
కొత్తపల్లి స్పందన(ఫైల్)
మందస/పలాస: మందస మండలం బిన్నళమదనాపు రం పంచాయతీ వెంకటవర దరాజపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి స్పందన(30) తలసేమియా, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించారు. ఈమె పలాస మండలం మాకన్నప ల్లి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించేవా రు. పుట్టుకతో తలసేమియా వ్యాధితో బాధపడుతు న్న స్పందనకు రెండేళ్ల క్రితం కిడ్నీవ్యాధి సోకింది.
విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస తదితర ప్రాంతా ల్లో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం వరకు విధులు నిర్వహించారు. ఆమె పరిధిలో గల చిన్ననీలావతిలో జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న స్పందన ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ద్రవాహారం తీసుకుంటూ..‘నాన్నా.. నేను చనిపోతున్నాను..’ అని బాధతో చెప్పి ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. కళ్లదుటే కుమార్తె మరణించడంతో తల్లిదండ్రులు హేమారావు, వాణిప్రసన్న కన్నీరుమున్నీరు గా విలపించారు.
వాణిప్రసన్న పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీలో కార్యదర్శిగా పని చేస్తున్నారు. సోదరి మోనిక ఎంబీబీఎస్, సోదరుడు సాయి బీటెక్ చేశారు. గురువారం స్వగ్రామమైన వీవీఆర్‌పురంలో అంత్యక్రియలు జరిగాయి. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెంబ వాసుదేవరావు, వై.తులసీదాసు, సంక కాళిదాసు, బడియా వల్లభరా వు, ఇప్పిలి చంద్రశేఖర్, తలగాన హేమారావు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని స్పందన కుటుంబానికి సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment