగుతుందని పలువురి అభిప్రా యం. చివరి రోజుల్లోనే గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఈ రోజుల్లో గట్టి బందోబస్తుతో పాటు తనిఖీలు చేపడితే అక్రమ రవాణాను చాలా వరకు అరికట్టవచ్చని భావిస్తున్నారు. కేవలం కార్లలోనే కాకుండా ఇతర వాహనాల్లోనూ డబ్బు తరలించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని, లారీలు, కంటైనర్లను సైతం క్ష్ణు్ణంగాతనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు. అన్ని వాహనాలు తనిఖీ చేస్తాం.. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 తనిఖీ కేంద్రాల్లో అన్నిరకాల వాహనాలను తనిఖీ చేసేలా ఆదేశిస్తాము. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాం. ఎన్నికల్లో ఎలాంటి అక్రమ ర వా ణాకు ఆస్కారం లేకుండా ఉం డేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ఈ కేంద్రాలతో పాటు రాత్రి వేళలో అదనపు తనిఖీ బృందాలను కూడా తిప్పు తున్నాము. – నర్సింహారెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
సమాచారం ఇస్తే రూ.5లక్షల బహుమతి
సాక్షి, ఆసిఫాబాద్: మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి రూ.5లక్షల బహుమతి ఇస్తామని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇద్దరు యాక్షన్ టీం సభ్యులు పట్టుబడ్డ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ గోద్రుతో కలిసి నిర్వహించిన సమావేశంలో నిషేధిత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సభ్యుల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం సభ్యులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. యాక్షన్ టీంల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజాపోరాటం ముసుగులో శాంతి యుతవాతావరణం విచ్ఛిన్నం చేసేలా మావోయిస్టులు ప్రజాఆస్తులను విధ్వంసం చేసి సాధించేది శూన్యమన్నారు. జిల్లాలో నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తులు యాక్షన్ టీమ్ సభ్యులుగా ఏర్పడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా చేసుకొని పనిచేయుటకు అవకాశం ఉన్నందున ముందస్తుగా జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న గ్రామాల్లో వారి కదలికలను పసిగట్ట వారి చర్యలను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టులను గుర్తించేందుకు వీలుగా వారి ఫొటోలతో కూడిన పోస్టర్‌ను ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విడుదల చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోస్టర్లలో ఉన్న మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి పారితోషికం ఇవ్వడంతోపాటు, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా మావోయిస్టుల చిత్రాలను చూపించారు. సమావేశంలో రిజర్వ్ ఇన్పెక్టర్ శేఖర్‌బాబు, ఐటీకోర్ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
తానూరు(ముథోల్): మండలంలోని మొగ్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం వివరాలు.. గ్రామానికి చెందిన పశువుల కాపరులు శనివారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఓ సంచిలో ఉన్న అస్థిపంజరం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంçఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించారు. మూడు నెలల క్రితం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సంచిలో మృతదేహన్ని తీసుకువచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముథోల్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర వాసిగా అనుమానం ... నాందేడ్ జిల్లా నాయేగావ్ తాలూకా కుంబర్‌గావ్ గ్రామానికి చెందిన సంతోష్‌తో తానూరు మండలం మొగ్లి గ్రామానికి చెందిన రుక్మాణి బాయితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. రుక్మిణిబాయి ఏడాది నుంచి మొగ్లి గ్రామంలోని తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. మూడు నెలల క్రితం సంతోష్ మొగ్లికి వచ్చి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సంతోష్ అచూకీ తెలియడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని అస్తిపంజరాన్ని పరిశీలించారు. సంతోష్ మృతదేహం కావచ్చని అనుమానిస్తున్నారు. అస్థిపంజరాన్ని ల్యాబ్‌కు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలని బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదిలాబాద్: రూ.10 కోట్లు పట్టివేత
-
రూ.10 కోట్లు పట్టివేత
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో నగదు అక్రమ తరలింపు మొదలైంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు డబ్బు అక్రమంగా తరలుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి రసీదులూ లేకుండా తరలిస్తున్న రూ.10 కోట్ల నగదును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్నడస్టర్ వాహనం (కెఏ46 ఎం 6095) డిక్కీలో బెంగళూర్‌కు చెందిన వినోద్‌శెట్టి, శబరీష్ ఈ మొత్తాన్ని తరలిస్తుండగా జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా జామ్ నుంచి హైదరాబాద్‌కు ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు నిందితులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పట్టుకున్న ఇద్దరిని పోలీసుల విచారిస్తున్నారు. గన్నీ సంచుల్లో నోట్ల కట్టలు.. తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో ఒకేసారి రూ.10 కోట్లను తరలిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కోసమే ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం నుంచి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లావాదేవీలకు సంబంధించి సరైన వివరాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించడాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో పిప్పర్వాడ వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేసి శుక్రవారం తనిఖీలు చేస్తున్నారు. జైనథ్ ఈవోపీఆర్డీ సంజీవ్‌రావు, ఏఎస్సై జీవన్ వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న డస్టర్ వాహన డిక్కీని తెరిచారు. ఐదు తెల్లటి గన్నీ సంచులు ఉండటంతో అనుమానించి వాటిని విప్పి చూశారు. రూ.500, రూ.2వేల నోట్ల కట్టలు క్రమపద్ధతిలో పేర్చి ఉన్నాయి.ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, జైనథ్ సర్కిల్ సీఐ స్వామి, ఎస్సై తిరుపతి హుటహుటిన చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. నగదును తరలిస్తున్న వినోద్‌శెట్టి, శబరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 కోట్ల మొత్తాన్ని లెక్కించి రశీదులు అడుగ గా, నిందితులు ముఖాలు తేలేశారు. వాహనంతోపాటు నగదును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ వాహనం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు నిర్ధారించారు. ఆ నగదు ఎవరిది, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో, ఎందుకోసమో తెలియాల్సి ఉంది. శనివారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరి కోసం ఈ సొమ్ము..? దసరా ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతాయి కాబట్టి, పోలీసు యంత్రాంగం కూడా పండుగ హడావుడి నుంచి బయటికి రారనే ఆలోచనతో భారీ మొత్తంలో నగదును తరలించే ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్ జిల్లా జామ్ నుంచి కారులో వస్తున్నట్లు నిందితులు చెబుతుండటం గమనార్హం. శనివారం తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పర్యటన ఉంది. భైంసా, కామారెడ్డిలో ఆయన బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుపడటం చర్చనీయాంశం అయింది. అలాగే నాగ్‌పూర్ ఎంపీగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. దీంతో పోలీసులు రాజకీయంగా ఈ కోణాల్లో విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం పోలీసులు అధికారికంగా మీడియాకు వివరాలు అందించే అవకాశం ఉంది. -
పల్లె పోరు సాధ్యమేనా..!
ఆదిలాబాద్‌అర్బన్: స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయా..? హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందుకు వెళ్తే ఎన్నికలకు నిర్వహించాల్సిందేనని ఆదేశించవచ్చా..? ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల సీజన్ చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వíహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పల్లె పోరుకు సంబంధించి ఈసీ ఎలాంటి సమాచారం అందినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా సమాయత్తం అవుతోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జిల్లా యంత్రాంగం డిసెంబర్లో జరగనున్న సాధారణ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. సమీక్షలు, సమావేశాలు, శిక్షణలు, ఓటరు యంత్రాల వినియోగంపై ప్రజలకు అవగాహనలు కల్పించడంలో తీరిక లేకుండా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వచ్చే నెల 12న నోటిఫికేషన్, డిసెం బర్ 7న పోలింగ్ చేపట్టాలని సీఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11న ఓట్ల లెక్కిం పు చేపట్టనున్నారు. ఈ లెక్కన ఇప్పటి నుంచే లెక్కేసుకున్నా.. 2019 జనవరి 11లోగా గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు పూర్తి కావాలి. అంటే నెలలో పల్లెపోరును నిర్వహించడం సాధ్యమేనా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్వహణకు ఈసీ నుంచి ఆదేశాలు వస్తే ఒకేసారి అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పవచ్చు. దీంతో ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. అంతాసిద్ధం.. ప్రభుత్వం గత మే, జూన్ మాసాల్లో పంచాయతీల ఎన్నికల నిర్వహణకు హడావుడి చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు నెలల క్రితమే ఎన్నికల నిర్వహణకు అన్ని సిద్ధం చేశారు. జిల్లాలో పాత 243 గ్రామ పంచాయతీలకు 2013లో ఎన్నికలు జరిగాయి. అప్పటి పోరులో గెలిచిన వారు సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టి ఈ యేడాది ఆగస్టు ఒకటో తేదీతో ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా మరో 226 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. అన్ని కలుపుకొని ప్రస్తుతం జిల్లాలో పంచాయతీల సంఖ్య 467కు చేరింది. ఈ పంచాయతీల పరిధిలో 3,822 వార్డులు ఉన్నాయి. పంచాయతీలతోపాటు వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు గత జూలైలో అధికారులు అన్ని సిద్ధం చేశారు. 4 వేలకుపైగా బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయగా, పోలింగ్ కేంద్రాలనూ గుర్తించారు. ఎన్నికల్లో వినియోగించే బ్యాలెట్ బాక్సులు మనవద్ద అందుబాటులో లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి తెప్పించి పోరుకు సిద్ధంగా ఉంచారు. గత జూలైలో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 3,36,647 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,68,741 మంది ఉండగా, 1,67,825 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 81 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు సిద్ధం చేసిన ఓటరు జాబితాలో స్పష్టంగా ఉంది. జైనథ్ మండలంలో అత్యధికంగా 33,577 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా మావలలో 3,370 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది ఓటర్ల జాబితాతో పోల్చుకుంటే ఇప్పుడా సంఖ్య కొంత పెరిగింది. ఇదిలా ఉండగా, జిల్లాలోని బజార్హత్నూర్, భీంపూర్, బోథ్, గాదిగూడ, ఇచ్చోడ, నేరడిగొండ, తలమడుగు, తాంసి మండలాల్లో పంచాయతీ ఓటర్లు పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉండడం గమనార్హం. వరుస ఎన్నికలేనా..? మూడు నెలల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్ని కల నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తే వరుసగా ఎన్నికలు జరగనున్నాయని చెప్పవచ్చు. ఈ యేడాది డిసెంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, జనవరిలో గ్రామ పంచాయతీలకు జరుగుతాయి. పార్లమెంట్ సభ్యుల పదవీ కాలం కూడా వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో పూర్తి కానుండడంతో అప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించి 2019 ఆగస్టుతో ఐదేళ్లు పూర్తి కానుంది. అంతకు ముందే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇక మున్సిపాలిటీలకు కూడా 2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికలు జరిగాయి. అంటే అవి కూడా నిర్వహించక తప్పదు. దీనిని బట్టి చూస్తే ఇప్పటి నుంచి యేడాదంతా ఎన్నికల సందడి మొదలు కానుందనడంలో సందేహం లేదు. పంచాయతీ పోరుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యంత్రాంగానికి, ఎన్నికల సిబ్బందికి కొంత ఊరట కలిగే అవకాశాలున్నాయి. యంత్రానికి పరీక్షే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నుంచి ఆదేశాలు వస్తే జిల్లా యంత్రాంగానికి ఎన్నికల నిర్వహణ ఓ సవాలుగా మారనుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో నోడల్ అధికారులూ నియామకం అమయ్యారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ వేగవంతం కానుంది. మరో పక్కా ప్రభుత్వం ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఆయా ప్రభుత్వ అధికారులకు స్థాన చలనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాపై అవగాహన కలిగిన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లనుండడంతో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి పరీక్షగా మారే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. -
ప్రజల కోసమే పోలీసులు : ఎస్పీ
ఆదిలాబాద్: ప్రజల కోసమే పోలీసులున్నారని ప్రజా సంక్షేమమే తమ ఆకాంక్ష అని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. సోమవారం తిర్యాణి మండలంలోని రోంపల్లి, గుండాల, మంగి గ్రామాల్లో పోలీసులు జనమైత్రి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో రోడ్డు, తాగునీరు, విద్యా, వైద్యం తదితర సౌకర్యాలు ఏర్పడినపుడే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించి గ్రామాల వెనకబాటు తనానికి కారణం కావద్దన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లకు మంచి భవిష్యత్‌ను చూపించాలని మావోయిస్టుల వైపు అకర్షితులు కాకుండా చూడాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగి గ్రామంలో సెల్ టవర్, రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 23 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పునరావాసం కల్పించి ప్రభుత్వం ఉపాది కల్పిస్తుందన్నారు. యువకుల కోసం పోటీపరీక్షల గైడెన్సు, పుస్తకాలు శిక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం అడిషల్ ఎస్పి పనసారెడ్డి మాట్లాడుతూ, ఖైరిగూడలో బల్లార్షను మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారని అతడు ఏడు సంవత్సరాల నుంచే పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడ ని వారి లేఖలో పేర్కొన్నార ని అన్నారు. ఏడేళ్ల కుర్రాడు పోలీస్‌లకు సమాచారం ఇస్తాడా అని ప్రశ్నించారు. రోంపల్లి, మంగి గ్రామాల్లో పోలీ స్ అధికారులు ప్రజలతో కలిసి అల్పాహారం, భోజనం చేశారు. రోంపల్లి నుంచి గుండాలకు కాలినడకన పోలీస్ అధికారులు చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు. బెల్లంçపల్లి డీఎస్పీ రమణారెడ్డి, సీఐ కరుణాకర్, ఎస్సైలు బుద్దేస్వామి, అశోక్ జనమైత్రి గ్రామపోలీస్ అధికారులు కిరణ్, శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ మెస్రం గణేశ్ పాల్గొన్నారు. -
ఏఎస్పీ రాధికకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: జీరో డిగ్రీ ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే అంటార్కిటికా ప్రాంతానికి వెళ్లాలని ఉందని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జి.ఆర్.రాధిక అన్నారు. ఆర్థిక సహకారం అందింతే భవిష్యత్తులో ఆ ప్రయత్నం చేస్తానన్నారు. ఎవరెస్ట్ అధిరోహణ క్రమంలో కొన్ని కష్టాలు ఎదురైనా అందరి ప్రోత్సాహంతో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆదిలాబాద్ అదనపు ఎస్పీ రాధికను డీజీపీ అనురాగ్‌శర్మ అభినందించారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి తిరిగి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు కుటుంబసభ్యులు, పోలీసు క్రీడావిభాగం అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఏప్రిల్ 6న బయలుదేరిన రాధిక కఠ్మాండు మీదుగా తొలి బేస్ క్యాంప్‌ను ఏప్రిల్ 19న చేరుకున్నారు. అనంతరం వివిధ పర్వత అంచులను చేరుకుంటూ ఈ నెల 20న ఎవరెస్ట్‌ను అధిరోహించారు. -
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్లో దొంగ నోట్ల ముఠాగుట్టును పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా... ఇద్దరు పరారైయ్యారు. దాంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీలలో కొన్ని మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ నగర సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డిని ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఆయనను తిరిగి సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణ్ జోషీని సెంట్రల్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, ఆయనను ఆదిలాబాద్ ఎస్పీగా నియమించారు. ప్రస్తుతం తరుణ్ జోషీ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ డీసీపీగా తాత్కాలికంగా కొనసాగుతున్నారు. -
కారులో తరలిస్తున్న రూ.9 లక్షలు సీజ్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులోభాగంగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కారులో తరలిస్తున్న రూ. 9 లక్షలను గురువారం పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆ నగదుతోపాటు కారును సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలు వెల్లడించడంలో వాహనం డ్రైవర్ మీన మేషాలు లెక్కించడంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 45 లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.