
భర్త, కొడుకుల మృతి తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
పెదవేగి : రెండు రోజుల క్రితం కోడి పుంజులను ఈత కొట్టించేందుకు కాలువలోకి దిగిన భర్త, ఇద్దరు కుమారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుంటుంబంలో మిగిలిన ఇల్లాలు జీవితంపై విరక్తి చెంది శనివారం బలవన్మరణానికి పాల్పడింది. ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించడంతో పెదవేగి మండలం కవ్వగుంటలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కవ్వగుంటకు చెందిన శెట్టిపల్లి దేవి (38) శుక్రవారం ఉదయం తన ఇంటి వద్ద బాత్రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రెండు రోజుల క్రితం ఆమె భర్త, ఇద్దరు పిల్లలు తమ ఇంటి సమీపంలో ఉన్న పోలవరం కుడి కాలువలో కోడి పుంజులను ఈదించడం కోసం దిగి ప్రమాదవ శాత్తూ మునిగిపోయారు. వారి మృతితో ఒంటరి అయిన దేవి భర్త, పిల్లలు లేని జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment