దుబ్బాకటౌన్: వివాహం జరిగిన వ్యక్తిని ప్రేమించిందని తల్లిదండ్రులు మందలించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాయపోల్ పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన గుండారం అంజలి(20) అదే గ్రామానికి చెందిన అయ్యగల్ల నాగరాజుతో ప్రేమలో పడి 3 నెలల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
అప్పటికే నాగరాజుకి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు కనిపించడం లేదని అంజలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల తర్వాత అంజలి నాగరాజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గ్రామస్తులు, కుటుంబ సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇటీవల మళ్లీ ఇద్దరూ ఫోన్ మాట్లాడుతుండటంతో అంజలిని తల్లిదండ్రులు మందలించారు.
ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువతి మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికొచ్చి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి బీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment