బాలికలు ఆరోగ్యంపై దృష్టిసారించాలి
మల్కన్‌గిరి: కిశోరీ బాలికలు ఆరోగ్యంపై దృష్టిసారించాలని సంబంధిత అధికారులు అన్నారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి మేండాకులి పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పంచాయతీ స్థాయి కిశోరీ మేళాను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ అధికారి గాంగి సిరగాం బాలికలు ఎదుర్కొనే సమస్యలు.. పరిష్కారంపై అవగాహన కల్పించారు. పది నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు రక్తహీనత, శారీరకమార్పులు సహజమన్నారు. అయితే చాలామంది వీటితో ఆందోళన చెందుతూ చదువును మధ్యలోనే మానేస్తున్నారన్నారు. కొంతమంది బాల్య వివాహాలు చేసుకుంటూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారన్నారు. అనంతరం కిశోరీ బాలికల మధ్య ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సమితి సమన్వయకర్త సౌమ్యా శుభమ్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment