పెనుగాలుల బీభత్సం
● బోయిపరిగుడ ప్రాంతంలో
నేలకూలిన చెట్లు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బోయిపరిగుడ సమితిలో రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు బీభత్సం సృష్టిస్తుండడంతో భారీ చెట్లు నేలకొరిగాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గాలివానతో బోయిపరిగుడ సమితి కాటపడ పంచాయతీ తాలపొదర రస్తాలో పెద్ద వృక్షం నేలకూలి రోడ్డుపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కాటపడ, కొల్లార్ పంచాయతీ గ్రామాల ప్రజలు రహదారి సంబంధాలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు బోయిపరిగుడ అగ్నిమాపక విభాగ అదికారులు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును ముక్కలుగా కోసి తొలగించటంతో రాకపోకలకు అవరోధం తొలగింది.
Comments
Please login to add a commentAdd a comment