
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం నందివాడలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు, తండ్రి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు వివరాలు ప్రకారం
శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి తీసుకెళ్లగా, రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆయనకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కాల్ లిప్ట్ చేయలేదు. మళ్లీ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, తండ్రి మృతదేహాలు కనిపించాయి. తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి: వారే లేని.. నేనెందుకని..
Comments
Please login to add a commentAdd a comment