పైపుల చోరీ కేసులో పది మంది అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి పోట్రేల్ పంచాయతీ టేక్‌గూఢ సమీపంలో ఉన్న మేగా జల ప్రాజెక్టు చెందిన పైపులను చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పది మందిని అరెస్టు చేయడంతోపాటు వారి వద్ద నుంచి 102 పైపులు, వాటిని తరలించేందుకు వినియోగించిన ఆరు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బలిమెల ఐఐసీ ధీరాజ్ పట్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. రైతులకు సాగు నీరు అందించేందుకు వీలుగా మెగా జల ప్రాజెక్టు పనులను ప్రభుత్వం ప్రారంభించింది. నీటిని తరలించేందుకు వీలుగా పైపులను టేంతులిగూఢ, ఎంవీ 120 గ్రామం సమీపంలో డక్టెల్ ఐరన్ పైపులను ప్రాజెక్టు అధికారులు నిల్వ ఉంచారు. ప్రాజెక్టు సిబ్బంది పోడియా, కోరుకొండ సమితుల్లో పనిచేస్తున్నారు. 102 ఐరన్ పైపులు ఈ నెల 19వ తేదీన చోరీకి గురైనట్టు సిబ్బంది గుర్తించి 20వ తేదీన బలిమెల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్న పరిశీలించారు. శుక్రవారం రాత్రి ఎంబీ 120 గ్రామం సమీపంలో ఆరు వాహనాల్లో చోరీ చేసిన పైపులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు గుర్తించామని ఐఐసీ ధీరాజ్ పట్నాయక్ తెలిపారు. దీంతో 56 లక్షల విలువైన పైపులు, వాటిని తరలించేందుకు వినియోగించిన ఆరు వాహనాలను స్వాధీనం చేసుకొని పదిమందిని అరెస్టు చేశామని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన వారిలో మహారాష్ట్రకు చెందిన రమేష్ ఆశోక్ యాధవ్, బాబాసో సరేశ్ మస్టే, నితిన్ ప్రకాష్ బోసలే, కర్నాటకకు చెందిన ఎస్.సూర్యకుమార్, మధ్యప్రదేశ్‌కు చెందిన మహ్మద్ హనీఫ్ ఖాన్, త్రిపాల్ ఠాకూర్, ఒడిశాకు చెందిన ఇంద్ర ప్రసాద్ పరిజా, అనంత్ దాస్, హేమాంత్ సుందరా, మిధున్ బారిక్ ఉన్నారన్నారు. వీరిని శనివారం కోర్టులో హాజరు పరిచామన్నారు.
ఆరు వాహనాలు, రూ. 56 లక్షల
విలువైన పైపులు స్వాధీనం
పైపుల చోరీ కేసులో పది మంది అరెస్టు
పైపుల చోరీ కేసులో పది మంది అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment