సాక్షి, ఆదిలాబాద్: ఆవేశంలో అక్క ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. చెల్లెలు అక్క మృతిని తట్టుకోలేక టాయిలెట్ క్లీనర్ ద్రావణం తాగేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అక్క మృతి చెందగా చెల్లెలు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్‌లో చోటుచేసుకుంది. అయితే వారు ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది.
.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సంజయ్‌నగర్‌లో ఉంటున్న అక్క రేఖశ్రీ మంగళవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యతో అక్క మృతి చెందడంతో ఆమె చెల్లెలు దీపశ్రీ తట్టుకోలేకపోయింది. అక్క మృతిని కళ్లారా చూసినా దీప తాను కూడా చచ్చిపోతానని బాత్రూమ్‌లో ఉండే టాయిలెట్ క్లీనర్ తాగేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే దీపశ్రీని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీప పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషాదానికి కారణం కుటుంబ కలహాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చదవండి: నా భార్యకు భర్తగా కొడుకు పేరా?
అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు
Published Tue, May 4 2021 9:35 PM | Last Updated on Tue, May 4 2021 9:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment