
సాక్షి, విజయనగరం: పెళ్లైన నాలుగు నెలలకే ఓ నవవధువు అనుమానాస్పదంగా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కొమరాడలో మంగళవారం వెలుగు చూసింది. సౌజన్య అనే యువతికి గత ఏప్రిల్ 16న సొంత బావతో వివాహం జరిగింది. అయితే, మంగళవారం ఉదయం కుంటుంబ సభ్యులు పొలానికి వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చేసరికి సౌజన్య విగత జీవిగా పడిఉంది. యువతి కుటుంబీకుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిమిత్తం అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుప్రతికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment