ట్రక్కును ఢీకొన్న కారు
● ఇద్దరు దుర్మరణం
భువనేశ్వర్: ట్రక్కుని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఇన్‌ఫో వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగర శివారు ప్రాంతమైన గంగపడా రోడ్డు పిత్తాపల్లి కూడలి సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పూరీ చందన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బరంపురం నుంచి భువనేశ్వర్‌కు వెళ్తుండగా ట్రక్కుని కారును బలంగా ఢీకొనడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇన్‌ఫో వ్యాలీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
21 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన మహేంద్ర కుమార్ యాదవ్‌గా గుర్తించారు. శనివారం ఉదయం స్థానిక అబ్కారీ శాఖ వోఐసీ సంజయ్ కుమార్ ప్రధాన్ నేతృత్వంలో సిబ్బంది మెలక కుమారి, జి.ధర్మారావు, సందీప్ కుమార్ పాత్రోలో ఎప్పటిలాగే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన యాదవ్‌కు చెందిన బ్యా గులను తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించారు.
హత్య కేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష
రాయగడ: ఓ హత్య కేసుకు సంబంధించి ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బిసంకటక్ ఎస్‌డీజేఎం కోర్టు శనివారం తీర్పునిచ్చింది. జిల్లాలొని బిసంకటక్ సమితి సహడ పంచాయతీ కొణ గ్రామానికి చెందిన జగబంధు కొలక అనే యువకుడిని చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన పది మంది హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలోని అడవిలో తగలబెట్టారు. 2015 డిసెంబరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు బిసంకటక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పట్లో పది మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 18 ఏళ్లలోపు వారు ముగ్గురు ఉన్నారు. అప్పట్లోనే ఒకరు మృతి చెందగా.. మిగతా ఆరుగురు టుకుడు కొలక, పురందర్ కొలక, గుటియా కొలక, దబి కొలక, దాసి తొయిక, దాసిరాం కొలకలకు యాజజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
వ్యభిచార గృహంపై దాడి
జయపురం: వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక మహిళ, ముగ్గురు పురుషులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు స్టేషన్ అధికారి ఈశ్వర తండి శనివారం విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏఎస్‌ఐ పంకజినీ శబర్, ఓఏఎస్‌ఐ ఎస్.దాస్, హవల్దార్ పీసీహెచ్ మాఝీ, కానిష్టేబుల్ బి.ఆర్.కినంగ్, డ్రైవర్ సంతోష్ శనాపతితో కలిసి పెట్రోలింగ్ జరుపుతుండగా బంగళాబెడ గ్రామంలో ఓ అద్దె ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని సమాచా రం అందింది. వెంటనే వెళ్లి దాడులు చేయగా మహిళ, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వస్తువులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ట్రక్కును ఢీకొన్న కారు
Comments
Please login to add a commentAdd a comment