శ్రీకాకుళం: మూఢ నమ్మకం మరో ప్రాణాన్ని బలికొంది. సకాలంలో వైద్యం చేయించకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయించిన ఫలితంగా ఓ గిరిజన మహిళ కన్నుమూసింది. మందస మండలంలోని గిరిజన ప్రాంతమైన బసవసాయి గ్రామానికి చెందిన సవర సుజాత(30) పాముకాటుకు బలైంది. ఆమె ఆదివారం రా త్రి కుటుంబ సభ్యులతో ఇంటిలో నిద్రిస్తుండ గా అర్ధరాత్రి సమయంలో కట్లపాము ఇంటిలో దూరి సుజాతను కరిచింది. సుజాత కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పాముకాటు ను గుర్తించారు. చుట్టుపక్కల వారు వచ్చి పా మును చంపేశారు.
రాత్రి సమయం కావడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. దీని వల్ల సమయం వృథా అయ్యింది. పరిస్థితి విషమించడంతో 108కు సమాచారం అందించారు. సోమవారం ఉదయం ఐదు గంట ల సమయంలో 108 వాహనంలో ఆమెను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త సూర్యనారాయణ, ఐదేళ్ల సుధీర్, మూడేళ్ల సౌజన్య ఉన్నారు. సుజాత మరణంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. మందస జెడ్పీటీసీ సవర చంద్రమ్మబాలకృష్ణతో పాటు పలువురు గిరిజన నాయకులు సుజాత కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment