కుటుంబంతో గొప్పగా బతకాలనుకున్నా...
ఎన్నో ప్రయత్నాలు చేశా.. సక్సెస్ కాలేదు
ఏడెనిమిది లోన్‌యాప్‌ల ఈఎంఐలు కట్టలేదు
సెల్ఫీ వీడియోలో కారణాలు చెప్పి యువకుడి ఆత్మహత్య
శ్రీరాంపూర్: జీవితంలో సక్సెస్ కావాలి..డబ్బు సంపాదించాలి.. కుటుంబ సభ్యులను ఉన్నత స్థితిలో ఉంచాలంటూ ఆ యువకుడు ఎన్నో కలలు క న్నాడు. మొదట్లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి లా భాలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత తెలిసిన వారి వద్ద, లోన్‌యాప్‌లలో అప్పు చేసి పెట్టిన పెట్టుబడు లు ఆవిరయ్యాయి. మూడేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నా కలిసి రావడం లేదని.. లోన్‌యాప్‌ల వేధింపులు తాళలేక.. ఉరేసుకొని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో శనివారం వెలుగులోకి వచి్చంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం..
శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌కు చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి, 9 నెల ల కుమారుడు ఉన్నారు. భార్య కొడుకుతో కలిసి రాఖీ పండుగకు ఊరెళ్లింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు వైరు తో ఉరేసుకున్నాడు. ఇంటి సమీపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. శనివారం ఉదయం శ్రీకాంత్ తమ్ముడు సాయికుమార్ ఇంటికొచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా త లుపులు తెరిచి చూడగా, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి.
సెల్ఫీ వీడియో తీసుకొని..
శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను ఒక కొడుకుగా, అన్నగా, భర్త గా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. లైఫ్‌లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. సక్సెస్ కాకపోగా, లోన్‌యాప్స్‌లో లోన్ తీశాను. బయట కూడా అప్పు తీసుకొచ్చాను. ఇంట్లో వారిని గొప్ప గా ఉంచాలి. మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్‌లో డబ్బులన్నీ పెట్టా. ట్రేడింగ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మాఫ్రెండ్ వాళ్ల అన్న దగ్గరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నా. మా డాడీ దగ్గర రూ.2 లక్షలు అట్లనే వేర్వేరు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా.
అన్నీ పోగొట్టుకున్నా. నాకు చాలా అప్పులున్నాయ్. దానికి తోడు ఈ లోన్‌యాప్స్. ప్రతి నెలా ఈఎంఐలు కచి్చతంగా కట్టేసిన. ఈ నెలొక్కటే కట్టలేదు. ఏడెనిమిది యాప్‌ల దాకా కట్ట లేదు. ఫోన్లలో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తామని వేధించారు. కుటుంబ సభ్యుల వద్ద మొహం చూపెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ను’ అని ఆ వీడియోలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment