woman death
-
ఇద్దరు పిల్లలున్నా ఫర్వాలేదు!
దుబ్బాకటౌన్: వివాహం జరిగిన వ్యక్తిని ప్రేమించిందని తల్లిదండ్రులు మందలించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాయపోల్ పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుండారం అంజలి(20) అదే గ్రామానికి చెందిన అయ్యగల్ల నాగరాజుతో ప్రేమలో పడి 3 నెలల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటికే నాగరాజుకి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు కనిపించడం లేదని అంజలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల తర్వాత అంజలి నాగరాజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గ్రామస్తులు, కుటుంబ సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇటీవల మళ్లీ ఇద్దరూ ఫోన్ మాట్లాడుతుండటంతో అంజలిని తల్లిదండ్రులు మందలించారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువతి మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికొచ్చి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి బీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. -
ప్రేమ పెళ్లి.. ఆపై అనుమానంతో భార్యను..
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, నాగార్జుననగర్ కాలనీ రోడ్డు నెంబరు–5లో గత శనివారం వెలుగుచూసిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతోనే హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. సోమవారం ఎస్సై వెంకన్న కేసు వివరాలను వెల్లడించారు. కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణ, టూగూర్ స్నేహలు 2021లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమై 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు పుట్టి చనిపోయాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవల కారణంగా కొద్ది రోజుల పాటు వేరుగా ఉండి నెల రోజుల క్రితమే తిరిగి నాగార్జుననగర్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య 7 నెలల గర్భవతి అని తెలుసుకున్న భర్త ఆమెను అనుమానించాడు. శారీరకంగా దూరంగా ఉన్నా గర్భం రావడంపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న తెల్లవారు జామున 5 గంటల సమయంలో మంచంపై పడుకున్న భార్య ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఘటన స్థలంలో సిలిండర్ ఆన్‌చేసి సహజమరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. ఆమె మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు సోమవారం మృతురాలి భర్తను కాచిగూడలోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే హతమార్చినట్లు నేరం అంగీకరించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. -
వారే లేని.. నేనెందుకని..
పెదవేగి : రెండు రోజుల క్రితం కోడి పుంజులను ఈత కొట్టించేందుకు కాలువలోకి దిగిన భర్త, ఇద్దరు కుమారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుంటుంబంలో మిగిలిన ఇల్లాలు జీవితంపై విరక్తి చెంది శనివారం బలవన్మరణానికి పాల్పడింది. ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించడంతో పెదవేగి మండలం కవ్వగుంటలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవ్వగుంటకు చెందిన శెట్టిపల్లి దేవి (38) శుక్రవారం ఉదయం తన ఇంటి వద్ద బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రెండు రోజుల క్రితం ఆమె భర్త, ఇద్దరు పిల్లలు తమ ఇంటి సమీపంలో ఉన్న పోలవరం కుడి కాలువలో కోడి పుంజులను ఈదించడం కోసం దిగి ప్రమాదవ శాత్తూ మునిగిపోయారు. వారి మృతితో ఒంటరి అయిన దేవి భర్త, పిల్లలు లేని జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
గది తలుపులు తీయగా.. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం! ఒక్కసారిగా..
మెదక్: పరిశ్రమలో పని చేయడానికి వచ్చిన మహిళ హత్యకు గురైంది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. కాళ్లకల్ గ్రామ శివారులో సర్వేనంబర్ 86లో గల గీతా ప్యానల్ ప్రొడక్ట్ పరిశ్రమ ఉంది. కాగా రెండేళ్ల క్రితం సూరజ్, రజనీదేవి చౌహాన్ (40) పరిశ్రమలో పని కోసం వచ్చారు. వారికి పని ఇచ్చి పరిశ్రమలోనే లేబర్ గదిని కేటాయించినట్లు పరిశ్రమ యజమాని ప్రవీణ్ పటేల్ తెలిపారు. కాగా ఈ నెల 19న సూరజ్ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. కాగా బుధవారం గదిలో నుంచి దుర్వాసన రావడంతో కార్మికులు యజయాని ప్రవీణ్ పటేల్‌కు సమాచార మిచ్చారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పరిశ్రమ వద్దకు వచ్చి గది తలుపులు తీయగా కుళ్లిన స్థితిలో రజనీదేవి మృతదేహం కనిపించింది. దీంతో ఈమెను సూరజ్ హత్య చేసి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామానికి చెందిన ప్రవళిక (25) శామీర్‌పేట్ మండలం, లాల్‌గడీ మలక్‌పేట్‌కు చెందిన రమేశ్ ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతనం కలిగారు. కాగా ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవళిక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైయిందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని సీఐ రాజ్‌గోపాల్‌రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహిత అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: పెళ్లయిన ఆరు నెలలకే వివాహిత మృతి చెందిన సంఘటన మెళియాపుట్టి మండలంలోని ముకుందాపురం పంచాయతీ పరశురాంపురంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పరశురాంపురం గ్రామానికి చెందిన జన్ని కృష్ణారావుతో పొగడవెల్లి గ్రామానికి చెందిన జన్ని అశ్విని (21) మార్చిలో వివాహం జరిగింది. అశ్విని సోమవారం మధ్యాహ్నం బహిర్భూమికని గ్రామశివారు ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నోటి నుంచి నురగలు కక్కుతూ, మాట్లాడలేని స్థితిలో ఉండటంతో వెంటనే కుటుంబసభ్యులు ఆటోలో మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరారు. ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించనున్నట్లు తెలిసింది. -
భర్త విదేశాల్లో.. భార్య ఆత్మహత్య.. అత్తామామలపై అనుమానం
ఇచ్ఛాపురం రూరల్: అత్తమామల వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన పైలా తులసయ్య, మోహినీల కుమార్తె నీలాపు మీనాకుమారి(22)ని ఏడేళ్ల కిందట అదే మండలం నీలాపుపుట్టుగ గ్రామానికి చెందిన నీలాపు మోహన్‌బాబుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఐదేళ్ల బాబు తులసీదాసు, రెండున్నరేళ్ల పాప ధనుశ్రీలు ఉన్నా రు. ఏడు నెలల కిందట భర్త మోహన్‌బాబు విదేశాలకు వలస వెళ్లిపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలైనట్లు మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నా రు. మామ జగ్గారావు, అత్త అన్నపూర్ణలు ప్రతి రోజు తమ కుమార్తెతో గొడవలకు దిగడంతో పలుమార్లు సర్ది చెప్పినట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం మరోమారు గొడవ కావడంతో మీనాకుమారి సా యంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటిలోనే ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డ చావుకు అత్తింటి వారే కారణమంటూ గ్రామంలో పెద్దలతో పంచాయతీ పెట్టారు. తమ కోడలు కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని అత్తామామలు పంచాయతీలో చెప్పడంతో ఇరు కుటుంబాల మ ధ్య రాజీ కుదరలేదు, మృతురాలి తల్లి పైలా మోహిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఇంటిని పరిశీలించింది. అనంతరం మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహిత అనుమానాస్పద మృతి
కర్ణాటక: వివాహిత యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన యలహంక ఉపనగరలో జరిగింది. యలహంక న్యూటౌన్‌లో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తి భార్య రేఖ (24) ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో మృతిచెందింది. తమిళనాడుకు చెందిన సంతో ష్,రేఖ దంపతులు యలహంకలో నివాసముంటూ చిన్నపాటి పనులు చేసుకునేవారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. ఇటీవల సంతోష్ రేఖను పుట్టింటికి వెళ్లి మరింతగా కట్నం డబ్బులు తీసుకురావాలని పీడించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరిగి సంతోష్ రేఖను హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. రేఖ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కన్నడ సినీ నటుడు నాగభూషణ్ అరెస్టు
బెంగళూరు: కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి, ఒక మహిళ మరణానికి కారణమైన కన్నడ సిటీ నటుడు నాగభూషణ్ ఎస్.ఎస్.ను పోలీసులు అరెస్టు చేశారు. నాగభూషణ్ కారు శనివారం రాత్రి బెంగళూరులోని వసంతపుర ప్రధాన రహదారిపై కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులపైకి దూసుకెళ్లింది. వారిద్దరూ ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లి, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ సమయంలో కారును నాగభూషణ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ప్రేమ మృతిచెందగా, కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కారును నడిపిన నాగభూషణ్‌ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు అతడి రక్తపు నమూనాలు సేకరించామని అన్నారు. కారును స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
కర్నూలు: కొక్కెరంచ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. కొక్కెరంచ గ్రామానికి చెందిన నరేంద్రగౌడుకు పాములపాడు మండలం బానకచెర్ల గ్రామానికి చెందిన ఈడిగ లావణ్య(24)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం కుటుంబ కలహాలతో భర్తతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన లావణ్య విషగుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. కాగా లావణ్య భర్త నరేంద్రగౌడు, అత్త, మామలు కలిసి పథకం ప్రకారమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు. తనకు న్యాయం జరిగేవరకు పోస్టుమార్టరు నిర్వహించేది లేదని హాస్పిటల్ మందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. ఎస్ఐ హుస్సేబాషను వివరణ కోరగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
ఐదు రోజులు మృత్యువుతో పోరాటం
వరంగల్ : ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడిన ఓ విద్యార్థిని ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే హసన్పర్తికి చెందిన లిక్కి శంకర్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు అక్షయ(13), కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గొల్లపల్లి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. నగరంలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో అక్షయ 8వ తరగతి చదువుతోంది. ఈనెల 21న అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అవయవాల దానం అక్షయ అవయవాలను దానం చేశారు. కిమ్స్ ఆస్పత్రి వైద్యసిబ్బంది నేత్రాలతో పాటు ఇతర అవయవాలను సేకరించారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య అక్షయ అంతిమయాత్ర సాగింది. పార్థివదేహం ఇంటికి చేరుకున్న సమాచారం అందుకున్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అక్షయ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో తెలివి గల విద్యార్థినిగా ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు. అనంతరం హసన్çపర్తిలో శ్మశాన వాటికలో అక్షయ అంత్యక్రియలు నిర్వహించారు. -
నాన్నా.. చనిపోతున్నా..!
మందస/పలాస: మందస మండలం బిన్నళమదనాపు రం పంచాయతీ వెంకటవర దరాజపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి స్పందన(30) తలసేమియా, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించారు. ఈమె పలాస మండలం మాకన్నప ల్లి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించేవా రు. పుట్టుకతో తలసేమియా వ్యాధితో బాధపడుతు న్న స్పందనకు రెండేళ్ల క్రితం కిడ్నీవ్యాధి సోకింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస తదితర ప్రాంతా ల్లో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం వరకు విధులు నిర్వహించారు. ఆమె పరిధిలో గల చిన్ననీలావతిలో జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న స్పందన ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ద్రవాహారం తీసుకుంటూ..‘నాన్నా.. నేను చనిపోతున్నాను..’ అని బాధతో చెప్పి ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. కళ్లదుటే కుమార్తె మరణించడంతో తల్లిదండ్రులు హేమారావు, వాణిప్రసన్న కన్నీరుమున్నీరు గా విలపించారు. వాణిప్రసన్న పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీలో కార్యదర్శిగా పని చేస్తున్నారు. సోదరి మోనిక ఎంబీబీఎస్, సోదరుడు సాయి బీటెక్ చేశారు. గురువారం స్వగ్రామమైన వీవీఆర్‌పురంలో అంత్యక్రియలు జరిగాయి. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెంబ వాసుదేవరావు, వై.తులసీదాసు, సంక కాళిదాసు, బడియా వల్లభరా వు, ఇప్పిలి చంద్రశేఖర్, తలగాన హేమారావు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని స్పందన కుటుంబానికి సంతాపం తెలిపారు. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
రాయచోటి టౌన్ : అత్తారింటి వేధింపులు తాళలేక చింతమాని నాగేశ్వరి (40) ఆదివారం ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరబల్లి మండలం ఈడిగపల్లెకు చెందిన దాసరయ్యగారి వెంకటరమణ, సులోచనల గారి నాగేశ్వరిని చిన్నమండెం మండలానికి చెందిన నాగేశ్వర (అలియాస్ నగేష్)కు రూ.3 లక్షల డబ్బు, 10 తులాల బంగారం ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు చిన్నమండెం నుంచి 10 సంవత్సరాల క్రితమే రాయచోటికి జీవనోపాధి కోసం వచ్చారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. నగేష్ ప్రైవేట్ పనులు చేస్తుండటంతోపాటు ఓ పత్రిక (సాక్షి కాదు)లో విలేకరిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలలుగా అత్తామామలతో పాటు భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతుండేవి. శనివారం రాత్రి తన పుట్టిన ఊరు అయిన ఈడిగపల్లెలో జరిగే పీర్లపండుగకు వెళ్లాలని భర్తను కోరింది. అందుకు ససేమిరా అన్నారు. అయితే ఆదివారం తమ ఇంటికి భోజనానికి రావాలని మృతురాలి తమ్ముళ్లు ఫోన్ చేయడంతో మళ్లీ భర్తను కోరినట్లు బంధువులు తెలిపారు. తెల్లవారి ఏమి జరిగిందో తెలియదు కానీ 6–7 గంటల మధ్య సమయంలో పిల్లలు అందరినీ బయటకు పంపించారు. నగేష్ ఇంటిలో లేకుండా బయటకు వెళ్లిపోయాడు. అత్త మాత్రం ఇంటిలో ఉంది. స్టోర్ రూంలో నాగేశ్వరి అపస్మారక స్థితిలో పడి ఉంది. తరువాత పిల్లలు బయట నుంచి ఇంటిలోకి వచ్చిన తరువాత గుర్తించడంతో బంధువులకు ఫోన్ చేసి తెలియజేశారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి పడి ఉంది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని కడపకు రెపర్ చేశారు. మార్గంమధ్యంలో మృతి చెందడంతో తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతి తీవ్ర నిర్ణయం..
భద్రాద్రి: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఎస్ఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పాతతండాకు చెందిన భూక్య పావని(24) తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తోంది. తండ్రి లంబి నాయక్ కొంతకాలంగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని పలుమార్లు చెప్పగా, తండ్రి నచ్చచెబుతున్నాడు. మళ్లీ సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఈ నెల 13న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబీకులు కొత్తగూడెం, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి శనివారం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య
ఇంఫాల్: మణిపూర్‌లో ఆగని హింసాకాండ. పాఠశాలలు తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. సెలవులు వాయిదా.. రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని వెళ్లదీస్తోంది. ఇక పాఠశాలలు ఇదివరకే తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు. రెండో రోజునే.. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జులై 5న పాఠశాలలు పునః ప్రారంభం కాగా తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి భయంతో వెనకడుగు వేశారు. దీంతో మొదటి రోజున విద్యార్థుల హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. రెండో రోజున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ లో శిశు నిష్ఠ నికేతన్ పాఠశాల ఎదుట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కాల్చి చంపడంతో స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు మరింత భయాందోళనలకు గురయ్యారు. చనిపోయిన మహిళ వివరాలతోపాటు హంతకులు వివరాలు కూడా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి పోలీసు వర్గాలు. ఆగని హింసాకాండ.. ఇదిలా ఉండగా ఇదే రోజు ఉదయం కంగ్పోక్పి జిల్లాలో మాపావో, సవాంగ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ వర్గాలు ఘర్షణకు దిగగా భద్రతా దళాలు వారిని చెదరగొట్టారు. అంతకుముందు థౌబల్ జిల్లాలో పోలీసుల ఆయుధ కర్మాగారం నుండి ఆయుధాలను ఎత్తుకెళ్లాలని చూశాయి అల్లరిమూకలు. వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సైనికుడి ఇంటిని తగలబెట్టడంతో తలెత్తిన ఘర్షణలో 27 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరో 10 మంది గాయాల పాలయ్యారు. ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి -
బెంగళూరులో హైదరాబాద్ యువతి దారుణ హత్య.. అర్ధరాత్రి ఏం జరిగింది?
కర్ణాటక: సోమవారం రాత్రి బెంగళూరు జీవన్‌బీమా నగర పోలీసుస్టేషన్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష (23)గా గుర్తించారు. ఆమె ప్రియుడు అర్షిత్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ నగరంలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. అర్పిత్ పదోన్నతిపై హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. తన స్నేహితురాలితో కలిసి జీవన్‌బీమా నగర పరిధిలోని కొడిహళ్లిలో అపార్ట్మెంట్లో ఆకాంక్ష ఉండేది. అర్పిత్ హైదరాబాద్ నుంచి వచ్చి అప్పుడప్పుడు ఆమెను కలిసి వెళ్లేవాడు. సోమవారం అర్ధరాత్రి ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అర్పిత్ గొడవ పడ్డాడు. ఈ సమయంలో ఆమెను గొంతు పిసికి హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆకాంక్ష రూంమేట్ విధులు ముగించుకుని తెల్లవారుజామున రూంకు రాగా హత్య విషయం బయట పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అర్పిత్ కోసం గాలింపు చేపట్టారు. -
Delhi Woman's Death Case: వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. విచారణలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలను విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలానే సీసీఫుటేజ్ దృశ్యాలు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ ఘటననే చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మాట్లాడుతూ...ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలిపాడు. అతను తన మిఠాయి షాపు వద్ద ఉండగా.. సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా.. కానీ కారు కదిలినప్పుడూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. తాను పెద్దగా అరుస్తూ వాహనాన్ని ఆపేందుకు మోటారు బైక్‌తో వెంబడించి యత్నించాను కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నరపాటు ఆ యువతి మృతదేహాన్ని 20 కి.మీ దూరం ఈడ్చుకెళ్లారని తెలిపాడు. వారు యూటర్న్ తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాదని దహియా నొక్కి చెప్పాడు. అంతేగాదు సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం వేరయ్యిందని, ఆ తర్వాత నిందితులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ...కారు ఢీ కొట్టడంతో యువతి స్కూటీ నుంచి పడిపోయిందని, ఆ తర్వాత చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. వాహనం రిజిస్టర్ నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వాహనం కిటికీలు మూసి ఉన్నాయి, పైగా సంగీతం బిగ్గరగా వస్తున్నందున్న తమకు ఏం జరిగిందో తెలియలేదని నిందితులు చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పరారయ్యినట్లు పోలీసులకు తెలిపారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 🔴#BREAKING | New CCTV Confirms Witness Account, Car Makes U-Turn, Drags Delhi Woman https://t.co/wPFfrz6eKV pic.twitter.com/DvUDIbbwfM — Breaking News (@feeds24x7) January 2, 2023 (చదవండి: ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది) -
విషాదం... పాముకాటుతో మహిళ మృతి
శ్రీకాకుళం: మూఢ నమ్మకం మరో ప్రాణాన్ని బలికొంది. సకాలంలో వైద్యం చేయించకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయించిన ఫలితంగా ఓ గిరిజన మహిళ కన్నుమూసింది. మందస మండలంలోని గిరిజన ప్రాంతమైన బసవసాయి గ్రామానికి చెందిన సవర సుజాత(30) పాముకాటుకు బలైంది. ఆమె ఆదివారం రా త్రి కుటుంబ సభ్యులతో ఇంటిలో నిద్రిస్తుండ గా అర్ధరాత్రి సమయంలో కట్లపాము ఇంటిలో దూరి సుజాతను కరిచింది. సుజాత కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పాముకాటు ను గుర్తించారు. చుట్టుపక్కల వారు వచ్చి పా మును చంపేశారు. రాత్రి సమయం కావడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. దీని వల్ల సమయం వృథా అయ్యింది. పరిస్థితి విషమించడంతో 108కు సమాచారం అందించారు. సోమవారం ఉదయం ఐదు గంట ల సమయంలో 108 వాహనంలో ఆమెను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త సూర్యనారాయణ, ఐదేళ్ల సుధీర్, మూడేళ్ల సౌజన్య ఉన్నారు. సుజాత మరణంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. మందస జెడ్పీటీసీ సవర చంద్రమ్మబాలకృష్ణతో పాటు పలువురు గిరిజన నాయకులు సుజాత కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు. -
తమ్ముడి తప్పును దాచేసి.. చినబాబు చిందులు
కొంచెం సిగ్గు–లజ్జ... కొంచెం బుద్ధీ–బుర్రా.. ఇంకొంచెం నిజాయితీ కావాలిప్పుడు తెలుగుదేశం పార్టీకి, దాని యువరాజు లోకేశానికి. ఎందుకంటే మద్యం తాగి ఉచ్ఛం నీచం మరిచిపోయి తన కార్యకర్త చేసిన ఘోరానికి.. ప్రభుత్వాన్ని నిలదీసి రచ్చ చేయాలని చూసిన చినబాబు దిగజారుడుతనం ఎవరెస్టును దాటేసింది మరి! పూటుగా తాగిన తెలుగు తమ్ముడు కొర్రపాటి సతీష్ చౌదరి... తనతో అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళను తన స్నేహితుడికి అప్పగించేశాడు. ఆమె ఎదురుతిరిగితే... ఆ స్నేహితుడు చీరకొంగుతో గొంతు బిగించేశాడు. ఆమె మరణించింది. పోలీసులు తేల్చిన వివరాల మేరకు... ఇంతవరకూ ఇది క్రైమ్ స్టోరీయే!. కానీ దీన్ని ప్రభుత్వానికి ముడిపెడుతూ... సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలతో పొలిటికల్ డ్రామా చేయబోయిన నారా లోకేశ్‌ని ఏమనుకోవాలి? తన కార్యకర్త దురాగతాన్ని... తన మీడియా బలంతో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించబోయిన చినబాబును ఏమనాలి? ఎక్కడ ఏం జరిగినా నిజానిజాలతో సంబంధం లేకుండా రాజకీయమే లక్ష్యంగా చెలరేగిపోతున్న తండ్రీకొడుకుల్ని ఏం చేయాలి? ఏం చేయాలన్నది జనానికి తెలుసు. కాకపోతే ఒక్కటి నిజం! తండ్రికి తగ్గ కొడుకే లోకేశ్!! చదవండి: మహిళలకు సంబంధించిన విషయాల్లో రాజకీయం సరికాదు సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: వివాహేతర సంబంధంతో ఓ మహిళ చావుకు టీడీపీ కార్యకర్త ఒకడు కారకుడు కాగా.. నారా లోకేశ్ తమ పార్టీ క్యాడర్‌తో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు దండయాత్ర తరహాలో రావడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. టీడీపీ కార్యకర్త, నారా లోకేశ్ యూత్ టీమ్ సభ్యుడు కొర్రపాటి వెంకటసాయి సతీష్ చౌదరి అఘాయిత్యం వల్లే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వివాహిత వీరంకి తిరుపతమ్మ బుధవారం లైంగిక దాడికి బలైనట్లు స్పష్టమైంది. టీడీపీ కార్యకర్త కొర్రపాటి వెంకట సతీష్ చౌదరి తన కంటే 11 ఏళ్లు పెద్దదైన అదే గ్రామానికి చెందిన బాధితురాలితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. తన స్నేహితుడు శివసత్య సాయిరామ్ కోరికను కూడా తీర్చాలని ఆమెను వేధించాడు. అందుకు అంగీకరించకపోవడంతో శివసత్యసాయిరామ్ ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఈ కేసులో నిందితులను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం 12 గంటల వ్యవధిలోనే పట్టుకుని గురువారం కోర్టులో హాజరు పరిచింది. వివాహేతర సంబంధంతో జరిగిన ఈ హత్యను సామూహిక లైంగికదాడి అంటూ టీడీపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఆ వెంటనే నారా లోకేశ్ బాధితురాలి కుటుంబానికి పరామర్శ పేరుతో మరోసారి శవ రాజకీయానికి తెర తీశారు. మీరే చంపేసి.. మీరే పరామర్శలా? తెనాలిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తుమ్మపూడికి తరలిస్తుండగా లోకేశ్ వచ్చేవరకు వెళ్లనివ్వబోమంటూ మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతోపాటు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మార్చురీ గేటు ముందు బైఠాయించారు. స్వయంగా మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, తమను వెళ్లనివ్వాలని అభ్యర్థించినా ఆలకించలేదు. తోపులాట అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని అంబులెన్సును తుమ్మపూడికి పంపించారు. అనంతరం లోకేశ్ తన కాన్వాయ్‌తో సుమారు 100 కార్లతో బయట నుంచి వచ్చిన కార్యకర్తలతో తుమ్మపూడి చేరుకుని విలేకరులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఆమెను హత్య చేసిందీ టీడీపీ కార్యకర్తేనని స్పష్టం చేశారు. ‘‘మీరే హత్య చేసి ...మీరే పరామర్శకు వస్తారా?...’’ అంటూ నిలదీశారు. దీంతో కంగు తిన్న లోకేష్ బాధితురాలి ఇంటి వద్దే మీడియాతో మాట్లాడేందుకు యత్నించారు. అంత్యక్రియల సమయంలో రాజకీయాలు వద్దని గ్రామస్తులు మరోసారి వారించడంతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. టీడీపీ కార్యకర్త ఒకరు పెద్ద రాయిని గ్రామస్తులపైకి రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రాళ్ల దాడిలో హెడ్‌కానిస్టేబుల్ మాధవ తలకు గాయమైంది. అప్పటికే అక్కడికి చేరుకున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచనల మేరకు పోలీసులు సంయమనం పాటించడంతో బాధితురాలి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అండగా నిలిచిన ప్రభుత్వం హత్యకు గురైన బాధితురాలి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీ వద్ద మృతదేహానికి నివాళులర్పించారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలి: నారా లోకేశ్ రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. దిశ చట్టం ద్వారా హత్య కేసు నిందితులకు 21 రోజుల లోపు ఉరిశిక్ష విధించాలి. నాపై ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఇంకా కేసులు పెట్టినా భయపడేది లేదు. మృతురాలి కుటుంబానికి పార్టీ ద్వారా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. పిల్లలను చదివిస్తాం. నిన్న నాన్న.. నేడు చినబాబు ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా? అనే రీతిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వ్యవహరిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరామర్శ పేరుతో దండయాత్రను తలపించే రీతిలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఇటీవల విజయవాడలో అత్యాచార బాధితురాలికి పరామర్శ పేరిట చంద్రబాబు ప్రభుత్వ ఆసుపత్రిలో వందల మందితో రచ్చ చేశారు. తాజాగా లోకేశ్ తుమ్మపూడికి వందలాది వాహనాలతో ర్యాలీగా వచ్చి తీవ్ర ఉద్రిక్తతలు రేకెత్తించారు. గతేడాది ఆగస్టులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అనంతరం లోకేశ్ వచ్చే వరకూ మృతదేహాన్ని తరలించకుండా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఈసారి తెనాలి అందుకు వేదికగా మారింది. బాధితురాలి మృతదేహాన్ని లోకేశ్ వచ్చి పరామర్శించే వరకూ హాస్పిటల్ నుంచి తరలించడానికి వీలు లేదంటూ టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ముఖ్యమంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని, ప్రభుత్వాన్ని అసభ్య పదజాలంతో దూషించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రి నాగార్జున, ఎమ్మెల్యేలు సుచరిత, ఆర్కే గూండాగిరిని ప్రోత్సహిస్తున్న లోకేశ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రశాంతంగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గూండాగిరిని ప్రోత్సహిస్తున్నారు. పక్క నియోజకవర్గాలనుంచి జెండాలు తగిలించుకుని 80 కార్లతో దండయాత్ర తరహాలో వచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన ఎనిమిది సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు జరగలేదు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు, కొబ్బరిబోండాలు విసిరి పోలీసులను గాయపరిచారు. హత్య కిరాతకం వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ హత్య కిరాతకం. మృతదేహాన్ని తరలించే సందర్భంలో లోకేశ్ వస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం దారుణం. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ నాగార్జున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తుమ్మపూడిలో బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షలు, నివేశన స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తాం. చిలుమూరు ఘటనలోనూ బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, నివేశన స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తాం. ప్రతిపక్షాల చర్యలు శవాలపై పేలాలు ఏరుకుంటున్న మాదిరిగా ఉంది. -
పుష్కరాలకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది
సాక్షి,పాలకొండ రూరల్(శ్రీకాకుళం): శ్రీనగర్‌లో జరుగుతున్న సింధూ నది పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండలోని దేవరపేటకు చెందిన వ్యాపారి బోగాది సీతయ్య, సతీమణి ఆదిలక్ష్మి (53) ఈ నెల 17న పుష్కర స్నానాల కోసం శ్రీనగర్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస ఏర్పాట్లు చేసుకున్న వీరు శనివారం దైవ దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి ప్రయాణంలో భాగంగా బస చేస్తున్న హోటల్‌కు చురుకున్నారు. అదే రోజు రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డికి వెళ్లిన ఆదిలక్ష్మి మృతి చెందారు. ఈ విషయాన్ని సీతయ్య ఫోన్ ద్వారా పాలకొండలోని కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. -
కూల్‌డ్రింక్ తాగి మహిళ మృతి
ఆత్మకూర్–ఎస్(సూర్యాపేట): కూల్‌డ్రింక్ తాగిన మహిళ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కాశీగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీగూడెం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్‌బీ(45) వారం రోజుల క్రితం ఉపాధి హామి కూలీ డబ్బులు తీసుకునేందుకు ఏపూరులోని పోస్టాఫీస్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు తన దూరపు చుట్టమైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బండోని పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా కలిసి కూల్‌డ్రింక్ తాగమని ఇచ్చాడు. కూల్‌డ్రింక్ తాగిన హుస్సేన్‌బీ తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్పటి నుంచి స్థానిక ఆర్ఎంపీ వద్ద చిక్సిత్స పొందుతున్న ఆమెను కుటుంబ సభ్యులు శనివారం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆదివారం మరోసారి అస్వస్థతకు గురై మృతిచెందింది. కూల్‌డ్రింక్‌లో విషం కలపడంతోనే తన తల్లి మృతిచెందిందని మృతురాలి చిన్న కుమారుడు మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. -
Ram Nath Kovind: రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత..మహిళ మృతి
కాన్పూర్(యూపీ): రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం చీఫ్ వందన మిశ్రా(50) ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను కాకాదేవ్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారి వాహనం వెళ్తున్న గోవింద్‌పురీ వంతెన మార్గంలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాహన శ్రేణి వెళ్తోంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ను పోలీసులు ఆపడంతో భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. అందులో వందన వాహనం చిక్కుకుంది. కాన్వాయ్ వెళ్లాక వందనను ఆస్పత్రికి తరలిలించగా అప్పటికే ఆమె మరణించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు కారకులంటూ ఒక సబ్–ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అసీమ్ అరుణ్ చెప్పారు. ఘటనపై క్షమాపణలు చెప్పారు. మృతి విషయం తెల్సి రాష్ట్రపతి కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారని చెప్పారు. అంత్యక్రియలకు హాజరై రాష్ట్రపతి తరఫున సానుభూతిని పోలీస్ కమిషనర్ తెలిపారు. -
పోరాడి ఓడింది..!
నాగులుప్పలపాడు: మాచవరం విద్యుత్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలతో 88 రోజుల కిందట ఒళ్లంతా కాలిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన కాకామాను భాగ్యవతి (35) బతకాలని కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలిస్తాయన్నట్లు గత 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కాస్త కోలుకున్నట్లు, తెలివిగా ఉండటంతో అంతా సంతోషం అనుకున్నారు. ఇంతలోనే విధి వక్రించి ఆదివారం మధ్యాహ్నం ఆమె ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. మే 14వ తేదీన రాపర్ల గ్రామ పొలాల్లో మిర్చి కోతకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ట్రాక్టర్ ఎక్కి వస్తుండగా డొంకకు ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం ట్రాక్టర్ డోరుకు బలంగా తగిలి కరెంటు తీగలు ట్రాక్టర్‌లోని కూలీలపై పడ్డాయి. ఈ సంఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించడంతో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కాకుమాను నాగమణి కాలిన గాయాలతో ఉన్నారు. వీరి ఇరువురిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ అదే రోజు రాత్రికి మరణించాడు. కాకుమాను భాగ్యవతి మాత్రం ఆ రోజు నుంచి కొన ఊపిరితో కొట్టుకుంటూ చికిత్స పొందుతుంది. అయితే 10 రోజుల కిందట నుంచి కాస్తంత కోలుకున్నట్లు తెలివిగా ఉండటంతో కుటుంబ సభ్యులలో బతుకుతుందేమో అన్న కొంత ఆశ కలిగింది. ఆ ఆశలను నీరుగారుస్తూ ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది. మృతురాలుకి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడి వయస్సు మూడేళ్లు ఉంటుంది. -
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం
-
నవ వధువు అనుమానాస్పద మృతి..!
సాక్షి, విజయనగరం: పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు అనుమానాస్పదంగా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కొమరాడలో మంగళవారం వెలుగు చూసింది. సౌజన్య అనే యువతికి గత ఏప్రిల్ 16న సొంత బావతో వివాహం జరిగింది. అయితే, మంగళవారం ఉదయం కుంటుంబ సభ్యులు పొలానికి వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చేసరికి సౌజన్య విగత జీవిగా పడిఉంది. యువతి కుటుంబీకుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిమిత్తం అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుప్రతికి తరలించారు.