సమతుల్య ఆహారం, వ్యాయామం అవసరం
రాయగడ: ప్రతిఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవడంతోపాటు నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆయాసంతోపాటు వివిధ రోగాల బారినుంచి కాపాడుకోగలమని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ సాహు అన్నారు. స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ సురేష్ కుమార్ స్వగృహంలో హృద్రోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ అనంతరం హృద్రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఊత్తిడికి లోనవ్వడంతో పాటు ఆహార నియమాలు పాటించకపొవడం, వ్యాయామం చేయకపొవడం వంటి కారణాలతో గుండెపోటు బారిన పడుతున్నారని అన్నారు. ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండి ఆహార నియమాలను పాటించగలిగితే హృద్రోగాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వ్యాధుల బారిన పడుతుండడం పరిపాటిగా మారిందని అన్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వృద్ధులు సైతం వ్యాయామం, ఆసనాలు చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో సాయిప్రియ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కె.ఎస్.ఎన్.శర్మ, సుభాష్ చంద్రబెహర పాల్గొన్నారు.
సమతుల్య ఆహారం, వ్యాయామం అవసరం
Comments
Please login to add a commentAdd a comment