ఇంఫాల్: మణిపూర్‌లో ఆగని హింసాకాండ. పాఠశాలలు తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు.
సెలవులు వాయిదా..
రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని వెళ్లదీస్తోంది. ఇక పాఠశాలలు ఇదివరకే తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు.
రెండో రోజునే..
రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జులై 5న పాఠశాలలు పునః ప్రారంభం కాగా తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి భయంతో వెనకడుగు వేశారు. దీంతో మొదటి రోజున విద్యార్థుల హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది.
రెండో రోజున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ లో శిశు నిష్ఠ నికేతన్ పాఠశాల ఎదుట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కాల్చి చంపడంతో స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు మరింత భయాందోళనలకు గురయ్యారు. చనిపోయిన మహిళ వివరాలతోపాటు హంతకులు వివరాలు కూడా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి పోలీసు వర్గాలు.
ఆగని హింసాకాండ..
ఇదిలా ఉండగా ఇదే రోజు ఉదయం కంగ్పోక్పి జిల్లాలో మాపావో, సవాంగ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ వర్గాలు ఘర్షణకు దిగగా భద్రతా దళాలు వారిని చెదరగొట్టారు. అంతకుముందు థౌబల్ జిల్లాలో పోలీసుల ఆయుధ కర్మాగారం నుండి ఆయుధాలను ఎత్తుకెళ్లాలని చూశాయి అల్లరిమూకలు. వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సైనికుడి ఇంటిని తగలబెట్టడంతో తలెత్తిన ఘర్షణలో 27 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరో 10 మంది గాయాల పాలయ్యారు.
ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి
Comments
Please login to add a commentAdd a comment