woman kiled
-
Karnataka Temple: ఆలయంలో విషాహారం
బెంగళూరు: బెంగళూరు శివారులోని హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయంలో ప్రసాదం తిని ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆలయంలో విషాహారం ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. ఆదివారం ఒక ఆలయంలో అక్కడి భక్తులు ప్రసాదం తిన్నాక వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతూ వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి ఒక మహిళ సోమవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. ఫుడ్ పాయిజన్‌కు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఒక ఆస్పత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం ఐసీయూ పేషెంట్ల కోసం కేటాయించి చికిత్స చేస్తోంది. ప్రసాదం తినడం వల్లే తమ ఆరోగ్యం చెడిపోయిందని కొందరు చెప్పగా, ప్రసాదం తినకపోయినా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఇంకొందరు చెప్పారు! దీనిపై నుంచి నివేదిక రావాల్సి ఉందని పోలీసులన్నారు. -
మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య
ఇంఫాల్: మణిపూర్‌లో ఆగని హింసాకాండ. పాఠశాలలు తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. సెలవులు వాయిదా.. రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని వెళ్లదీస్తోంది. ఇక పాఠశాలలు ఇదివరకే తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు. రెండో రోజునే.. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జులై 5న పాఠశాలలు పునః ప్రారంభం కాగా తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి భయంతో వెనకడుగు వేశారు. దీంతో మొదటి రోజున విద్యార్థుల హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. రెండో రోజున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ లో శిశు నిష్ఠ నికేతన్ పాఠశాల ఎదుట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కాల్చి చంపడంతో స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు మరింత భయాందోళనలకు గురయ్యారు. చనిపోయిన మహిళ వివరాలతోపాటు హంతకులు వివరాలు కూడా తెలియాల్సి ఉందని దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి పోలీసు వర్గాలు. ఆగని హింసాకాండ.. ఇదిలా ఉండగా ఇదే రోజు ఉదయం కంగ్పోక్పి జిల్లాలో మాపావో, సవాంగ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ వర్గాలు ఘర్షణకు దిగగా భద్రతా దళాలు వారిని చెదరగొట్టారు. అంతకుముందు థౌబల్ జిల్లాలో పోలీసుల ఆయుధ కర్మాగారం నుండి ఆయుధాలను ఎత్తుకెళ్లాలని చూశాయి అల్లరిమూకలు. వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సైనికుడి ఇంటిని తగలబెట్టడంతో తలెత్తిన ఘర్షణలో 27 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరో 10 మంది గాయాల పాలయ్యారు. ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్
జి.కొండూరు (మైలవరం) : వాహనాల వేగాన్ని నియంత్రించి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకరే ఓ మహిళ పాలిట యమపాశమైంది. జి.కొండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వియ్యంకురాలి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు విసన్నపేట గ్రామానికి చెందిన పెండెం భావనారాయణ, తన భార్య సత్యవతితో కలిసి శుక్రవారం నందిగామ మండలం చందర్లపాడు గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జి.కొండూరు సమీపంలోకి రాగానే చీకట్లో అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు. దీంతో వేగంగా వస్తున్న బైక్ వెనుక కూర్చున్న సత్యవతి (56) ఎగిరి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
మహిళపై కాల్పులు జరిపి హత్య
లుధియానా: సిక్కుల పవిత్ర గ్రంథం అపవిత్రం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళ మంగళవారం దారుణ హత్యకు గురైంది. లుధియానాలోని గువాడి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఆమెను హత్య చేశారు. మోటారు సైకిల్ పై వచ్చి వారు ఈ ఘాతూకానికి పాల్పడ్డారు. ఆమెను భల్విందర్ కౌర్ అనే మహిళగా గుర్తించారు. గత ఏడాది గువాడి గ్రామంలో భల్విందర్ గౌర్ అనే మహిళ సిక్కుల పవిత్ర గ్రంధాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిందనే కారణంతో పోలీసులు అక్టోబర్ 18న అరెస్టు చేశారు. ఇటీవలె ఆమె విడుదలైంది. అలంఘిర్ సమీపంలోని గురుద్వారాకు వెళ్లి ప్రార్థన ముగించుకొని ఆటో రిక్షాలో తిరిగొస్తున్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఆమె చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.